Kajal Aggarwal: ఇంతకీ కాజల్ అగర్వాల్ అడుగులు ఎటు వైపు..

దక్షిణాది హీరోయిన్‌గా ముద్ర వేసుకున్న అందాల చందమామ కాజల్ అగర్వాల్ 2004 లో ఐశ్వర్యారాయ్ హీరోయిన్‌గా నటించిన ఒక బాలీవుడ్ సినిమాలో చిన్నపాత్రలో  సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఈ భామ అడుగులు..

news18-telugu
Updated: September 19, 2019, 8:46 AM IST
Kajal Aggarwal: ఇంతకీ కాజల్ అగర్వాల్ అడుగులు ఎటు వైపు..
కాజల్ అగర్వాల్ Instagram/kajalaggarwalofficial
  • Share this:
దక్షిణాది హీరోయిన్‌గా ముద్ర వేసుకున్న అందాల చందమామ కాజల్ అగర్వాల్ 2004 లో ఐశ్వర్యారాయ్ హీరోయిన్‌గా నటించిన ఒక బాలీవుడ్ సినిమాలో చిన్నపాత్రలో  సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత 2007 లో తేజ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘లక్ష్మి కళ్యాణం’ చిత్రంతో తెలుగు సినీరంగానికి పరిచమైన ఈ బ్యూటీ. గత పుష్కర కాలంగా తెలుగులో ఒక వెలుగు వెలుగుతూనే ఉంది కాజల్ అగర్వాల్. అయితే ఇటీవల విడుదలైన 'సీత', 'రణరంగం' సినిమాలు డిజాస్టర్స్ అవటంతో కాజల్ అగర్వాల్ పరిస్దితి తెలుగులో చాలా కష్టంగా మారింది. అదీకాక ఆమె నటించిన బాలీవుడ్ ‘క్వీన్’ రీమేక్ ‘ప్యారిస్ ప్యారిస్’ సెన్సార్ చిక్కుల్లో పడింది. ఆ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో తెలియని పరిస్థితి.

Instagram/kajalaggarwalofficial


ఇక ‘భారతీయుడు 2’ చిత్రం ఇప్పుడిప్పుడే పట్టాలెక్కింది. ఐతే తెలుగులో ఒక్క ఆఫర్ కూడా లేని ఈ టైమ్ లో అజయ్ భూపతి చిత్రం మహా సముద్రంలో రవితేజ సరసన ఛాన్స్ వచ్చినట్టే వచ్చి చేజారి పోయింది. దాంతో తెలుగులో కాజల్ కి ఒక్క ప్రాజెక్ట్ కూడా లేని పరిస్థితి. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ‘అ’ మూవీకి సీక్వెల్‌ తెరకెక్కబోతున్నట్టు ప్రచారం జరగుతోంది. అది కూడా కన్ఫామ్  కాలేదు. ఇపుడు రానా హీరోగా నందిని రెడ్డి దర్శకత్వంలో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం. మరోవైపు హిందీలో జాన్ అబ్రహం హీరోగా ‘ముంబాయి సాగా’లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇవి తప్పించి కాజల్ చేతిలో మరో సినిమాలు లేవు.

కాజల్ అగర్వాల్ (Instagram/Photo)


ఇక హీరోయిన్‌గా కాజల్ఆరిటైర్మెంట్ టైమ్ అని, ఆమె నెక్ట్స్ లెవిల్‌కు వెళ్లాల్సిన సమయం వచ్చేసిందని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. పోనీ తన తోటి హీరోయిన్స్ త్రిష, నయనతార, శ్రేయ లాగ హీరోయిన్ ఓరియెంటెడ్ రోల్స్ చేద్దామా అంటే...ఆమె పై ఇండిడ్యువల్ గా బిజినెస్ జరిగే పరిస్దితి లేదు.ప్రస్తుత పరిస్థితిలో యంగ్ హీరోల సరసన నటించే అవకాశం లేదు. దీంతో కాజల్‌కి ఏంచెయ్యాలో అర్ధం కావడంలేదు అని టాక్. దాంతో కాజల్ తను ఇప్పుడు ఏ వైపు టర్న్ తీసుకోవాలనే ఆలోచనలో ఉందట.
First published: September 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading