‘సాహో’లో అదిరిపోయే ట్విస్ట్.. ఫ్యాన్స్‌కు పండగే..

Saaho: బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో శ్రద్ధాకపూర్‌ హీరోయిన్. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

news18-telugu
Updated: August 25, 2019, 11:58 AM IST
‘సాహో’లో అదిరిపోయే ట్విస్ట్.. ఫ్యాన్స్‌కు పండగే..
ప్రభాస్ సాహో (Source: Twitter)
  • Share this:
బాహుబలి సినిమాతో భారతీయ సినీ పరిశ్రమలో ప్రభాస్ పేరు మార్మోగిపోయింది. బాహుబలి2 తర్వాత అతడి గురించి ఏ చిన్న వార్త వినిపించినా ట్రెండ్ అయ్యింది. ప్రభాస్ పెళ్లి, తదుపరి సినిమా.. ఇలా ప్రతీది వైరలైంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో శ్రద్ధాకపూర్‌ హీరోయిన్. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాలో ప్రభాస్‌ రూ.2 వేల కోట్ల దోపిడికి సంబంధించిన కేసును ఛేదించే అండర్‌ కవర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. అయితే, ఈ చిత్రంలో ప్రభాస్ ఫ్యాన్స్‌ పండగ చేసుకునే ట్విస్ట్ ఉండబోతోందని సమాచారం. అది ప్రభాస్ పాత్రేనట. ప్రభాస్‌ సాహో సినిమాలో డ్యుయల్ రోల్‌లో కనిపించబోతున్నట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ, చిత్రబృందం మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

కాగా, సుజిత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిచింది. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, జాకీ ష్రాఫ్‌, వెన్నెల కిశోర్‌, అరుణ్‌ విజయ్‌, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇదిలా ఉండగా, సాహో సినిమాలో ప్రభాస్ కేరెక్టర్ పేరు అశోక్ చక్రవర్తి అని కూడా తెలుస్తోంది.

First published: August 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు