• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • THE TRUTH ABOUT SALMAN KHAN GIFTING A FLAT TO INTERNET SENSATION RANU MONDAL MS

ఓవర్‌నైట్ స్టార్ సింగర్ రాణు మండల్‌కి సల్మాన్ నిజంగా ఫ్లాట్ కొనిచ్చాడా..?

ఓవర్‌నైట్ స్టార్ సింగర్ రాణు మండల్‌కి సల్మాన్ నిజంగా ఫ్లాట్ కొనిచ్చాడా..?

రాణు మండల్,సల్మాన్ ఖాన్

రాణు మండల్ ప్రతిభను గుర్తించి బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేష్ రేషమియా.. ఆమెతో 'తేరీ మేరీ కహానీ' సాంగ్‌ను స్టూడియోలో రికార్డ్ చేయించిన సంగతి తెలిసిందే. తాను సంగీతం అందించే సినిమాల్లో రాణుకి అవకాశం ఇస్తానని కూడా చెప్పాడు.

  • Share this:
    ఇటీవల సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన వీడియోల్లో రాణు మండల్ సింగింగ్ వీడియో ఒకటి. రాణాఘట్ రైల్వే స్టేషన్‌లో లతా మంగేష్కర్‌ను మరపించేలా రాణు ఆలపించిన గానానికి యావత్ దేశం ఫిదా అయింది. ఆమె గాత్రానికి సలాం కొట్టనివారు లేరంటే అతిశయోక్తి కాదు.దాంతో ఆమె ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది. ఈ నేపథ్యంలో రాణు మండల్‌కు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ రూ.55లక్షలతో ఫ్లాట్ కొనిచ్చాడన్న వార్త తెరపైకి వచ్చింది. రాణు పాడిన పాట లాగే.. ఈ వార్త కూడా వైరల్ అయింది. అయితే సల్మాన్ ఖాన్ నిజంగానే ఆమెకు ఫ్లాట్ కొనిచ్చాడా..? లేక ఇదంతా వట్టి ప్రచారమేనా..? అన్న దానిపై క్లారిటీ లేకుండా పోయింది. రాణు మండల్‌‌ను చూసుకుంటున్న రాణాఘట్ అమ్రా శోభై శోయితన్ క్లబ్‌కి చెందిన విక్కీ విశ్వాస్ దీనిపై తాజాగా స్పందించారు. రాణు మండల్‌కు సల్మాన్ ఖాన్ ఇల్లు కొనివ్వలేదని, ఎటువంటి ఆర్థిక సహాయం చేయలేదని స్పష్టం చేశాడు. రాణు మండల్ వీడియోను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసింది తామేనని.. అప్పటినుంచి తామే ఆమె బాగోగులు చూసుకుంటున్నామని చెప్పాడు.సల్మాన్ ఖాన్ సహాయం అందించాడన్న వార్త ఫేక్ అని కొట్టిపారేశాడు.

    ఇదిలా ఉంటే, రాణు మండల్ ప్రతిభను గుర్తించి బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేష్ రేషమియా.. ఆమెతో 'తేరీ మేరీ కహానీ' సాంగ్‌ను స్టూడియోలో రికార్డ్ చేయించిన సంగతి తెలిసిందే. తాను సంగీతం అందించే సినిమాల్లో రాణుకి అవకాశం ఇస్తానని కూడా చెప్పాడు.రాణు ప్రతిభను గుర్తించి సూపర్‌స్టార్ సింగర్ నిర్వాహకులు కూడా ఆమెను షోకి అహ్వానించారు. మొత్తం మీద రాణాఘట్ రైల్వేస్టేషన్‌లో పాడిన పాట.. 59ఏళ్ల రాణు మండల్ జీవితాన్నే పెద్ద మలుపే తిప్పిందని చెప్పాలి.
    Published by:Srinivas Mittapalli
    First published: