HOME »NEWS »MOVIE »the releation between super star krishna amitabh bachchan here are the details ta

Krishna Amitabh: సూపర్ స్టార్ కృష్ణ,అమితాబ్ బచ్చన్ మధ్యగల ఈ రిలేషన్ తెలుసా..

Krishna Amitabh: సూపర్ స్టార్ కృష్ణ,అమితాబ్ బచ్చన్ మధ్యగల ఈ రిలేషన్ తెలుసా..
కృష్ణ, అమితాబ్ బచ్చన్ (File/Photo)

Super Star Krishna Amitabh Bachchan | సూపర్ స్టార్ కృష్ణ, అమితాబ్ బచ్చన్ 60వ దశకంలో హీరోలుగా ఇండస్ట్రీలోకి వచ్చారు. వీళ్లిద్దరి మధ్య మరో అనుబంధం ఉంది.

  • Share this:
    Super Star Krishna Amitabh Bachchan | సూపర్ స్టార్ కృష్ణ, అమితాబ్ బచ్చన్ 60వ దశకంలో హీరోలుగా ఇండస్ట్రీలోకి వచ్చారు. సూపర్ స్టార్ కృష్ణ 1965లో విడుదలైన ‘తేనే మనుసులు’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ తెలుగులో తొలి కలర్ సాంఘిక చిత్రం. ఇక అమితాబ్ బచ్చన్.. 1969లో  కే.ఏ.అబ్బాస్ దర్శకత్వంలో‘సాత్ హిందూస్థానీ’ చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక బిగ్‌బీ హీరోగా నటించిన ఏకైక బ్లాక్ అండ్ వైట్ చిత్రం.  అటు కృష్ణ తొలి సినిమా తర్వాత ఎన్నో బ్లాక్ అండ్ వైట్ చిత్రాల్లో నటించారు. ఆ సంగతి పక్కన పెడితే.. అమితాబ్ బచ్చన్ నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. ఎన్టీఆర్ సహా పలువురు హీరోలు అమితాబ్ సూపర్ హిట్ చిత్రాలను తెలుగులో రీమేక్ చేసారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ కూడా బిగ్‌బీ నటించిన పలు సూపర్ హిట్ చిత్రాలను తెలుగులో రీమేక్ చేసారు.

    ‘సత్తే పే సత్తా’ తెలుగు రీమేక్ ‘అందరికంటే మొనగాడు’ (Youtubu/Credit)




    అమితాబ్ పలు సినిమాల్ని సూపర్ స్టార్ కృష్ణ కూడా ఇష్టంగానే రీమేక్ చేశాడు.ఆయన చేసిన వాటిల్లో తప్పక చెప్పుకోవాల్సింది ‘అందరికంటే మొనగాడు’. ఇదీ సూపర్ హిట్ బాలీవుడ్ మూవీ ‘సత్తే పే సత్తా’కి రీమేక్. అలాగే ..అమితాబ్ బ్లాక్ బస్టర్ మూవీస్‌లో ఒకటైన ‘అమర్ అక్బర్ ఆంథోని’కి తెలుగు వర్షన్ ‘రామ్ రాబర్ట్ రహీమ్’. దీన్ని కూడా కృష్ణనే రీమేక్ చేశారు.

    కృష్ణ, అమితాబ్ బచ్చన్ (File/Photo)


    ఇందులో రజినీకాంత్, చంద్రమోహన్ నటించడం విశేషం. అయితే.. కృష్ణ హీరోగా నటించిన ‘కుమార్ రాజా’ మూవీ హిందీలో అమితాబ్ ‘మహాన్’గా రీమేక్ చేసాడు. తెలుగులో కశ్మర్ నేపథ్యంలో తెరకెక్కిస్తే.. హిందీలో నేపాల్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.  కానీ ఈ సినిమాను ముందుగా కన్నడలో రాజ్ కుమార్ హీరోగా నటించిన ‘శంకర్ గురు’ సినిమాకు రీమేక్. 1978లో విడుదలైన ఈ సినిమాను కృష్ణ అదే యేడాది ‘కుమార్ రాజా’ గా రీమేక్ చేసి విడుదల చేసారు. మరోవైపు అమితాబ్ ఈ చిత్రాన్ని 1983లో రీమేక్ చేసారు. మొత్తంగా అమితాబ్ బచ్చన్ నటించిన పలు సూపర్ హిట్ చిత్రాల రీమేక్స్‌‌ను తెలుగులో కృష్ణ రీమేక్ చేయడం విశేషం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:October 04, 2020, 22:01 IST