హోమ్ /వార్తలు /సినిమా /

Pawan Kalyan | Hari Hara Veera Mallu : హరి హర వీరమల్లు నుంచి అదిరిన వారియర్స్ వే వీడియో.. కేక పెట్టిస్తోన్న పవన్ కళ్యాణ్..

Pawan Kalyan | Hari Hara Veera Mallu : హరి హర వీరమల్లు నుంచి అదిరిన వారియర్స్ వే వీడియో.. కేక పెట్టిస్తోన్న పవన్ కళ్యాణ్..

పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ సినిమాపై కీలక అప్‌డేట్ (Twitter/Photo)

పవన్ కళ్యాణ్ ‘హరి హర వీర మల్లు’ సినిమాపై కీలక అప్‌డేట్ (Twitter/Photo)

Pawan Kalyan | Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. ఓ వైపు ఏపీ రాజకీయాలు చేస్తూనే వరుస సినిమాల్లో నటిస్తున్నారు. అందులో భాగంగా క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అనేక వాయిదాల తర్వాత ఇటీవలే మొదలైంది.

ఇంకా చదవండి ...

    పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. ఓ వైపు ఏపీ రాజకీయాలు చేస్తూనే వరుస సినిమాల్లో నటిస్తున్నారు. అందులో భాగంగా క్రిష్ జాగర్లమూడి (Krish Jagarlamudi) దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అనేక వాయిదాల తర్వాత ఇటీవలే మొదలైంది. ఇక అది అలా ఉంటే పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం తాజాగా కొన్ని రిహార్సల్స్‌ చేశారు. సినిమాలో ఓ కీలకసన్నివేశం కోసం ఆయన ఫైట్ మాస్టర్స్‌తో ప్రాక్టీస్ చేసారు. దీనికి సంబంధించి ఇటీవల కొన్ని పిక్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఈ ప్రాక్టీస్‌కు ఓ సూపర్ వీడియోను విడుదల చేసింది టీమ్. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన చేతిలో ఉన్న బడిసేను వడిగా తిప్పుతూ.. కేక పెట్టిస్తున్నారు. దీంతో ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అంటే ఆ మాత్రం ఉంటుందంటూ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ (Nidhi Aggerwal) హీరోయిన్‌గా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ ప్యాన్ ఇండియా సినిమా ఇప్పటికే దాదాపు 60 శాతం మేర షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇక ఈ షెడ్యూల్ కోసం కూడా టీమ్ భారీ సెట్టింగ్స్ సిద్ధం చేశారట టీమ్. అంతేకాదు ఈ సినిమాను ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేసే యోచనలో టీమ్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు దసరా కానుకగా హరి హర వీరమల్లు (Hari Hara Veera Mallu) చిత్రాన్ని మేకర్స్ అక్టోబర్ 5 న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని టాక్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ వ‌జ్రాల దొంగగా క‌నిపించ‌నున్నాడ‌ని అంటున్నారు. పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి పాన్ ఇండియన్ సినిమా ఇది. హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhi Aggerwal) హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి (Keeravani) సంగీతం అందిస్తున్నారు.

    మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ యం రత్నం (AM Ratnam) నిర్మిస్తున్నారు. ఈ సినిమా పవన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఈచిత్రం ఆడియో హక్కులను ప్రముఖ సంస్థ టిప్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. టిప్స్ సంస్థ హరిహర వీరమల్లు సినిమా ఆడియో రైట్స్‌ను భారీ ధరకు దక్కించుకుందని అంటున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.  ఇక మరోవైపు పవన్ త్వరలో తమిళ రీమేక్ వినోదయ సీతమ్ రీమేక్‌లో నటించనున్నారు. ఈ సినిమా అతి త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. సాయి ధరమ్ తేజ్ మరో కీలకపాత్రలో నటించనున్నారు. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందించనున్నారు. సముద్రఖని దర్శకత్వం వహించారు. ఇక ఆయన నటించిన లేటెస్ట్ సినిమా భీమ్లా నాయక్ (Bheemla Nayak) విషయానికి వస్తే... ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

    ఇక పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గబ్బర్ సింగ్ అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ పూర్తిగా కమర్షియల్ అంశాలతో రాసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్  లెక్చరర్‌గా కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్‌ కూడా పూర్తైంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది టీమ్.  ఈ సినిమాకు భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. పవన్ కళ్యాణ్ ఓ సినిమాను (Surender Reddy) సురేందర్ రెడ్డితో చేస్తున్నట్లు ఆ మధ్య అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. రామ్ తాళ్లూరి నిర్మాతగా . సురేందర్ రెడ్డి (Surender Reddy), వక్కంతం వంశీ కాంబినేషన్‌లో ఈ సినిమా రావాల్సి ఉంది. అయితే ఈ సినిమా ఆగిపోయిందని అంటున్నారు. ఈ విషయంలో పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అయితే కథ విషయంలో భిన్నాభిప్రాయాలు రావడంతో సినిమా ఆగిపోయిందని టాక్.

    Published by:Suresh Rachamalla
    First published:

    Tags: Hari Hara Veera Mallu, Pawan kalyan

    ఉత్తమ కథలు