Home /News /movies /

THE WARRIOR MOVIE TRAILER TALK REVIEW RAM POTHINENI ANOTHER ACTION PACKED DRAMA TA

The Warrior Trailer Talk Review : ది వారియర్ థియేట్రికల్ ట్రైలర్ టాక్ రివ్యూ.. గూస్ బంప్స్ తెప్పించేలా రామ్ యాక్షన్..

రామ్ పోతినేని థియేట్రికల్ ట్రైలర్ విడుదల (Twitter/Photo)

రామ్ పోతినేని థియేట్రికల్ ట్రైలర్ విడుదల (Twitter/Photo)

Ram Pothineni | The Warriorr : టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని  (Ram Pothineni)  నటించిన లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల చేసారు.

    Ram Pothineni | The Warriorr : టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని  (Ram Pothineni)  నటించిన లేటెస్ట్ మూవీ ‘ది వారియర్’.  తమిళ డైరెక్టర్ లింగుసామితో  డైరెక్ట్ చేశారు. ఈ చిత్రంలో రామ్ తొలిసారి పోలీస్ పాత్రలో నటించారు.  ఈ సినిమాలో రామ్ సరసన ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి  (krithi shetty)నటించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీటైంది.  ఇక షూటింగ్ పూర్తి అవ్వడంతో టీమ్ పోస్ట్ ప్రోడక్షన్ పనులపై ఫోకస్ చేయనుంది. మంచి అంచనాల నడుమ వస్తోన్న ఈ సినిమా జూలై 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతోంది. ఇక ఇటీవల (Ram Pothineni)  రామ్ లుక్ ఒకటి విడుదలై సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. జూలై 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతుండడంతో.. ప్రమోషన్స్‌ను జోరు మొదలు పెట్టింది టీమ్. అందులో భాగంగా ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన  హై వోల్టేజ్ యాక్షన్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

    ఆది పినిశెట్టిని విలన్‌గా కనిపించనున్నారు. కృతి శెట్టి క్యూట్‌గా మెరిసింది. ఈ సినిమా నుంచి విడుదల చేసిన బుల్లెట్ సాంగ్ తెలుగు, తమిళ వెర్షన్ కలిపి 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి సంచలనం రేపింది. తాజాగా  ఈ సినిమా ట్రైలర్‌ను  తాజాగా విడుదల చేశారు.


    ఈ ట్రైలర్ చూస్తుంటే.. రామ్ ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టేనర్‌తో వస్తున్నాడు. లింగుసామి పూర్తి యాక్షన్ ప్యాక్డ్ పోలీస్ ఎంటర్టేనర్‌గా తెరకెక్కించారు. తెలుగులో ఈ సినిమా ట్రైలర్‌ను బోయపాటి శ్రీను విడుదల చేస్తే.. తమిళంలో శివ కార్తికేయన్ ఏక కాలంలో విడుదల చేసారు. ముఖ్యంగా రామ్ పోతినేని ఒక చెట్టు మీద 40 కాకుల్లో ఒక కాకి కాలిస్తే.. ఎన్ని కాకులుంటాయి అనే డైలాగు బాగుంది. దాంతో పాటు ఊరికి పట్టిన రోగం వేరు.. ఇవ్వాల్సిన ట్రీట్‌మెంట్ వేరు. ఈ చిత్రంలో రామ్ డీసీపీ పాత్రలో నటించారు. ఈ చిత్రాన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా కర్నూలు నేపథ్యంలో తెరకెక్కించినట్టు చెప్పారు.



    ఇక మరోవైపు  ఈ చిత్రం (The Warriorr) హిందీ వెర్షన్ కి సంబంధించి ఓ భారీ డీల్ కుదిరింది. ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ రూ.  16 కోట్ల రూపాయలకి అమ్ముడైనట్లు తెలుస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస చిట్టూరీ ఈ (The Warriorr) చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో రామ్‌ (Ram Pothineni) తొలిసారి పోలీస్‌ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషలకు కలిపి డిస్నీ హాట్ స్టార్ రూ. 35 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. మొత్తంగా డిజిటల్, శాటిలైట్, డబ్బింగ్ రూపేణా.. నాన్ థియేట్రికల్‌గా ఈ సినిమాకు రూ. 41 కోట్ల లాభం విడుదలకు ముందే వచ్చింది.

    Vishal -Chandra Babu : కుప్పంలో చంద్రబాబుపై పోటీపై స్పందించిన విశాల్.. ఏపీ పాలిటిక్స్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్..


    ‘ది వారియర్’ మూవీ సెట్స్ పై ఉండగానే.. రామ్ (Ram Pothineni)  మరో సినిమాను మొదలు పెట్టారు. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. ప్యాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కనుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Krithi shetty, Ram Pothineni, The Warrior, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు