బాలీవుడ్ ప్రముఖులే కాదు.. ప్రధాని కలిసిన తెలుగు సెలబ్రిటీలు వీళ్లే..

భారత ప్రధాన మంత్రి నిన్న సాయంత్రం ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన పలువురు ప్రముఖులతో సమావేశమైన సంగతి తెలిసిందే కదా. ఈ సమావేశానికి తెలుగు నుంచి..

news18-telugu
Updated: October 20, 2019, 2:53 PM IST
బాలీవుడ్ ప్రముఖులే కాదు.. ప్రధాని కలిసిన తెలుగు సెలబ్రిటీలు వీళ్లే..
ప్రధాని మోదీతో షారుక్ ఖాన్, అమీర్ ఖాన్.
  • Share this:
భారత ప్రధాన మంత్రి నిన్న సాయంత్రం ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన పలువురు ప్రముఖులతో సమావేశమైన సంగతి తెలిసిందే కదా. మహాత్మ గాంధీ 150వ జయంతి పురస్కరించుకొని సినీ, టీవీ రంగాలకు చెందిన వారు రూపొందించిన నాలుగు సాంస్కృతిక వీడియోలను ఆయన రిలీజ్ చేసాడు. సాధారణంగా సినిమా వాళ్లతో రాజకీయ నాయకులు, మాములు ప్రజలు ఫోటోలు దిగడానికి ఎగబడుతుంటారు. కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సెల్ఫీలు దిగడానికి సినీ నటులు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా ఆమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ప్రధానితో సమావేశం అద్భుతంగా ఉందన్నారు. మరోవైపు షారుఖ్ ఖాన్ మాట్లాడుతూ..అందరిని కలుసుకునేందుకు అద్భుతమైన అవకాశం దొరికిందని షారుఖ్ అన్నారు. మరోవైపు ప్రధాన మంత్రి మాట్లాడుతూ.. దేశంలో పర్యాటానికి సంబంధించి కూడా చర్చ జరిగిందన్నారు. మరోవైపు ఈ ప్రోగ్రామ్‌లో రాజ్ కుమార్ హిరానీ,సోనమ్ కపూర్, కంగనా, జాక్వెలిన్ ఫెర్నాండెజ‌్‌తో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

aamir khan, Anurag Basu, bollywood, ekta kapoor, imtiaz ali, Jacqueline Fernandez, kangana ranaut, Narendra Modi, Shah Rukh Khan,change with in,bollywood meets pm modi,బాలీవుడ్ ప్రముఖులతో ప్రధాని మోదీ,మోదీ భేటీ,సినీ ప్రముఖులతో మోదీ భేటీ,
బాలీవుడ్ ప్రముఖులతో ప్రధాని నరేంద్ర మోదీ వెనకాల దిల్ రాజు


ఈ కార్యక్రమంలో ‘వైష్ణవ జనతో’ వీడియోను రూపొందించి మంచి ప్రాచుర్యం కల్పించిన ‘ఈనాడు’ సంస్థల ఎండీ సీహెచ్ కిరణ్..ఈటీవీ సీఈవో బాపినీడు, ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం, దిల్ రాజు, రకుల్ ప్రీత్ సింగ్ సంగీత దర్శకుడు సాలూరు వాసూరావు హాజరయ్యారనట్టు పీఎంవో వర్గాలు పేర్కొన్నాయి. కానీ వీళ్లతో మోదీ భేటి అయిన ఫోటోలు మాత్రం బయటకు రాలేదు. మరోవైపు రాజమౌళి, ప్రభాస్, రానాకు ఆహ్వానం అందినా.. వాళ్లు లండన్‌లో ప్రదర్శితమయ్యే బాహుబలి సినిమా కోసం అక్కడే ఉండటంతో ఈ ఈవెంట్‌కు హాజరు కాలేకపోయినట్టు సమాచారం.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 20, 2019, 2:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading