హోమ్ /వార్తలు /సినిమా /

Theatres in Telangana: థియేటర్స్‌లో 100 శాతం ప్రేక్షకులకు అనుమతులిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు..

Theatres in Telangana: థియేటర్స్‌లో 100 శాతం ప్రేక్షకులకు అనుమతులిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు..

Theatres in Telangana: రీసెంట్‌గా కేంద్ర ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్స్ బయట ఫిబ్రవరి 1 నుంచి థియేటర్స్‌లో 50 శాతం నుంచి 100 శాతం ప్రేక్షకులను అనుమతులిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. అందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 100 సీటింగ్‌కు అనుమతులిస్తూ ఉత్వర్వులు జారీ చేసారు.

ఇంకా చదవండి ...

  Theatres in Telangana: అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలలో భాగంగా అక్టోబర్ 15 నుంచి థియేటర్స్ రీ ఓపెన్ చేసుకోవడానికి కేంద్రం అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే.. అందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే  తుది నిర్ణయం తీసుకోవాలని కేంద్రం తెలియజేసింది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో 50 శాతం ఆక్యుపెన్షీతో థియేటర్స్, మల్టీప్టెక్స్ ఓపెన్ చేసుకోవడానికి కేంద్రం పర్మిషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా.  కరోనా కారణంగా  కేంద్రం గతేడాది మార్చిలో విధించిన లాక్‌డౌన్ కారణంగా థియేటర్స్ , మల్టీప్లెక్స్ మూతపడ్డాయి. దాంతో పాటు షూటింగులు ఆగిపోయాయి. ఐతే.. కేంద్రం ప్రతి రంగంలో ఆంక్షలు సడలిస్తూ వచ్చింది. ఇప్పటికే సంక్రాంతికి విడుదలైన సినిమాలు 50 శాతం ఆక్యుపెన్షీతో ప్రేక్షకులను థియేటర్స్ వైపు వచ్చేలా చేయడంలో సక్సెస్ అయ్యాయనే చెప్పాలి. దీంతో మిగతా హీరోలు, నిర్మాతలకు మంచి కంటెంట్ ఉండే.. సినిమాలు చూడటానికి ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారన్న విషయం స్పష్టం అయింది.

  రీసెంట్‌గా కేంద్ర ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్స్ బయట ఫిబ్రవరి 1 నుంచి థియేటర్స్‌లో 50 శాతం నుంచి 100 శాతం ప్రేక్షకులను అనుమతులిస్తూ మార్గదర్శకాలు విడుదల చేసింది. దీనిపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్రం ప్రకటించింది. తాజాగా కేంద్రం మార్గదర్శకాల అనుగుణంగా తెలంగాణలోని థియేటర్స్‌‌లో 100 శాతం ప్రేక్షకులను అనుమతులిచ్చేలా ప్రభుత్వం అనుమతులిస్తూ జీవో జారీ చేసింది.

  100 శాతం సీటింగ్‌కు అనుమతులు ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు (Twitter/Photo)

  అంతేకాదు 100 శాతం అనుమతులిచ్చినా.. కరోనా నియమ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. అంతేకాదు ప్రేక్షకుల మధ్య ఆరడుగుల భౌతిక దూరంతో పాటు మాస్కులు, శానిటైజర్లు, టెంపరేజర్ చెకింగ్ వంటి కరోనా ప్రోటోకాల్స్‌తో పాటు ప్రేక్షకుల నుంచి ఐడీ వివరాలు కూడా తీసుకోవాలంటూ పేర్కొంది. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం ఒకడుగు ముందుకు వేసి థియేటర్స్ వచ్చే ప్రేక్షకుల అడ్రస్ తీసుకోవాంటూ థియేటర్స్ యాజమాన్యాలకు ఉత్తర్వులు జారీ చేసింది.  మొత్తంగా థియేటర్స్‌కు 100 శాతం ప్రేక్షకులను అనుమతులిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై నిర్మాతలు, హీరోలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  First published:

  Tags: Central Government, CM KCR, Multiplex, Telangana Government, Theatres, Tollywood

  ఉత్తమ కథలు