Home /News /movies /

THE REAL STORY BEHIND JABARDASTH COMEDIANS APPARAO AND BULLET BHASKAR FIGHT IN SHOW PK

బుల్లెట్ భాస్కర్, అప్పారావు నిజంగానే కొట్టుకున్నారా..?

జబర్దస్త్ కామెడీ షోలో గొడవ (bullet bhaskar apparao)

జబర్దస్త్ కామెడీ షోలో గొడవ (bullet bhaskar apparao)

Jabardasth Comedy Show: ఎప్పుడూ నవ్వించే జబర్దస్త్ కామెడీ షోలో ఓసారి సీరియస్ కూడా అవుతుంటుంది. అలాగే వచ్చే వారం ఎపిసోడ్ ప్రోమోలో కూడా అప్పారావు, భాస్కర్ కొట్టుకున్నారు.

ఎప్పుడూ నవ్వించే జబర్దస్త్ కామెడీ షోలో ఓసారి సీరియస్ కూడా అవుతుంటుంది. అలాగే వచ్చే వారం ఎపిసోడ్ ప్రోమోలో కూడా అప్పారావు, భాస్కర్ కొట్టుకున్నారు. ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పెద్దాయన్ని అలా కొట్టడం ఏంటి అంటూ కొందరు నిజంగానే కామెంట్స్ కూడా పెడుతున్నారు. మరోవైపు ఇదంతా తుస్.. ఒట్టిదే.. ప్రేక్షకులను ఎన్నిసార్లు వాళ్లు ఇలా బకరాలను చేయలేదు అంటూ తీసిపాడేస్తున్నారు. ఏదేమైనా కూడా వాళ్ల టార్గెట్ అయితే రీచ్ అయిపోయారు. తమ స్కిట్ గురించి జనాలు మాట్లాడుకునేలా చేయాలనేది జబర్దస్త్ నిర్వాహకుల ప్లాన్.
జబర్దస్త్ కామెడీ షోలో గొడవ (bullet bhaskar apparao)
జబర్దస్త్ కామెడీ షోలో గొడవ (bullet bhaskar apparao)

దాంతో అది జరిగిపోయింది. అక్కడ నిజంగానే అప్పారావు, భాస్కర్ కొట్టుకున్నారా లేదా అనేది తెలియాలంటే మరో వారం రోజులు అయితే వేచి చూడక తప్పదు. అప్పటి వరకు ఈ సస్పెన్స్ అయితే మెయింటేన్ అవుతుంది. అయితే అంతర్గత వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం అయితే అది నిజమైన గొడవ కాదు.. అప్పట్లో షకలక శంకర్ చేసిన స్కిట్‌కు సీక్వెల్ అని చెబుతున్నారు. కొన్నేళ్ల కింద ఇదే అప్పారావును స్టేజీపై ఇష్టమొచ్చినట్లు కొట్టాడు శంకర్. అప్పుడు కూడా స్కిట్‌లో భాగంగానే.. ఇద్దరూ సీరియస్ అయిపోయారు కూడా. అది నిజమైన గొడవ అనుకుని అక్కడున్న వాళ్లు కూడా షాక్ అయ్యారు.
జబర్దస్త్ కామెడీ షోలో గొడవ (bullet bhaskar apparao)
జబర్దస్త్ కామెడీ షోలో గొడవ (bullet bhaskar apparao)

ఆ తర్వాత తమ స్కిట్‌లో భాగమనే చెప్పారు. ఇప్పుడు కూడా ఇదే అంటున్నారు కొందరు. ముఖ్యంగా బుల్లెట్ భాస్కర్ స్కిట్స్ ఈ మధ్య అస్సలు పేలడం లేదు. హైపర్ ఆది లాంటి వాళ్ళ ముందు ఆయన నిలబడలేకపోతున్నాడు. దాంతో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే కానీ తమకు రేటింగ్ రాదని ఫిక్సైపోయారు వీళ్లు. అందుకే అప్పారావుతో గొడవ నాటకం ఆడారని తెలుస్తుంది. దీని వెనక స్క్రిప్ట్ డిపార్ట్‌మెంట్ హస్తం కూడా ఉంటుంది. జీ తెలుగులో అదిరిందితో పోటీ మొదలైంది కాబట్టి జబర్దస్త్ వాళ్లు కూడా జిమ్మిక్కులు మొదలుపెట్టారు. మొత్తానికి ఏదేమైనా కూడా భాస్కర్, అప్పారావు గొడవ మాత్రం బాగానే ట్రెండ్ అవుతుంది.
Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Jabardasth apparao, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు