Home /News /movies /

THERE IS A COMPARISON ON ONE ISSUE BETWEEN RASHMI GAUTAM AND SAMEERA SHERIEF NK

ఆ విషయంలో రష్మీ గౌతమ్, సమీరా షరీఫ్... ఇద్దరూ ఒకటే

సమీరా షరీఫ్ (credit - insta - sameerasherief) రష్మీ గౌతమ్ (credit - insta - RashmiGautam)

సమీరా షరీఫ్ (credit - insta - sameerasherief) రష్మీ గౌతమ్ (credit - insta - RashmiGautam)

Rashmi Gautam and Sameera Sherief : ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో యాంకర్ రష్మీ గౌతమ్, అదిరింది షో యాంకర్ సమీరా షరీఫ్ మధ్య ఎన్నో వైరుధ్యాలున్నా... ఓ విషయంలో మాత్రం ఇద్దరూ ఒకటే. అదేంటో తెలుసుకుందాం.

    Rashmi Gautam and Sameera Sherief : ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో యాంకర్ రష్మీ గౌతమ్ తెలుగు వారందరికీ తెలిసిన అమ్మాయే. కామెడీ షోలో యాంకర్‌గా, తెలుగు వెండితెరపై హీరోయిన్‌గా ఎన్నో పాత్రలు చేస్తూ... ఎప్పుడూ చలాకీతనంతో అందర్నీ ఆకట్టుకుంటుంది రష్మీ. ఒక్కో సందర్భంలో తనపై సెటైర్లు వేసేవారిపై తను కూడా అంతే స్ట్రాంగ్ కౌంటర్లు వెయ్యడంలో రష్మీ వెనకడుగు వెయ్యదు. ఐతే... తెరపై ఇలా ఢీ అంటే ఢీ అనే ఈ బ్యూటీ... తెరవెనక ఎంతో సౌమ్యురాలు. జంతువులన్నా, మూగ జీవాలన్నా రష్మీకి ఎంతో ప్రేమ. ఎప్పటికప్పుడు వాటిని కాపాడాలంటూ సోషల్ మీడియాలో సందేశాలు ఇస్తూనే ఉంటుంది. తన ఇంట్లో బంబుల్ అనే కుక్కను పెంచుకుంటోంది. ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఆ కుక్కను కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉంటుంది. ఇలా యానిమల్ లవర్‌గా కూడా రష్మీ అందరికీ పరిచయమే.

    రష్మీ గౌతమ్ (credit - insta - RashmiGautam)


    రష్మీ గౌతమ్ (credit - insta - RashmiGautam)


    జీ తెలుగులో వస్తున్న కామెడీ షో అదిరిందిలో యాంకరింగ్ చేస్తున్న సమీరా షరీఫ్ కూడా యానిమల్ లవరే. ఆమెకు కూడా మూగ జీవాలంటే ఎంతో ప్రేమ. ఎన్నో సందర్భాల్లో ఆమె మూగ జీవాలపై ప్రేమ చూపిస్తోంది. ఆడపిల్ల సీరియల్ ద్వారా తెలుగువారికి పరిచయమైన సమీరా... ఆ తర్వాత తెలుగులోనే 'అన్నా చెల్లెల్లు', 'భార్యామణి', 'Dr. చక్రవర్తి', 'ముద్దు బిడ్డ' వంటి చాలా సీరియల్స్‌లో నటించింది. నటిగా నిరూపించుకున్న సమీరా... ఆ తర్వాత నిర్మాతగా మారి తమిళంలో సీరియల్స్‌ను కూడా నిర్మిస్తోంది. అంతేకాదు అక్కడి సీరియల్స్‌లో నటిస్తోంది కూడా. తాజాగా జీ తెలుగులో అదిరింది కామెడీ షోకు యాంకరింగ్ చేస్తూ మరోసారి తెలుగువారిని పలకరించింది. తెరపై నవ్వులు పూయించే సమీరా కూడా జంతువులు, మూగ జీవాలంటే ప్రేమ కురిపిస్తుంది. కుక్కలు, పిల్లులంటే ఆమెకు చాలా ఇష్టం. ప్రస్తుతం జబర్దస్త్, అదిరింది షోల మధ్య పోటాపోటీ నడుస్తోంది. తెరపై ఈ ఇద్దరు యాంకర్లూ నువ్వా నేనా అనుకుంటున్నా... తెరవెనక మాత్రం వీళ్ల మనసుల్లో మూగ జీవాలపట్ల ఒకేరకమైన ప్రేమభావం ఉండటం విశేషం.

    సమీరా షరీఫ్ (credit - insta - sameerasherief)


    సమీరా షరీఫ్ (credit - insta - sameerasherief)


    సమీరా షరీఫ్ (credit - insta - sameerasherief)
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Adirindi comedy show, Anchor rashmi gautam, Jabardasth comedy show, Sameera Sherief

    తదుపరి వార్తలు