బాలీవుడ్ షెహెన్‌షా అమితాబ్ బచ్చన్‌కు భారతీయ సినీ పితామహుడు దాదా సాహెబ్‌కు విచిత్రమైన అనుబంధం ఉంది. వివరాల్లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వం 1969లో 17వ జాతీయ చలన చిత్ర అవార్డుల నుంచి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ఇవ్వడం ప్రారంభించారు. హీరోగా అమితాబ్ బచ్చన్ కెరీర్ స్టార్ట్ చేసిన 1969లోనే ఈ అవార్డులు ఇవ్వడం ప్రారంభించారు. అలా తన సినీ జీవితం ప్రారంభమైన యేడాదిలో మొదలైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కేంద్రం ఇవ్వడం ప్రారంభించింది. తాజాగా అమితాబ్ బచ్చన్ తన సినీ జీవితం 50 యేళ్లు పూర్తైయిన యేడాదిలో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకోవడం విశేషం. ఈ అవార్డును హిందీ చిత్ర సీమ నుండి అందుకుంటున్న 32 వ్యక్తి అమితాబ్. మిగతావారు ఇతర భారతీయ భాష రంగం నుంచి ఎంపికయ్యారు. ఈ రకంగా అమితాబ్ బచ్చన్‌కు దాదా సాహెబ్ ఫాల్కేకు విచిత్రమైన బంధం ఏర్పడింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amitabh bachchan, Bollywood, Dadasaheb Phalke Award, Sye raa narasimhareddy, Tollywood