SP Balasubrahmanyam Ajith: గాన గంధర్వుడు మన నుంచి దూరం అయనా.. పాటల రూపంలో ఇప్పటికీ అభిమానులతోనే ఉన్నారు. ఆయన మరణంతో భారతీయ సంగతీ ప్రపంచంలో ఓ శకం ముగిసింది. సినీ ఇండస్ట్రీలో అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న ఎస్పీ బాలు సినిమాల్లో ఆయన అందుకున్న రికార్డులు ఎవరు అందుకోలేరనే చెప్పాలి. జాతీయ స్థాయిలో వివిధ భాషల్లో ఆరు అవార్డులు అందుకోవడమనే రికార్డు ఏ గాయకుడికి సాధ్యం కాకపోవచ్చనే చెప్పాలి. భారతీయ సినీ సంగీతంలో ఆయన ముందు తర్వాత అనేంతగా చెరగని ముద్రవేసారు. బాలు గానంతో ఎన్నో హిట్స్ సాంగ్స్ అందుకున్న తెలుగు హీరోలు ఆయన మరణంపై సోషల్ మీడియా వేదికగానే స్పందించారు కానీ.. ప్రత్యక్షంగా ఎవరు చెన్నై వెళ్లి ఆయన పార్థివ దేహానికి నివాళులు అర్పించక పోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. స్టార్ హీరోలు కమల్ హాసన్, అర్జున్, విజయ్ వంటి హీరోలు బాలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.అయితే.. బాలు లాస్ట్ రైట్స్‌లోఅజిత్ పేరు బాగా వినబడింది. అజిత్ బాలు అంత్య క్రియలకు ఎందుకు హాజరు కాలేదననే విషయమే తమిళనాడులో హైలెట్ అయింది.
అయితే.. ఈ విషయమై చరణ్ క్లారిటీ ఇచ్చాడు. కరోనా కారణంగా ఎవరు వచ్చారు. ఎవరు రాలేదనే ఆలోచించే రోజులు కావని చెప్పారు. ఈ సందర్భంగా ఎవరు వచ్చినా.. రాకపోయినా.. అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. ఇక అజిత్‌కు ఎస్పీ బాలుకు ఉన్న లింక్ ఏమిటంటే.. ఎప్పీ బాలు కొడుకు చరణ్, అజిత్ ఇద్దరూ క్లాస్‌మేట్స్, టెన్త్ వరకు ఇద్దరు కలిసే చదువుకున్నారు. అంతేకాదు చరణ్‌తో కలిసి వాళ్ల ఇంట్లో ఉండేవాడట. అజిత్‌కు సెంటిమెంట్లు ఎక్కువగా ఉండేవట... ఆయన యాడ్ షూటింగ్ కోసం వెళ్లే ప్రతీసారి బాలు తనయుడు చరణ్ బట్టలు, షూస్ వేసుకొని వెళ్లేవాడట అజిత్. అది ఆయనకు బాగా కలిసొచ్చింది కూడా. ఆ తర్వాత తమిళ్ ఇండస్ట్రీకి వెళ్లి వరస సినిమాలు చేసి సూపర్ స్టార్ అయ్యాడు.
అంతేకాదు అప్పట్లో ఎస్పీ బాలు రికమండేషన్‌తోనే గొల్లపూడి మారుతిరావు తనయుడు గొల్లపూడి శ్రీనివాసరావు దర్శకత్వం వహించే చిత్రానికి హీరో వెతుకుతున్నారని తెలిసి ఎస్పీబాలు.. అజిత్ పేరును గొల్లపూడికి రికమెండ్ చేసాడట. అలా గొల్లపూడి కొడుకు డైరెక్ట్ చేసిన ‘ప్రేమ పుస్తకం’ సినిమాతో అజిత్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇక అజిత్ స్ట్రెయిట్‌గా తెలుగులో నటించిన సినిమా ఇదే.
అలా ఎస్పీబాలు కుటుంబంతో అజిత్ అనుబంధం కొనసాగుతూనే ఉంది. అందుకే ఎస్పీబాలు అంత్యక్రియల్లో అజిత్ పాల్గొనలేకపోయారనే విషయం ఎక్కువగా హైలెట్ అయింది. కానీ బాలు మాత్రం అజిత్.. తన స్వయంశక్తి, మంచితనంతోనే హీరోగా ఉన్నత స్థానానికి ఎదగారని ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ajith, S. P. Balasubrahmanyam, SP Charan Singer, Tollywood