మంచు విష్ణు - మంచు మనోజ్ మధ్య విబేధాలు ఉన్నాయంటూ గత కొన్ని రోజులుగా బోలెడన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. మంచు ఫ్యామిలీలో లోలోపల చాలా గొడవలు జరుగుతున్నాయనే టాక్ ఫిలిం నగర్ లో కొంతకాలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా బయటకొచ్చిన ఓ వీడియో సంచలనంగా మారింది.
ఏకంగా మంచు విష్ణు తమ్ముడు మనోజ్ పై దాడికి పాల్పడినట్లు ఈ వీడియో స్పష్టం చేస్తోంది. విష్ణు బంధువుల ఇంట్లోకి వెళ్లి మరీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదీ ఇలాగా బంధువుల ఇళ్లలోకి వచ్చి మావాళ్లను, బంధువులను కొడుతుంటారండీ, ఇది సిట్యూయేషన్ అంటూ ఈ వీడియోలో మనోజ్ వాయిస్ వినిపిస్తుండటంతో మంచు వారింట జరుగుతున్న గొడవ బట్టబయలైంది.
ఈ వీడియోను మంచు మనోజ్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో పెట్టడంతో కలకలం రేగింది. తన మనిషి సారధిని విష్ణు కొట్టాడంటూ మనోజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తరచూ ఇంట్లోకి చొరబడి ఇలా కొడుతూ ఉంటాడంటూ విష్ణు పై మనోజ్ సీరియస్ కావడం హాట్ టాపిక్ అయింది.
కొట్టుకున్న మంచు మనోజ్-విష్ణు | News18 Telugu#manchumanoj #manchivishnu pic.twitter.com/4a12OwfZOG
— News18 Telugu (@News18Telugu) March 24, 2023
తండ్రి మోహన్ బాబుతో కలిసి మంచు విష్ణు ఉంటున్నారని, మంచు మనోజ్ వేరుగా ఉంటున్నారనే న్యూస్ ఎప్పటినుంచో వినిపిస్తోంది. గత రెండుమూడేళ్లుగా మంచు విష్ణుకి మంచు మనోజ్ బర్త్ డే విషెస్ కూడా చెప్పకపోవడం, రీసెంట్ గా జరిగిన మంచు మనోజ్ రెండో పెళ్ళికి విష్ణు చుట్టంచూపుగా వచ్చి వెళ్లడంతో జనాల్లో అనుమానాలు ముదిరాయి. తాజాగా బయటకొచ్చిన ఈ వీడియోతో మంచు సోదరుల నడుమ వార్ గట్టిగానే నడుస్తోందని స్పష్టమైంది.
మంచు మనోజ్ ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. భూమా మౌనిక రెడ్డిని ప్రేమించి పెళ్లాడారు మనోజ్. మార్చి 3వ తేదీన ఇరు కుటుంబాల సమక్షంలో మంచు మనోజ్- భూమా మౌనిక రెడ్డి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అటు మనోజ్, ఇటు మౌనిక ఇద్దరిదీ కూడా రెండో వివాహమే కావడం విశేషం. తమ తమ జీవితంలో రెండో సారి ఏడడుగులు వేసి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి విషయంలో కూడా మంచు ఫ్యామిలీలో చాలా డిస్కషన్స్ నడిచాయని టాక్.
మొత్తంగా చూస్తే మంచు వారింట నెలకొన్న మంట తీవ్ర స్థాయిలోకి వెళ్లిందని తెలుస్తోంది. విష్ణు వార్నింగ్ ఇస్తున్న వీడియోను మనోజ్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో షేర్ చేసే వరకు వచ్చిందంటే వీళ్లిద్దరి మధ్య ఇష్యూ ఎంతవరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Manchu Family, Manchu Manoj, Manchu Vishnu