Theatres reopened in AP: గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్‌లో అక్కడ తెరుచుకున్న థియేటర్స్..

ఏపీలో తెరుచుకున్న థియేటర్స్

Theatres reopened in AP: అక్టోబర్ 15 నుంచి థియేటర్స్ తెరుచుకోవచ్చు అంటూ గత నెలలోనే కేంద్రం అనుమతులు ఇచ్చింది. అయితే కర్ణాటక లాంటి రాష్ట్రాలు థియేటర్స్ తెరిచి మళ్లీ మూసేసాయి. సగం టికెట్స్ అమ్ముకుంటే అస్సలు గిట్టుబాటు కావడం..

  • Share this:
అక్టోబర్ 15 నుంచి థియేటర్స్ తెరుచుకోవచ్చు అంటూ గత నెలలోనే కేంద్రం అనుమతులు ఇచ్చింది. అయితే కర్ణాటక లాంటి రాష్ట్రాలు థియేటర్స్ తెరిచి మళ్లీ మూసేసాయి. సగం టికెట్స్ అమ్ముకుంటే అస్సలు గిట్టుబాటు కావడం లేదని వాళ్లు ఓకే చెప్పలేదు. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అయితే ముందు నుంచి కూడా థియేటర్స్ యాజమాన్యం ఒకే మాటపై ఉన్నారు. ఇక్కడ థియేటర్స్ తెరిచే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. ప్రభుత్వం అనుమతులు ఇచ్చినా కూడా థియేటర్లు తెరవదలుచుకోలేదంటూ ఎగ్జిబిటర్లు చెప్పుకొచ్చారు. ఇరు రాష్ట్రాల్లోనూ ఇదే జరుగుతుంది. అయితే కొంతమంది ఎగ్జిబిటర్లు మాత్రం ఇప్పటికే థియేటర్లు తెరిచారు. ముఖ్యంగా నవంబర్ 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో థియేటర్లు తెరుచుకున్నాయి. ప్రభుత్వ అనుమతి వచ్చిన వెంటనే ఏపీ రాష్ట్రవ్యాప్తంగా మల్టీప్లెక్సులతో పాటు.. విశాఖలోని జగదాంబ లాంటి ప్రముఖ థియేటర్లు తెరుచుకున్నాయి. ఇప్పుడు నవంబర్ 1 నుంచి విజయవాడలోని పాపులర్ థియేటర్లను తెరిచారు.
theatres opening in vijayawada,unlock 5 guidelines in india, unlock 5 guidelines in Telangana, unlock 5 date, unlock 5 Andhra pradesh, unlock 5 Hyderabad, unlock 5 news, unlock 5 guidelines, unlock 5 Bangalore, Unlock 5 Rules, Unlock 5 New Guidelines, School College Reopening News, Unlock 5 October, Unlock Phase 5 News, Coronavirus Lockdown, Covid 19 Guidelines, Cinema hall reopening, Theatre reopening, MHA Guidelines, Ministry Of Home Affairs,Unlock 5.0 Guidelines,Unlock 5.0 Guidelines central government,Unlock 5.0 Guidelines cinema theatres,Unlock 5.0 Guidelines multiplexes,Unlock 5.0 Guidelines October 15th,విజయవాడలో తెరుచుకున్న సినిమా థియేటర్స్,మల్టీప్లెక్సులు ఏపీలో రీ ఓపెనింగ్
సినిమా థియేటర్స్ (cinema theatres)

సరిలేరు నీకెవ్వరు, కనులు కనులను దోచాయంటే లాంటి సినిమాలను మళ్లీ ప్రదర్శిస్తున్నారు. ఇప్పట్నుంచి ప్రతీవారం వచ్చే ప్రేక్షకులను బట్టి థియేటర్స్ ఓపెన్ చేస్తామని చెప్తున్నారు ఎగ్జిబిటర్లు. ఎందుకంటే కరోనా గతంతో పోలిస్తే ఇప్పుడు అంతగా లేదు.. అందుకే రాష్ట్రంలోని థియేటర్స్ అన్నీ తెరిచే పనిలో ఉన్నారు ఎగ్జిబిటర్లు. ఎలాగూ రాష్ట్రంలో కరోనా ఫ్రీ ప్రాంతాలు కూడా రోజురోజుకీ పెరుగుతున్నాయి. దాంతో ఊపిరి పీల్చుకుంటున్నారు ప్రజలు. వీటితో పాటు కొన్ని కొత్త సినిమాలు కూడా షెడ్యూల్ అవుతున్నాయి. సోలో బ్రతుకే సో బెటరు సినిమాను పరిస్థితులు చూసి డిసెంబర్‌లో విడుదల చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా వచ్చిన తర్వాత మరిన్ని కూడా విడుదల కానున్నాయి. ఇప్పట్నుంచి సెట్ చేస్తే కానీ సంక్రాంతికి పరిస్థితులు అన్నీ సెట్ అవ్వవని భావిస్తున్నారు. మరి చూడాలిక.. అప్పటికైనా సిచ్యువేషన్స్ సెట్ అవుతాయో లేదో..?
Published by:Praveen Kumar Vadla
First published: