హోమ్ /వార్తలు /సినిమా /

Theatres : ఒక్క క్లిక్ తో మీరు సినిమా థీయేట‌ర్‌నే బుక్ చేసుకోవ‌చ్చు.. న‌యా ఐడియాతో ముందుకొచ్చిన హైద‌రాబాద్ సంస్థ‌..

Theatres : ఒక్క క్లిక్ తో మీరు సినిమా థీయేట‌ర్‌నే బుక్ చేసుకోవ‌చ్చు.. న‌యా ఐడియాతో ముందుకొచ్చిన హైద‌రాబాద్ సంస్థ‌..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Theatre In One Click | ఒక్క క్లిక్ తో మీరు సినిమా థియేట‌ర్ (Theatres) నే బుక్ చేసుకోవ‌చ్చు.... న‌యా ఐడియా తో ముందుకొచ్చిన హైద‌రాబాద్ (Hyderabad) సంస్థ‌... అవును.. కేవ‌లం మీ కుటుంబం (Family) కోస‌మే థియేట‌ర్‌ లో సినిమా వేస్తే?  మీరు త‌ప్ప థియేట‌ర్ లో ఎవ‌రు ఉండ‌క‌పోతే....మీ కుటుంబంతో ఏకాంతంగా సినిమాని చూసే అవ‌కాశం క‌ల్పిస్తే..? ఏంటీ  ఎంత ఖ‌ర్చు అవుతుందో అని భ‌య‌ప‌డుతున్నారా? మ‌న కోసం సినిమా వేస్తే ఆ బ‌డ్జెట్ త‌ట్టుకోగ‌ల‌మా అని ఆలోచిస్తోన్నారా.

ఇంకా చదవండి ...

Theatre In One Click | ఒక్క క్లిక్ తో మీరు సినిమా థియేట‌ర్ (Theatres) నే బుక్ చేసుకోవ‌చ్చు.... న‌యా ఐడియా తో ముందుకొచ్చిన హైద‌రాబాద్ (Hyderabad) సంస్థ‌... అవును.. కేవ‌లం మీ కుటుంబం (Family) కోస‌మే థియేట‌ర్‌ లో సినిమా వేస్తే?  మీరు త‌ప్ప థియేట‌ర్ లో ఎవ‌రు ఉండ‌క‌పోతే....మీ కుటుంబంతో ఏకాంతంగా సినిమాని చూసే అవ‌కాశం క‌ల్పిస్తే..? ఏంటీ  ఎంత ఖ‌ర్చు అవుతుందో అని భ‌య‌ప‌డుతున్నారా? మ‌న కోసం సినిమా వేస్తే ఆ బ‌డ్జెట్ త‌ట్టుకోగ‌ల‌మా అని ఆలోచిస్తోన్నారా. అయితే ఈ స్టోరీ మీరు చ‌ద‌వాల్సిందే.. గ‌డిచిన రెండేళ్లుగా మ‌న జీవితాల్లో కోవిడ్ (Covid -19) విపరీత‌మైన మార్పులు తీసుకొచ్చింది. హాలిడే ట్రిఫ్ మాట ప‌క్క‌న ప‌డితే కుటుంబంతో క‌లిసి స‌ర‌దాగా సినిమాకి వెళ్ల‌దామ‌న్న  బిక్కు బిక్కుమంటు కూర్చోవ‌ల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. కోవిడ్ ప్యాండమిక్ టైమ్‌లో కొంత మంది హీరోలు తమ సినిమాలను థియేటర్స్‌లో కాకుండా.. డైరెక్ట్‌గా అమెజాన్, నెట్‌ఫ్లిక్స్, హాట్ స్టార్, ఆహా వంటి పలు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో తమ సినిమాలను రిలీజ్ చేస్తున్నారు.

ఎంత ఓటీటీలో సినిమా చూసినా.. థియేటర్స్‌లో చూసిన ఎక్స్‌పీరియన్స్ ముందు ఇవన్ని దిగదుడుపే. సినిమా విడుదలైన నెల రోజుల్లోపే బడా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి.  అందుబాటులోకి వస్తోన్న..  అందుకే ప్రేక్షకులు మంచి సినిమా వస్తే.. థియేటర్స్‌ వైపు పరుగులు తీస్తున్నారు.

బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ మరో రికార్డు.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..

ప్రస్తుతం మన దేశం ఓమైక్రాన్ రూపంలో థర్డ్ వేవ్‌లోకి ప్రవేశించింది. దీంతో సంక్రాంతికి రావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’ (RRR), ‘రాధే శ్యామ్’ వంటి సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. ముఖ్యంగా ప్రజలు..  ప‌బ్లిక్ గేథ‌రింగ్స్ ఉన్నప్రాంతాల‌కు వెళ్లాలంటేనే ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకోవాల్సిన ప‌రిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో కుటుంబాల‌తో బ‌య‌ట‌కి వెళ్లే ప‌రిస్థితులు లేవు. థీయేట‌ర్స్, మాల్స్ ఓపెన్ చేసిన‌ప్ప‌టికి ఎక్కువ ర‌ద్దీ ఉండే ప్రాంతాలు కావ‌డంతో అక్క‌కి వెళ్ల‌డానికి వెన‌క‌డుగు వేస్తోన్నారు చాలా మంది.

