బిగ్ బాస్ సీజన్ 5 (Bigg Boss Telugu ) చూస్తుండగానే 10 వ వారంలోకి అడుగు పెట్టేసింది. హౌస్ లో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారనే విషయంలో కాస్త ఉత్కంఠే అని చెప్పాలి. ఎందుకంటే.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనుకున్నా వాళ్లు కూడా హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతున్నారు. తాజాగా విశ్వా బయటకు రావడం దీనికి బలాన్ని చేకూరినట్లు అవుతోంది. విశ్వా 9 వ ఎలిమినేటర్ గా హౌస్ నుంచి బయటకు వచ్చాడు. అతడిని హౌస్ లో హీరో అంటూ కూడా బిరుదు ఇచ్చారు. రెండు సార్లు కెప్టెన్ అవ్వడం.. బెస్ట్ పర్మార్ గా, బెస్ట్ ఆర్ఎంగా, బెస్ట్ గేమర్ గా గుర్తింపు తెచ్చుకున్నా.. హౌస్ లో అతడికి స్థానం లేకుండా అయింది.
ఈ నిర్ణయంపై హౌస్ మేట్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. నెటిజన్లు కూడా బిగ్ బాస్ నిర్వాకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హౌస్ లో ఆటతో పని లేదు.. కేవలం బయటక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే సరిపోతుంది అనే దానికి ఈ ఘటన ఒక్కటే ఉదాహరణ అంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. 10 వ వారంలోకి అడుగు పెట్టిన బిగ్ బాస్.. నామినేషన్ లో ఎవరు ఉన్నారనే విషయం లీకుల ద్వారా బయటకు వచ్చేసింది. 9 వ వారంలో మొత్ం ఎనిమిది మంది నామినేషన్లో ఉండగా.. ఈ సారి ఆ సంఖ్య 5కు తగ్గింది. నామినేషన్లో ఉన్న సభ్యులు ఎవరంటే.. సిరి, రవి, సన్నీ, మానస్ మరియు కాజల్. ఇందులో రవి మాత్రం రెండు వారాలు మినహా ప్రతీ వారం నామినేషన్లోకి వస్తున్నాడు.
యానీ మాస్టర్ కెప్టెన్ కాబట్టి నామినేషన్స్‌లో లేరు. లేదంటే యానీ మాస్టర్ పేరు కూడా నామినేషన్స్‌లోకి వచ్చేది. ఇదిలా ఉండా.. హౌస్ లో రోజులు గడుస్తున్నా కొద్ది.. హౌస్ మేట్స్ మధ్య బంధాలు బలపడుతున్నాయి. ఒకరిని ఒకరు పూర్తిగా అర్థం చేసుకుంటున్నారు. హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్లిన భావోద్వేగంతో బాధపడుతున్నారు. అయితే హౌస్ లో ఎంత చేసినా.. ఎన్ని టాస్క్ లు ఆడినా బయట ప్రేక్షకులు వేసే ఓట్లపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
అయితే నామినేషన్లోకి వచ్చిన సభ్యుల్లో ఎక్కువగా ఈ వారం ఎలిమినేట్ అయ్యే సూచలను కాజల్ కే ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. వచ్చిన వాళ్లల్లో మానస్, రవి, సన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. మొదటి నుంచి కూడా వళ్లు సేఫ్ లోనే ఉంటున్నారు.
ఇక పోతే మిగిలిన ఇద్దరిలో సిరి, కాజల్ లో.. సిరికి షణ్ముఖ్ జశ్వంత్ ఓట్లు పడే అవకాశం ఉంది. ఇక మిగిలినది కాజల్ మాత్రమే. ఆమె ఈ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారనేది బయట వినిపిస్తున్నా టాక్. చూడాలి మరి ఎవరి భవిష్యత్ ఎలా ఉంటుందో.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor ravi, Bigg Boss 5, Bigg Boss 5 Telugu, Bigg boss 5 telugu buzz, Bigg boss telugu, Siri