HOME »NEWS »MOVIE »the secret ingredient for mahesh babu handsome look is here see for full details sr

Mahesh Babu: మహేష్ అందం సీక్రెట్ ఏంటో తెలిసింది.. కావాలంటే ఈ వీడియో చూడండి..

Mahesh Babu: మహేష్ అందం సీక్రెట్ ఏంటో తెలిసింది.. కావాలంటే ఈ వీడియో చూడండి..
మహేష్ బాబు Photo : Twitter

Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత అందగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

  • Share this:
    టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత అందగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతోపాటు హ్యాండ్సమ్ లుక్‌తో కేకపెట్టిస్తుంటాడు. ఇటీవల మీసాలు లేకుండా విడుదలైన ఓ లుక్‌లో హాలీవుడ్ హీరోగా కనబడుతున్నాడు మహేష్. అయితే ఇదంతా ఊరికే రాదు. దానికోసం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. సరైన డైట్ తోపాటు వర్కౌట్స్ కూడా ముఖ్యమే. తన ఫిట్ నెస్ కోసం మహేష్ ఎంతలా కష్టపడతాడో ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. మహేష్ వర్కౌట్స్ చేస్తోన్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో మహేష్ బాక్స్ జంపింగ్‌లో భాగంగా కిందికి మీదికి దూకుతూ జిమ్‌లో అదరగొడుతున్నాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్, ఆయన ఫ్యాన్స్.. ఓహో మహేష్ సీక్రెట్ ఇదేనా.. ఆయన ఇంత అందంగా ఉండటానికి ఇంతలా కష్టపడుతాడా.. ఫిట్‌గా ఉండాలంటే ఇంతలా శ్రమించాలా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఆయన నటించే సినిమా విషయానికి వస్తే.. మహేష్ సరిలేరు నీకెవ్వరు లాంటీ బ్లాక్ బస్టర్ తర్వాత సర్కారు వారి పాట సినిమాకు సై అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పరుశురామ్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభంకానుంది. 'సర్కారు వారి పాట' రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 25 నుంచి దుబాయ్‌లో ప్రారంభం కానుందని సమాచారం. అయితే వాస్తవానికి తొలి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోనే చేయాలని మొదట అనుకున్నా, ప్లానింగ్‌లో మార్పు జరిగి, దుబాయ్‌కు వెళుతోందట చిత్రబృందం.

    ఇక అక్కడే దాదాపు 20 రోజుల పాటు అక్కడ షూటింగ్‌ జరుగుతుందని తెలుస్తోంది. రెండో షెడ్యూల్‌ మాత్రం హైదరాబాద్‌లో జరుగుతుందని సమాచారం.







    ఫిల్మి సిటీలో ఓ సాంగ్ ను షూట్ చేయడానికి రెడీ అవుతున్నారని తెలిసింది. అంతేకాదు దీనికి సంబంధించిన సెట్ వర్క్ పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఆర్ట్ డైరెక్టర్ తోట తరుణి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన ఈ టైటిల్ సాంగ్ సెట్ తీర్చిదిద్దారట. ఈ పాట టైటిల్ సాంగ్ వస్తోందట. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమా సోషల్ మెసేజ్‌తో వస్తోంది. భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ కథ సాగుతోందని.. మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకు పాత్రను పోషిస్తున్నాడని టాక్ నడుస్తోంది. వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టి.. తన తండ్రి మీద పడ్డ ఆపవాదును ఎలా పోగొట్టాడు అనేది కథాంశంగా ఉండనున్నందని సమాచారం.



    ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో హిందీ వర్సటైల్ యాక్టర్ విద్యా బాలన్ నటించనుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి మధి కెమెరా మెన్‌గా చేస్తుండగా.. సంగీతాన్ని తమన్‌ అందిస్తున్నాడు. మార్తండ్‌ కె వెంకటేశ్‌ ఎడిటింగ్‌ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి.
    Published by:Suresh Rachamalla
    First published:January 21, 2021, 11:10 IST