THE REASON BEHIND ANJALI SPECIAL SONG IN NITHIIN MACHARLA NIYOJAKAVARGAM SLB
అప్పుడు అల్లు అర్జున్.. ఇప్పుడు నితిన్! తెలుగు హీరోయిన్ స్కెచ్చే వేరులే..
Photo Twitter
Nithiin Macharla Niyojakavargam: యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ లో అంజలి స్పెషల్ సాంగ్ చేయబోతోంది. అయితే ఈ సాంగ్ అంజలితో చేయించడం వెనుక ఓ బలమైన కారణం ఉందట.
ప్రాధాన్యమున్న రోల్ లో అవకాశం వస్తే వెంటనే ఓకే చేస్తున్నారు నేటితరం హీరోయిన్లు. ముఖ్యంగా ఐటెం సాంగ్స్ చేసేందుకు యంగ్ హీరోయిన్స్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. స్టార్ స్టేటస్ ఉన్న హీరోల సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేసి పాపులారిటీ పెంచుకుంటున్నారు. సమంత సహా ఈ లిస్టులో ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్స్ చేరిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా రాజోలు బ్యూటీ, అచ్చ తెలుగు అందం అంజలి (Anjali) కూడా అదే బాటలో వెళుతూ ఓ స్పెషల్ సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. యంగ్ హీరో నితిన్ (Nithiin) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ (Macharla Niyojakavargam)లో అంజలి స్పెషల్ సాంగ్ చేయబోతోంది.
రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. కేథరిన్ థ్రెసా మరో ముఖ్య పాత్ర పోషిస్తోంది. ఈ మూవీ టైటిల్ అనౌన్స్మెంట్ నుంచే జనాల్లో ఓ రకమైన ఆసక్తి నెలకొంది. దీనికితోడు ఎప్పటికప్పుడు ఇస్తున్న అప్డేట్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. చివరి పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేశారు.
ఇటీవల విడుదల పోస్టర్లు, గ్లింప్స్ ప్రేక్షకుల మెప్పు పొందాయి. కాగా.. ఈ మూవీలో హీరోయిన్ అంజలి స్పెషల్ సాంగ్ లో కనిపించనుందట. ఈ మేరకు ఓ అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసి సినిమా పట్ల ఇంకాస్త ఆసక్తి రేకెత్తించారు మేకర్స్. అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం అంజలిని తీసుకురావటం వెనక బలమైన కారణముందని అంటున్నారు. నితిన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి మొదలెట్టిన ప్రాజెక్టుపై మరింత హైప్ తీసుకురావాలనే ఉద్దేశ్యంతోనే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారట. అంజలితో పక్కా మాస్ ఐటెం చేయించడం సినిమాకు ప్లస్ అవుతుందని భావించి చివరకు ఇలా డిసైడ్ అయ్యారట.
కాగా.. అంజలికి ఇది రెండో స్పెషల్ సాంగ్. గతంలో సరైనోడు సినిమాలో అల్లు అర్జున్‌తో కలిసి స్టెప్పులేసిన అంజలి ఇప్పుడు నితిన్ తో ఆడిపాడేందుకు రెడీ అయింది. ఇకపోతే ఆగస్ట్ 12న ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ మేరకు పెద్ద ఎత్తున మూవీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు.
Published by:Sunil Boddula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.