Home /News /movies /

THE REASON BEHIND PUSHPA 2 SHOOTING DELAY SLB

Allu Arjun: పుష్ప 2 డిలే.. అందుకు కారణమిదే!

పుష్ప 2 Photo : Twitter

పుష్ప 2 Photo : Twitter

Pushpa 2: పుష్ప సినిమాకు సీక్వల్ రెడీ చేస్తున్నారు సుకుమార్. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో షురూ కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ మూవీ ఆలస్యానికి కారణాలేంటి అనే దానిపై సినీ వర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) క్రేజీ కాంబోలో వచ్చిన పుష్ప (Pushpa) సినిమా ఎంతటి సంచలనాలు సృష్టించిందో మనందరికీ తెలుసు. కరోనా పరిస్థితుల తర్వాత వచ్చిన ఈ సినిమా సూపర్ సక్సెస్ సాధించి బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పండించింది. ఈ చిత్రంలో పుష్పరాజ్ గా అల్లు అర్జున్, శ్రీ వల్లి పాత్రలో రష్మిక మందన ప్రేక్షకుల మెప్పు పొందారు. అయితే మళ్ళీ ఈ ఇద్దరు హీరోహీరోయిన్లుగా పుష్ప సినిమాకు సీక్వల్ రెడీ చేస్తున్నారు సుకుమార్. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో షురూ కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ మూవీ ఆలస్యానికి కారణాలేంటి అనే దానిపై సినీ వర్గాల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిన పుష్ప సినిమాలో ప్రధానంగా లొకేషన్స్ హైలైట్ అయ్యాయి. దీంతో ఈ మూవీ సీక్వల్ అంతకుమించి అన్నట్లుగా ఉండాలని సుకుమార్ ఫిక్సయ్యారట. కాగా 'పుష్ప' సినిమా విడుదల సమయానికే 'పుష్ప 2' (Pushpa 2)కి సంబంధించిన చిత్రీకరణ కూడా కొంతవరకు జరిగిందని టాక్. కానీ పుష్ప రిలీజ్ తర్వాత ఈ మూవీ షూటింగ్ అనుకున్న సమయానికి స్టార్ట్ కావడం లేదు.

పాన్ ఇండియా స్థాయిలో రూపొందించబోతున్న ఈ సినిమాకు అందుకు తగినట్టుగా అన్ని సీన్స్‌ను డిజైన్ చేస్తున్నారట సుకుమార్. యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ అన్ని సీన్స్ కూడా హైలైట్ కావాలని భావిస్తున్నారట. అందుకు తగ్గ లొకేషన్స్ వేట కొనసాగిస్తున్నారట. ఒక్కసారి షూటింగ్ మొదలుపెడితే ఇక జెట్ స్పీడులో ఫినిష్ చేసేలా సుకుమార్ స్కెచ్చేశారట. అందుకే కాస్త ఆలస్యమైనా ఓపిక పడుతున్నారని ఇన్ సైడ్ టాక్. రాబోయే ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి, వచ్చే ఏడాది ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట సుకుమార్.

ఇక ఈ చిత్రంలో అనసూయ రోల్ మరింత పవర్ ఫుల్‌గా ఉండనుందని తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ అనసూయ రేంజ్ పెంచేస్తుందని ఇప్పటినుంచే చెప్పుకుంటూ ఉండటం విశేషం. అదేవిధంగా స్పెషల్ సాంగ్ కోసం కూడా సుకుమార్ వేసిన స్కెచ్ ప్రేక్షకులకు యమ కిక్కివ్వనుందట. ఈ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దించబోతున్నారని తెలుస్తోంది. పుష్ప ఘనవిజయం సాధించడంతో పుష్ప 2పై బన్నీ ఫ్యాన్స్ బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగా సుకుమార్ ప్లాన్స్ ఉన్నాయి.
Published by:Sunil Boddula
First published:

Tags: Allu Arjun, Pushpa Movie, Sukumar

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు