పునర్నవికి సోషల్ మీడియాలో ఉన్న పేర్లు ఇవే...

అలీ మాట్లాడుతూ పునర్నవికి సోషల్ మీడియాలో చాలా పేర్లు ఉన్నాయన్నారు.

news18-telugu
Updated: November 16, 2019, 4:02 PM IST
పునర్నవికి సోషల్ మీడియాలో ఉన్న పేర్లు ఇవే...
పునర్నవి (Instagram/punarnavib)
  • Share this:
పునర్నవి బిగ్ బాస్ తెలుగు సీజన్ 3తో ఫుల్ పాపులర్ అయిపోయింది. ఇక బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌తో ఆమెకు ఉన్న ప్రత్యేక అనుబంధం మరింతగా పునర్నివికి ప్రచారం కల్పించింది. ఇప్పటివరకు ఆమె పలు సినిమాల్లో నటించిన.. వాటితో అంతగా తనకు పేరు రాలేదు కానీ... బిగ్ బాస్ షోతో మాత్రం పునర్నవి మంచి ఫేమ్‌ను సొంతం చేసుకుంది. తాజాగా పున్ను, రాహుల్ జంట అలీతో సరదాగా కార్యక్రమానికి కలిసి వచ్చారు. ఈ సందర్భంగా వీరికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలు అభిమానులతో షేర్ చేసుకున్నారు. అలీ మాట్లాడుతూ పునర్నవికి సోషల్ మీడియాలో చాలా పేర్లు ఉన్నాయన్నారు. పునర్నవికి పులిహోరా రాణి, కోపిష్టి పిల్ల అనే పర్లు నెటిజన్లు పెట్టారన్నారు. అలీ ఆ మాటలు చెప్పగానే... పున్ను, రాహుల్ ఇద్దరు నవ్వుకున్నారు. బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు పునర్నవి అనేకసార్లు హౌస్‌లో ఉన్న మిగతా వాళ్లపై సీరియస్ అయిపోయింది. అందుకే బహుశా ఆమెకు కోపిష్టి పిల్ల అనే పేరు పెట్టి ఉంటారన్నారు.

First published: November 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>