ఈ కారణాలే అనుపమకు అవకాశాల్నీ దూరం చేస్తున్నాయా..

Anupama Parameswaran : అనుపమ.. 'ప్రేమమ్' అనే  సినిమాతో మలయాళ వెండితెరకు పరిచయమైంది.

news18-telugu
Updated: November 14, 2019, 1:54 PM IST
ఈ కారణాలే అనుపమకు అవకాశాల్నీ దూరం చేస్తున్నాయా..
Anupama Parameswaran : అనుపమ.. 'ప్రేమమ్' అనే  సినిమాతో మలయాళ వెండితెరకు పరిచయమైంది.
  • Share this:
Anupama Parameswaran : అనుపమ.. 'ప్రేమమ్' అనే  సినిమాతో మలయాళ వెండితెరకు పరిచయమైంది. ఆ సినిమా కేరళలో సూపర్ హిట్‌‌ అవ్వడంతో  ఈ భామకు తెలుగులో  త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ ఆ'లో అవకాశం వచ్చింది. ఆ సినిమాలో గడుసు పిల్లగా అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఆ  తర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేస్తూనే ఉందీ ఈ మలయాళీ భామ. అయితే టాలీవుడ్‌లో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్‌తో నటించిన లేటెస్ట్ మూవీ రాక్షసుడు మంచి విజయం అందుకుంది. ఆ సినిమాలో టీచర్ పాత్ర చేసిన అనుపమ తన నటనతో అందరిని ఆకట్టుకుంది.
 View this post on Instagram
 

Chilapol ......Thani Nadan......athallle oru rasam ?🌺🍃 (Sometimes....purely traditionally......that’s cool ryt?)🌺🍃


A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) on

అయితే కెరీర్ ప్రారంభం నుండి గ్లామర్ రోల్స్ కి చాలా దూరంగా ఉంటుంది అనుపమ. ఆమె పొట్టి బట్టలేసుకుని, గ్లామర్ ఒకలబోసి నటించిన సినిమాలు లేవని చెప్పోచ్చు. ఇదే విషయమై మట్లాడుతూ.. గ్లామర్ రోల్స్ నాకు అసలు సూట్ కావు అంటోంది. అంతేకాదు పొట్టిబట్టల్లో నటించడం తనకు ఇష్టం ఉండదని.. సినిమా కోసం తప్ప, మిగతా సమయాలలో మేకప్ కూడా వేసుకోనని.. వీలైనంత వరకు సహజంగా ఉండటానికి ఇష్టపడతనంటోంది. అయితే ఈ కారణాలే వల్లే ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అవకాశాలు తగ్గిపోయని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఏదీ ఏమైనా సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం, నేను ఇలాగే ఉంటాను.. నాకు కొన్ని సిద్దాంతాలు ఉన్నాయని కూర్చుంటే మాత్రం అవకాశాలు తగ్గే అవకాశం మెండుగానే ఉంది.
అందాలతో కేక పుట్టిస్తున్న కియారా..
Published by: Suresh Rachamalla
First published: November 14, 2019, 1:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading