THE WINNER OF DHEE13 HAS BEEN IDENTIFIED THIS VIDEO WENT VIRAL ON SOCIAL MEDIA VB
D13 Dance Show Winner: ఢీ13 డ్యాన్స్ షో విన్నర్ ఎవరో తెలిసిపోయింది..! లీకైన వీడియో.. మీరూ చూసేయండి..
ప్రతీకాత్మక చిత్రం
D13 Dance Show Winner: ఈటీవీ లో ప్రసారం అవుతున్న డ్యాన్స్ షో ‘ఢీ’. ఈ షో ద్వారా ఎంతో మంది కొరియోగ్రాఫర్లు, డ్యాన్సర్లు బయటకు వచ్చారు. అయితే తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల షోలు వస్తున్నాయి.. పోతున్నాయి. కానీ, కొన్ని మాత్రమే ఏళ్ల తరబడి ప్రసారం అవుతూ ప్రేక్షకులకు అలరిస్తున్నాయి. అందులో ఒకటి ఢీ. అయితే ఢీ13 విన్నర్ ఎవరో ప్రస్తతుం సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కెర్లు కొడుతోంది. మీరూ తెలుసుకోండి..
ఈటీవీ లో ప్రసారం అవుతున్న డ్యాన్స్ షో ‘ఢీ’ (Dhee). ఈ షో ద్వారా ఎంతో మంది కొరియోగ్రాఫర్లు, డ్యాన్సర్లు(Dancers)బయటకు వచ్చారు. అయితే తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల షోలు వస్తున్నాయి.. పోతున్నాయి. కానీ, కొన్ని మాత్రమే ఏళ్ల తరబడి ప్రసారం అవుతూ ప్రేక్షకులకు మరో రకమైన ఉత్సాహాన్ని పంచుతున్నాయి. అదే సమయంలో ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాయి. అలాంటి కార్యక్రమాల్లో ప్రసారం అవుతోన్న షో 'ఢీ' ఒకటి. ఇది దక్షిణ భారతదేశంలోనే బిగ్గెస్ట్ రియాల్టీ షోగా (Biggest Reality Show) పేరొందింది. సీజన్ల మీద సజన్లు పూర్తి చేసుకుంటూ .. 13 వ సీజన్ జరుపుకుంటోంది. వచ్చే వారం నుంచి ఈ షో ఫినాలే ఎపిసోడ్ జరగబోతుంది. అయితే, అంతకంటే ముందే అంటే తాజాగా ఈ సీజన్ విన్నర్ పేరు లీకైపోయింది. దానికి సంభందించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఢీ 13 అనేది కింగ్ వర్సెస్ క్వీన్స్ పేరిట ప్రసారం అవుతోంది. గతంలో మాదిరిగానే కాకుండా మొత్తం ఇందులో కొత్త వాళ్లను తీసుకొచ్చారు. . దీంతో ఈ సీజన్ పోటీ పోటీగా జరుగుతూ వచ్చింది. అందుకే గత వాటి కంటే ఈ సీజన్‌కు మరింత రెస్పాన్స్ వస్తోంది. మొదటి నుంచి కూడా ఈ షో ఎంతో ఉత్కంఠబరితంగా సాగింది. అమ్మాయిలు, అబ్బాయిలకు మధ్య పోటీగా మొదలెట్టారు.
కింగ్స్ టీమ్‌కు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది.. క్వీన్స్ జట్టుకు రష్మీ గౌతమ్, దీపిక పిల్లి మెంటర్లుగా వ్యవహరిస్తున్నారు. జడ్జ్‌లుగా గణేష్ మాస్టర్, పూర్ణ, ప్రియమణిలు ఉన్నారు. స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేస్తున్నాడు. ఈ షోలో డ్యాన్స్ లతో పాటు కామెడీ కూడా ప్లస్ అయింది. అందుకే ఈ షో టీఆర్పీలో దూసుకుపోతోంది. ఇక ’ఢీ 13' డాన్స్ షో ఫైనల్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రానున్నట్లు ఇప్పటికే ప్రదీప్ అనౌన్స్ చేశారు.
ఢీ 13 షో ఫైనల్స్‌కు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. దానికి సంబంధించిన ప్రోమో కూడా విడుదలైంది. పుష్ప ది రైజ్ చిత్రంలో 'ఏ బిడ్డా ఇది నా అడ్డా..' అనే సాంగ్‌కు డానర్స్ స్టెప్స్ వేస్తుండగా బన్నీ ఎంట్రీ ఇచ్చారు. వారితో పాటు ఆయన కూడా స్టెప్పులేశాడు. త్వరలోనే ఢీ 13 ఫైనల్ ఎపిసోడ్స్ ప్రసారం కానుంది. ఢీ 13లో కింగ్స్ వర్సెస్ క్వీన్స్ మధ్య పోటీలో ఎవరు విజేతలో తెలుసుకోవాలని అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో ఓ వీడియో లీక్ అవ్వడం ఇప్పుడు షాకింగ్ గా ఉంది.
ఈ షో విజేత ఎవరనే సస్పెన్స్ ఈ వైరల్ వీడియో వలన వీడిపోతోంది. షోకు సంబంధించిన కీలక ఘట్టం విన్నర్ ఎవరా అన్నది. విజేతను ప్రకటించే విషయాన్ని స్పష్టంగా తెలియజేసే విషయాన్ని వీడియో ద్వారా తెలిపారు. ఇద్దరు ఫైనలిస్ట్ ల చేయిని అల్లు అర్జున్ పట్టుకుని ఉండగా.. కౌంట్ డౌన్ మొదలైంది. అప్పటి వరకూ ఉన్న సస్పెన్స్ కు తెరదించుతూ ఓ అమ్మాయి చేయిని అల్లు అర్జున్ పైకి లేపాడు.
అంతే విన్నర్ ఎవరో తెలిసిపోవడంతో ఆమె బృందం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇంతకూ ఆ విన్నర్ ఎవరంటే.. 'కావ్య' అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.