కృష్ణ మొదటి భార్య ఇందిరాతో పాటు.. మహేష్‌తో విజయనిర్మల రిలేషన్ ఎలా ఉండేదంటే..
సూపర్ స్టార్ కృష్ణ.. 1965లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘తేనే మనసులు’ సినిమాలో వెండితెరకు పరిచయం అయ్యారు. అంతకు ముందే 1961లో కృష్ణకు ఆయన మరదలు ఇందిరాతో పెళ్లైయింది. ఆ తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సాక్షి’ సినిమాలో మొదటిసారి కృష్ణ,విజయ నిర్మల కలిసి నటించారు. ఆ సినిమా సాక్షిగా వీళ్లిద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత 1969లో విజయ నిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. కృష్ణ..విజయనిర్మలను రెండో పెళ్లి చేసుకున్న తర్వాత పరిస్థితి ఎలా ఉండేది ? ఇందిరా దేవి ఎలా ఫీలయ్యారు అనే దానిపై ప్రముఖ జర్నలిస్ట్ ఏమన్నారంటే..
news18-telugu
Updated: June 28, 2019, 7:16 PM IST

విజయ నిర్మల,తల్లి ఇందిరాలతో మహేష్ బాబు (ఫేస్బుక్ ఫోటో)
- News18 Telugu
- Last Updated: June 28, 2019, 7:16 PM IST
సూపర్ స్టార్ కృష్ణ.. 1965లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘తేనే మనసులు’ సినిమాలో వెండితెరకు పరిచయం అయ్యారు. అంతకు ముందే 1961లో కృష్ణకు ఆయన మరదలు ఇందిరాతో పెళ్లైయింది. ఆ తర్వాత బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సాక్షి’ సినిమాలో మొదటిసారి కృష్ణ,విజయ నిర్మల కలిసి నటించారు. ఆ సినిమా సాక్షిగా వీళ్లిద్దరు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత 1969లో విజయ నిర్మలను కృష్ణ రెండో వివాహం చేసుకున్నారు. తిరుపతిలో కేవలం నలుగురి సాక్షుల సమక్షంలో వీరి పెల్లి జరిగింది. కృష్ణ..విజయనిర్మలను రెండో పెళ్లి చేసుకున్న తర్వాత పరిస్థితి ఎలా ఉండేది ? ఇందిరా దేవి ఎలా ఫీలయ్యారు అనే దానిపై ప్రముఖ జర్నలిస్ట్ ఇమంది రామారావు ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. అప్పట్లో కృష్ణగారిని చాలా దగ్గర నుండి చూసిన ఆయన ..కృష్ణ గారు తన ఇద్దరు భార్యలతో ఎంతో ప్రేమగా ఉండేవారని చెప్పుకొచ్చారు. అందుకే వాళ్ల ఫ్యామిలీలో ఇప్పటికీ ఎలాంటి గొడవలు లేవన్నారు.

అంతేకాదు కృష్ణ గారు విజయ నిర్మలను ప్రేమించారు.. పెళ్లి చేసుకున్నారు. మరోవైపు విజయ నిర్మల కూడా కృష్ణగారి కుటుంబంతో ఎలాంటి గొడవలు రాకుండా హుందా ప్రవర్తించారు. అంతేకాదు చివరి వరకు అలాగే మసులుకున్నారు విజయ నిర్మల. నిజంగా ఇలాంటి ఆలోచనలు ఉన్న భార్యలు కృష్ణగారికి దొరకడం ఆయన అదృష్ణమన్నారు.
మరోవైపు విజయనిర్మలకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టమని చెప్పారు. అంతేకాదు కృష్ణగారి కంటే మహేష్ బాబు మంచి నటుడని విజయ నిర్మల చాలా సందర్భాల్లో పొగిడారు కూడా.అంతేకాదు అలాంటి బిడ్డ ఉండాలంటే పూర్వజన్మ సుకృతం కావాలన్నారు.

మరోవైపు నరేష్ కూడా మొదట్లో విజయ నిర్మల మాటలు అస్సలు వినేవాడు కాదంట. ఆ తర్వాత అమ్మ విలువ ఏంటో తెలుసుకొని పూర్తిగా మారాడట. ఆయనకు తెలిసిన ప్రపంచం తల్లి విజయ నిర్మలనే. అంతేకాదు ఆయన కృష్ణగారిలోనే నాన్నను చూసుకున్నారు. అయితే ఆయన మాత్రం కృష్ణగారిని సార్ అనే పిలిచేవారని ఇమంది రామారావు చెప్పుకొచ్చారు.

కూతురు ప్రియదర్శిని వివాహా వేడుకలో భార్య ఇందిరాతో కృష్ణ
కృష్ణ కూడా విజయ నిర్మలను పెళ్లి చేసుకునే ముందే కృష్ణకు ఇద్దరు పిల్లలు రమేష్ బాబు, పద్మావతి ఉన్నారు. విజయ నిర్మలతో పెళ్లి తర్వాత ఇందిరా.. మంజుల, మహేష్ బాబు, ప్రియదర్శినిని కన్నారు. అంతేకాదు తన భర్త సూపర్ స్టార్ కావడంతో నేను గొడవ చేస్తే ఆయన పరువు పోతుందనే ఉద్దేశ్యంతోనే ఆమె ఎపుడు ఉండేవారని చెప్పుకొచ్చారు.
బాలయ్య మామా ... రూలర్ సినిమా దుమ్ము లేపిద్దంటున్న నారా లోకేష్
బాలకృష్ణతో కీర్తి సురేష్ రొమాన్స్..
జయలలిత బయోపిక్ షూటింగ్ పూర్తి.. విడుదల తేది ఖరారు..
Ruler Pre Release | బాలయ్య రూలర్ ప్రీ రిలీజ్ డేట్, టైమ్, ప్లేస్ ఫిక్స్...
రమ్యకృష్ణ ‘క్వీన్’ వెబ్ సిరీస్ టీజర్.. కంగన రనౌత్‌కు భారీ షాక్..
కరణం బలరాం మూడు కండిషన్లు... జగన్ ఓకే అంటే...

తల్లి ఇందిరా దేవితో మహేష్ బాబు (ఫేస్బుక్ ఫోటో)
అంతేకాదు కృష్ణ గారు విజయ నిర్మలను ప్రేమించారు.. పెళ్లి చేసుకున్నారు. మరోవైపు విజయ నిర్మల కూడా కృష్ణగారి కుటుంబంతో ఎలాంటి గొడవలు రాకుండా హుందా ప్రవర్తించారు. అంతేకాదు చివరి వరకు అలాగే మసులుకున్నారు విజయ నిర్మల. నిజంగా ఇలాంటి ఆలోచనలు ఉన్న భార్యలు కృష్ణగారికి దొరకడం ఆయన అదృష్ణమన్నారు.

తల్లి తండ్రులతో సూపర్ స్టార్ మహేష్ బాబు (ఫేస్బుక్ ఫోటో)
Loading...

కృష్ణ,విజయ నిర్మలతో మహేష్ బాబు (ఫేస్బుక్ ఫోటో)