Nayanthara: నయనతార గురించి తెలియని సంచలన నిజాలు ఇవే..

సౌత్ లో నయనతారకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నయనతార లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. తాజాగా తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను మీడియాతో పంచుకుంది.

news18-telugu
Updated: September 11, 2019, 10:42 AM IST
Nayanthara: నయనతార గురించి తెలియని సంచలన నిజాలు ఇవే..
నయనతార (Twitter/Photo)
  • Share this:
సౌత్ లో నయనతారకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నయనతార లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అంతేకాదు స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశం వస్తే గ్లామర్ రోల్స్ కూడా చేస్తోంది. ప్రస్తుతం నయనతార ప్రముఖ తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో సహజీవనం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే నయనతార గత జీవితంలోకి వెళితే అనేక ఆసక్తికర విషయాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తాయి.నయనతార తండ్రి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. ఆయనలోని క్రమశిక్షణ నయనతారకు చిన్నప్పటి నుంచే అలవడింది. అంతేకాదు నయన్ చిన్నతనం నుంచే డేరింగ్ అండ్ డాషింగ్‌గా  ఉండేది. తల్లిదండ్రుల మాట లెక్క చేసేది కాదు. అంతా తన ఇష్ట ప్రకారమే చేసేది. క్రిస్టియన్ అయినప్పటికీ హేతువాదిగా ఉండేది. హిందూ మతంపై ఆమెకు చిన్నతనం నుంచే ఆసక్తి ఉండేదట.

ప్రియుడు విఘ్నేష్ శివన్‌తో నయనతార (file Photo)


అప్పట్లో బాపు దర్శకత్వంలో బాలకృష్ణ శ్రీరాముడిగా ‘శ్రీరామరాజ్యం’లో సీత పాత్ర ఆమెను వెతుక్కుంటూ వచ్చింది.  అంజలి దేవి లాంటి గొప్ప నటి చేసిన సీత పాత్ర తనకు చేసే అవకాశం రావడం ఎంతో గొప్పగా ఫీలైందట నయనతార. ఈ జీవితానికి ఈ తృప్తి చాలనుకుని ‘శ్రీరామరాజ్యం’  తర్వాత సినిమాల నుంచి తప్పుకుని ప్రభుదేవాతో పెళ్లికి సిద్ధం అయ్యింది కూడా.

Jr ntr Will play ravana brahma character in allu aravind 3D Ramayana movie in 3d with 1500 crore budget with 3 Parts,jr ntr,jr ntr as ravana brahma,jr ntr jai lavakusha,jr ntr ravanasurudu,ramayana,ramayanam,brahma,jr ntr,mana oori ramayanam trailer,jr ntr fantastic explanation about ravana character,ravana,ramayan,ramayanam telugu,jr ntr ramayya vasthavayya telugu movie,surpanakha from ramayana,ramayanam in telugu,ramayana for kids in telugu,ravana character,the ramayana,ramayanam stories in telugu,story after ramayan,rama ramayanam,ramayan ramanand sagar,unknown facts about ramayana,allu aravind,allu aravind twitter,allu aravind movies,allu aravind magadheera,allu aravind ramayana,allu aravind ramayana 3d,allu aravind madhu vanthena,Producers Allu Aravind Madhu Mantena Namit Malhotra,allu aravind ramayanam,Nitesh Tiwari ramayana,ravi udyawar ramayana,allu aravind to produce ramayana movie,allu aravind to produce ramayana movie with rs 500 cr,ramayana movie,ramayana,allu arjun,allu aravind ramayana movie,allu aravind to produce ramayana,allu aravind ramayana,ramayan,allu aravind produce ramayana,allu aravind 500 cr project,ramayanam,allu aravind planning ramayan with rs 500 cr,telugu cinema,జూనియర్ఎన్టీఆర్,తారాక్,ఎన్టీఆర్ రావణ బ్రహ్మా,ఎన్టీఆర్ రావణాసురుడు,రామాయణ,ఎన్టీఆర్ రావణాసురుడు,ఎన్టీఆర్ రావణ,ఎన్టీఆర్ జైలవకుశ, 3డి రామాయణ,అల్లు అరవింద్ రామాయణ,నితేష్ తివారి రామాయణ,రవి ఉద్యావర్ రామాయణ,తెలుగు సినిమా
శ్రీరామరాజ్యంలో సీతారాములుగా బాలకృష్ణ,నయనతార (ఫైల్ ఫోటో)


నయనతారకు పెళ్లికి ముందు ప్రభుదేవా కొన్ని కండీషన్లు పెట్టాడు. ఆ కండీషన్లన్నంటికీ ఒప్పుకుంది. తన ఆస్తులు కూడా ప్రభుదేవ వశం చేసింది. నాకు నువ్వు భర్తగా ఉంటే చాలు అని కోరుకుంది. అయితే ప్రభుదేవా వైఫ్ లత.. ఆ సమయంలో చేసిన రచ్చ సౌత్ ఇండియానే షేక్ చేసింది. నా భర్తను ఇంకొకరి భర్తగా చేసే అవకాశం ఇవ్వను భీష్మించుకుని కూర్చుంది. చచ్చిపోయే వరకు నిరాహార దీక్ష చేస్తానని పూనుకుంది.దీంతో ప్రభుదేవాతో పెళ్లి ఆలోచన మానుకుంది.

ప్రభుదేవాతో నయనతార (file Photo)


అంతకు ముందు నయనతార  కెరీర్ తొలినాళ్లలో తన తోటి నటుడు  శింబుతో ప్రేమాయణం సాగించిన సంగతి తెలిసిందే కదా.  ఆ తర్వాత అతడితో తెగతెంపులు చేసుకుంది. అప్పట్లో  శింబుతో చేసిన 'వల్లభన్' సినిమాలో నయనతార చేసిన లిప్ లాక్ పెద్ద హైలెట్ అయింది. అయితే వీరి పెళ్లికి శింబు తండ్రి టి రాజేందర్ ఒప్పుకోలేదు.
శింబుతో నయనతార (File Photo)


ఇలా లిప్ లాక్ సీన్లు చేసిందంటే ఆమెకు పెద్దలు అంటే భయం, భక్తి లేదు అందుకే నీతో అలాంటి సీన్లు ఓపెన్ గా చేసింది. నాకైతే పెళ్లి ఇష్టం లేదు అని చెప్పాడు. అందుకే అప్పట్లో వీరి పెళ్లి జరుగలేదు. తాజాగా నయనతార.. విఘ్నేష్ శివన్‌తో సహ జీవనం చేస్తుంది. తాజాగా వీరి పెళ్లి ఎపుడు అనగా.. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం తనకు లేదని ఖరా ఖండిగా చెప్పేసింది. దీంతో విఘ్నేష్‌తో నయనతార వ్యవహరం సహ జీవనం వరకే పరిమితమా అని ఇండస్ట్రీ జనాలు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం నయనతార హీరోయిన్‌గా నటించిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
Published by: Kiran Kumar Thanjavur
First published: September 11, 2019, 10:42 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading