అప్పట్లో సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు (Tollywood drugs case) మళ్లీ తెరపైకొచ్చింది. దాదాపు ఐదేళ్ల క్రితం మాదకద్రవ్యాల అక్రమ రవాణా దుర్వినియోగం కేసులో తెలంగాణ ఎక్సైజ్ ప్రొహిబిషన్ డిపార్ట్‌మెంట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Directorate of Enforcement)కి కీలక ఆధారాలు అందించింది. అప్పట్లో పలువురు సినీ ప్రముఖులు హీరోలు, టాప్ దర్శకులు కూడా ఈ కేసుకు సంబంధం ఉన్నట్లో ఎక్సైజ్ శాఖ (Excise Department) నిర్ధారించింది. తరువాత ఏమైందో తెలేదు కాని ఈ కేసు కు సంబంధించి విచారణ ముందుకు సాగలేదు. అయితే తాజాగా ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ ఈడీ (ED)కి దాదాపు 800-పేజీల ఫైల్, 60 GB (వీడియో సాక్ష్యం) దాంతో పాటు 10 ఆడియో రికార్డింగ్‌లు ఈ కేసుకు సంబంధించినవి అందించినట్లు సమాచారం. 800 పేజీల ఫైల్‌లో ఎఫ్‌ఐఆర్‌లు (FIR), ఛార్జ్ షీట్, నమోదైన 12 కేసుల్లో నిందితులు, సాక్షులు, అనుమానితుల వాంగ్మూలాలు ఉన్నట్లు తెలుస్తోంది. 60 GB హర్డ్ డిస్క్‌లతో సాక్ష్యాలు CD, పెన్ డ్రైవ్ ఉన్నాయి.
2017లో ఎక్సైజ్ కార్యాలయంలో విచారణ సందర్భంగా చిత్రీకరించిన టాలీవుడ్ ప్రముఖుల వీడియో రికార్డింగ్‌లు (Video recordings) ఇందులో ఉన్నట్లు సమాచారం.వీటితోపాటు డీకోడ్ చేసిన కొన్ని ఆడియో సాక్ష్యలు లను కూడా ఈడీకి ఎక్సైజ్ శాఖ అందించినట్లు తెలుస్తోంది ఈ కాల్ రికార్డ్స్ లో నిందితులు డ్రగ్స్ అమ్మకానికి సంబంధించిన సంభాషణలు లు ఉన్నట్లు సమాచారం.
దాదాపు 12 కేసులు..
ఇదిలా ఉంటే 2017లో నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ యాక్ట్ కింద ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ టాలీవుడ్ లో ఈ డ్రగ్స్ వినియోగానికి సంబంధించి కొంత మంది ప్రముఖులపై దాదాపు 12 కేసులను బుక్ చేసింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) 11 ఛార్జ్ షీట్లను అనుమానితులపై దాఖలు చేసింది. తెలుగు సినీ ప్రముఖులను పిలిపించి విచారించినా.. ఆధారాలు లేకపోవడంతో వారిపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. మనీలాండరింగ్‌పై హైకోర్టు ఆదేశాల మేరకు ఈడీ ఇప్పుడు కేసును విచారిస్తోంది.
మార్చి 2022లో, రాష్ట్ర హైకోర్టు ఆదేశాన్ని పాటించనందుకు తెలంగాణ ముఖ్య కార్యదర్శి తోపాటు ఎక్సైజ్ శాఖపై ED కోర్డు ధిక్కార కేసును దాఖలు చేసింది. 2021లో ED సమన్లు పలువురు ప్రముఖులకు అందాయి. అయితే ఈ కేసు తెరపైకొచ్చినప్పుడు టాలీవుడ్ నటులతోపాటు దర్శకులు సహా 12 మంది ప్రముఖులను పిలిచింది ఎక్సైజ్ శాఖ. అప్పట్లో విచారణకు హజరైన వారిలో నటులు రకుల్ ప్రీత్, రవితేజ, అతని డ్రైవర్, తరుణ్, ముమైత్ ఖాన్, దర్శకుడు పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్ మరియు నవదీప్ ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Enforcement Directorate, High Court, Telangana Government, Tollywood drugs case