Home /News /movies /

THEATER IS LIKE TEMPLE FOR US PRABHAS SENSATIONAL COMMENTS ON FOR WATCHING MOVIES IN THEATERS

Prabhas: ఇంట్లో పూజ గది ఉందని గుడికి వెళ్లటం మానేస్తామా?.. ప్రభాస్ కీలక వ్యాఖ్యలు..!

ప్రభాస్

ప్రభాస్

సీతారామం మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ మాట్లాడుతూ.. సీతారామం లాంటి సినిమా తియ్యాలి అంటే మామూలు విషయం కాదన్నారు. ఇక జనం థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడాలని ప్రభాస్ కోరారు.

    స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సీతారామం'. రష్మిక మందన కీలక పాత్ర పోహిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో దృశ్యకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ఆగస్ట్5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభాస్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

    సీతారామం మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ మాట్లాడుతూ.. సీతారామం లాంటి సినిమా తియ్యాలి అంటే మామూలు విషయం కాదన్నారు. ట్రైలర్ ఎవరుకట్ చేశారో కాని అద్భుతంగా ఉందన్నారు. కొన్నిసినిమాలు థియేటర్లలోనే చూడాలన్నారు. సీతా రామం సినిమాని థియేటర్ లోనే చూడాలని ప్రేక్షకులక పిలుపు నిచ్చారు ప్రభాస్. ఇంట్లో పూజ గది ఉంది కదా అని గుడికి వెళ్ళడం మనేస్తామా ? ఇది అంతే అంటూ ప్రభాస్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

    మాకు థియేటర్స్ గుడులు లాంటివన్నారు డార్లింగ్. తప్పకుండా సినిమాని థియేటర్ లో చూడాలని పిలుపు నిచ్చారు. ఇక ఈ సందర్భంగా స్టేజ్ పై వచ్చిన ప్రభాస్ సీతారామం నిర్మాత అశ్వనీదత్ కూతురు స్వప్న దత్ స్టేజ్ పైకి రావాలంటూ పట్టుబట్టారు. ఆమె వస్తేనే నేను మాట్లాడతానన్నారు ప్రభాస్. దీంతో స్వప్న స్టేజ్ పైకి వచ్చి ప్రభాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభాస్‌ను రమ్మని చాలా ఇబ్బందిపెట్టానన్నారు. సాధారణంగా ప్రభాస్ బయటకు రాడు అలాంటింది. తన కోసం వచ్చినందకు ధన్యవాదాలు తెలిపారు స్వప్న.
    Published by:Sultana Shaik
    First published:

    Tags: Prabhas, Sita Ramam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు