Home /News /movies /

THESE ARE THE TELUGU WOMEN DIRECTORS WE SHOULD KNOW ON THE WOMENS DAY SR

Women's Day : దర్శకత్వ శాఖలో సత్తాచాటిన తెలుగు మహిళలు..

భానుమతి, విజయ నిర్మల Photo : Twitter

భానుమతి, విజయ నిర్మల Photo : Twitter

Women's Day : మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్బంగా దర్శకత్వ శాఖలో సత్తాచాటిన తెలుగు మహిళా మణుల గురించి చర్చిద్దాం..

    Women's Day : సినిమా అనేది పురుషాధిక్య రంగం. ముఖ్యంగా దర్శకత్వ శాఖలో పనిచేయాలంటే ఎంతో ధైర్యం, దమ్ము ఉండాలి. దీంతో మొదటి నుండి ఈ శాఖలో కానీ అలాంటి రంగంలో కానీ పురుషులదే పైచేయి. అయితే అలాంటి రంగంలో కూడా.. ఎన్నో సవాళ్లు ఎదుర్కోంటూ, ధైర్యాన్నంత కూడబల్కోని సత్తా చాటిన మహిళామణులు ఉన్నారు. ఇప్పడే కాదు సినిమా తొలి తరం నుంచి తమదైన ముద్ర వేసిన మహిళలు ఉన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా వారి గురించి చర్చిద్దాం. తెలుగు మహిళా దర్శకులుగా రాణించిన వారిలో ముందు వరుసలో ఉండే మహిళ భానుమతి రామకృష్ణ. ఈమె స్టార్ హీరోలను సైతం గడగడలాడించిన బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగణించింది. సినీ రంగంలో నటిగా అడుగుపెట్టినా.. ఆ తరువాత డైరెక్టర్‌గా, సంగీత దర్శకురాలిగా, సింగర్‌గా, నిర్మాతగా ఇండస్ట్రీలో తన సత్తాను చాటింది. సుధీర్ఘ కాలంపాటు సినీ రంగంలో కొనసాగిన భానుమతి, తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.

    Telugu Women Directors,women directors,telugu,telugu movies,female directors,telugu directors,telugu top directors,telugu film directors,female film directors,tamil women directors,tollywood director b jaya,women film directors,tamil film women directors,tollywood women directors,banumathi, savithri, nandini reddy, manjula,jaya,బి జయ, నందిని రెడ్డి, జీవితా రాజశేఖర్, సుచిత్రా చంద్రబోస్‌, సుధా కొంగర, మంజుల,
    సావిత్రి, విజయ నిర్మల Photo : Twitter


    భానుమతి తర్వాత ఆ కాలంలోనే దర్శకత్వం రంగంలోకి అడుగుపెట్టిన మహిళా మణుల్లో ముఖ్యంగా సావిత్రి, విజయ నిర్మల ఉన్నారు. ఈ ఇద్దరిలో సావిత్రి మంచి నటిగా పేరు తెచ్చుకుంది కానీ... దర్శకురాలిగా రాణించలేకపోయింది. మరోవైపు విజయ నిర్మల నటిస్తూనే.. సినిమాలను డైరెక్ట్ చేస్తూ.. సినీ రంగంలో ఏ మహిళ సాధించలేని ఘనతను తన సొంతం చేసుకుంది. విజయ నిర్మల దర్శకురాలిగా 40కి పైగా చిత్రాలను రూపొందించి అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్‌ రికార్డ్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఇంతలా ఆకట్టుకున్న వారు లేకపోయిన తమకున్న వనరులతో సినిమాలను తీసి అలరించిన వారిలో ప్రధానంగా బి జయ, నందిని రెడ్డి, జీవితా రాజశేఖర్, సుచిత్రా చంద్రబోస్‌, సుధా కొంగర, మంజుల లాంటి వారు ఉన్నారు.

    Telugu Women Directors,women directors,telugu,telugu movies,female directors,telugu directors,telugu top directors,telugu film directors,female film directors,tamil women directors,tollywood director b jaya,women film directors,tamil film women directors,tollywood women directors,banumathi, savithri, nandini reddy, manjula,jaya,బి జయ, నందిని రెడ్డి, జీవితా రాజశేఖర్, సుచిత్రా చంద్రబోస్‌, సుధా కొంగర, మంజుల,
    బి జయ, నందినీ రెడ్డి Photo ; Twitter
    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Telugu Movie News, Womens Day 2020

    తదుపరి వార్తలు