Meena Corona : కోవిడ్ బారిన పడ్డ మీనా కుటుంబం.. సినీ ఇండస్ట్రీని కమ్మేస్తోన్న కరోనా..


అయితే క్లోజ్డ్ గ్రూప్‌తో మాత్రమే పెద్ద స్క్రీన్‌ని (Large Screen) అనుభవించాలనుకునే వారిని లక్ష్యంగా చేసుకుని, స్టార్ ట్రాక్ గ్రూప్ కుటుంబాల కోసం హైదరాబాద్‌లో ప్రైవేట్‌గా నిర్వహించబడుతున్న లగ్జరీ హోమ్ థియేటర్‌ను ప్రారంభించింది.  సికింద్రాబాద్‌లో ఈ థీయేట‌ర్ ను ప్రారంభించింది ఈ సంస్థ‌. ఈ థియేట‌ర్ లో మీరు సినిమా చూడాలనుకంటే రెండు లేదా మూడు రోజుల ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.  ఈ సంస్థ అందుబాటులో ఉంచిన వెబ్‌సైట్ ద్వారా ఎవ‌రైన ఈ థియేట‌ర్ ను బుక్ చేసుకోవ‌చ్చు అంటున్నారు సంస్థ ప్ర‌తినిధులు.

Ram Charan : RRR తర్వాత తగ్గేదేలే అంటున్న రామ్ చరణ్.. చెర్రీ లిస్టులో పెరుగుతోన్న క్రేజీ డైరెక్టర్స్ లిస్ట్..


నార్మ‌ల్ రోజుల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య రూ. 1,500 వీకెండ్స్ లో వారాంతాల్లో రూ. 1,700 చెల్లించి ఈ ప్రైవేట్ హోమ్ థియేటర్‌ను అద్దెకు తీసుకోవచ్చు.  కోవిడ్ ప్రేక్షకులు సినిమాలను చూసే విధానాన్ని మార్చేసింది. న‌గ‌రంలో థియేట‌ర్లు తెరుచుకున్న‌ప్ప‌టికీ చాలా మంది జాగ్ర‌త్త‌గా థియేట‌ర్ కు వెళ్లి కూర్చోవాలంటేనే చాలా భ‌య‌ప‌డుతున్నారు.

Chiranjeevi : కూతురు సుస్మిత మూవీని చూసి మెచ్చుకున్న చిరంజీవి..


దీంతో మాకు వ‌చ్చిన ఈ ఐడియాను ఇలా ఇంప్లిమెంట్ చేసామంటున్నారు.  ఇది బిగ్ స్క్రీన్‌ను కేవ‌లం ఒక కుటుంబం మాత్ర‌మే కూర్చోని చూసే అవ‌కాశం క‌ల్పిస్తే ఎలా ఉంటుంద‌నే ఆలోచ‌న నుంచి వ‌చ్చిందే ఈ ప్రైవేట్ హోమ్ థియేటర్ స్క్రీనింగ్ కాన్సెప్ట్ అని స్టార్ ట్రాక్ గ్రూప్ బిజినెస్ హెడ్ వినయ్ ధనపాలన్ న్యూస్18 కి తెలిపారు. ఈ మినీ-థియేటర్‌లో హై-ఎండ్ ప్రొజెక్షన్, సౌండ్ సిస్టమ్ సౌక‌ర్యాలు ఉన్నాయి.

Nayanthara - Mehreen : లేడీ సూపర్ స్టార్ నయనతారతో మెహ్రీన్ కౌర్.. పిక్స్ వైరల్..


వీటితోపాటు లగ్జరీ రిక్లైనర్లు వంటి ప్రత్యేక నైట్ స్కై ఎఫెక్ట్‌లు ఉన్నాయి. ఈ  ప్రైవేట్ థియేటర్‌లో మూడు వరుసల లగ్జరీ రిక్లైనర్లు తోపాటు సరౌండ్ సౌండ్ సిస్టమ్ మరియు 15 సౌండ్ స్పీకర్లు తో 143 అంగుళాల స్క్రీన్‌ని ను ఏర్పాటు చేశారు నిర్వాహ‌కులు. మీరు ఈ మినీ థియేటర్ ను ఈ వెబ్ సైట్ https://sites.google.com/view/startrackgroup/testimonials ద్వారా బుక్ చేసుకోవచ్చు.

(Byline Balakrishna, News18, Hyderabad)

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Bollywood news, Theatres, Tollywood

ఉత్తమ కథలు