Niharika Konidela : నిహారిక భర్త న్యూసెన్స్ కేసులో మరో అప్ డేట్.. పోలీస్ స్టేషన్‌కు ఇరు వర్గాలు..

Niharika, Chaitanya Photo : Instagram

Niharika Konidela : మెగా డాటర్ నిహారిక కొణిదెల భర్త చైతన్య జొన్నలగడ్డపై తాజాగా ఓ కేసు నమోదైన సంగతి తెలిసిందే.

  • Share this:
    మెగా డాటర్ నిహారిక కొణిదెల భర్త చైతన్య జొన్నలగడ్డపై తాజాగా ఓ కేసు నమోదైన సంగతి తెలిసిందే. అర్ధరాత్రి అపార్ట్ మెంట్‌లో నిహారిక భర్త న్యూసెన్స్ చేస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు అక్కడి అపార్ట్ మెంట్ వాసులు. అర్దరాత్రి అపార్ట్ మెంట్‌లో భర్త చైతన్య జొన్నలగడ్డ తన ఫ్రెండ్స్‌తో కలిసి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడని ఆ ఫిర్యాదు సారాంశం. అయితే దీనికంటే ముందు అపార్ట్ మెంట్ వాసులకు చైతన్యకు మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగిందని తెలుస్తోంది. ఈ క్రమంలో అపార్టు‌మెంటు వాసులు నిహారిక భర్త చైతన్య పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇక్కడ మరో విషయం ఏమంటే.. అపార్ట్ మెంట్ వాసులపై నిహారిక భర్త చైతన్య కూడా తిరిగి ఫిర్యాదు చేశారు. కాగా తాజాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ న్యూసెన్స్ కేసులో ఇరు వర్గాలు రాజీ కుదుర్చుకున్నాయని సమాచారం అందుతోంది. అపార్టుమెంట్‌లో ఆఫీస్ పెట్టటానికి వీలు లేదని అపార్టుమెంట్ వాసులు చైతన్యతో గొడవకు దిగడంతో.. చైతన్యకు అపార్టుమెంట్ వాసులకు మధ్య గొడవ జరిగింది. తమ అపార్ట్‌మెంట్‌‌లో న్యూసెన్స్ చేస్తున్నారని అపార్టుమెంట్ వాసులు ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా నిహారిక భర్త చైతన్య ఉండే ఫ్లాట్‌కు ఆయన ఫ్రెండ్స్ వస్తున్నారట.. అంతేకాకుండా కోవిడ్ నిబంధనలను పాటించకుండా.. వచ్చిన ప్రతిసారీ మద్యం సేవించి అపార్ట్ మెంట్‌లో హల్ చల్ చేస్తున్నారని అపార్టుమెంట్‌వాసులు ఫిర్యాదులో పేర్కొన్నారు.



    ఇక మరోవైపు చైతన్య కూడా తమ ఆఫీస్‌లోకి కొంతమంది అక్రమంగా ప్రవేశించి గొడవకు దిగారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ గొడవకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరించిన పోలీసులు.. ఇరువురినీ స్టేషన్‌కు పిలిపించి అక్కడే కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఇరువురూ రాజీకి వచ్చినట్టు పోలీసులు తెలిపారు.
    Published by:Suresh Rachamalla
    First published: