చలన చిత్ర పరిశ్రమకు థియేటర్స్ సంఘం స్ట్రాంగ్ వార్నింగ్..

టికెట్లు ఆన్‌లైన్‌లో మాత్రమే విక్రయించాలి.

ప్రస్తుతం చలన చిత్ర పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఒకవైపు పైరసీ రక్కసీ, మరోవైపు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌తో సామాన్య ప్రేక్షకులు అసలు థియేటర్స్ వైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ విషయమై చిత్ర సీమకు థియేటర్స్ సంఘ యాజమాన్యం గట్టి వార్నింగే ఇచ్చింది.

  • Share this:
    ప్రస్తుతం చలన చిత్ర పరిశ్రమ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఒకవైపు పైరసీ రక్కసీ, మరోవైపు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌తో సామాన్య ప్రేక్షకులు అసలు థియేటర్స్ వైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో చాలా మటుకు థియేటర్స్ ప్రేక్షకులు లేక బోసి పోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే.. ముందు ముందు థియేటర్స్ మనుగడ కష్టమే. ఈ విషయమై చిత్ర సీమకు థియేటర్స్ సంఘ యాజమాన్యం గట్టి వార్నింగే ఇచ్చింది. ఐతే .. ఇది తెలుగు చిత్ర పరిశ్రమ గురించి కాదు.. తమిళ చిత్ర పరిశ్రమను ఉద్దేశించి అక్కడి థియేటర్ యాజమాన్యలు హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం సినిమాలపై విధిస్తున్న వినోద పన్ను 8 శాతాన్ని వెంటనే రద్దు చేయాలన్నారు. అంతేకాదు పెద్ద చిత్రాల కారణంగా నష్టపోతే.. ఆ నష్టాన్ని చిత్ర నటీనటులే భరించాలని థియేటర్స్ సంఘం డిమాండ్ చేసింది. అలాగే సినిమాలను 100 రోజులకు ముందు డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లో విడుదల చేయకూడదని కూడా సూచించింది. ఒకవేళ తమ డిమాండ్స్ ఒప్పుకోకపోతే.. మార్చి 1 నుంచి థియేటర్స్‌ను నిరవధికంగా మూసి వేస్తామని  హెచ్చరించారు. మరి దీనిపై కోలీవుడ్ చిత్ర పరిశ్రమ ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: