ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి అసలు కథేంటి.. చిరంజీవికి ఎందుకంత ఆసక్తి..?

Sye Raa Narasimha Reddy: సైరా.. ఇప్పుడు ఈ చిత్రం గురించి దేశమంతా మాట్లాడుకుంటుంది. అలా చేసాడు మెగాస్టార్ చిరంజీవి. 42 ఏళ్ళ తన సినిమా కెరీర్‌లో ఓ సినిమా కోసం కానీ.. ఓ కథ కోసం గానీ చిరంజీవి ఇంతగా ఎప్పుడూ వేచి చూడలేదు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: September 18, 2019, 7:01 PM IST
ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి అసలు కథేంటి.. చిరంజీవికి ఎందుకంత ఆసక్తి..?
ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి లైఫ్ స్టోరీ (Source: Youtube)
  • Share this:
సైరా.. ఇప్పుడు ఈ చిత్రం గురించి దేశమంతా మాట్లాడుకుంటుంది. అలా చేసాడు మెగాస్టార్ చిరంజీవి. 42 ఏళ్ళ తన సినిమా కెరీర్‌లో ఓ సినిమా కోసం కానీ.. ఓ కథ కోసం గానీ చిరంజీవి ఇంతగా ఎప్పుడూ వేచి చూడలేదు.. ఒక్క ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కోసం తప్ప. ఆయన్ని అంతగా ఈ కథ ప్రభావితం చేసింది. చేస్తే ఎప్పటికైనా ఈ సినిమా చేయాల్సిందే అని ఎప్పట్నుంచో కలలు కంటున్నాడు మెగాస్టార్. 15 ఏళ్ల కిందే ఉయ్యాలవాడ కథ చేయాలనుకున్నా బడ్జెట్ సహకరించిక వెనకడుగు వేసాడు. కానీ ఇప్పుడు మాత్రం రామ్ చరణ్ ధైర్యం చేసాడు.

The Real lif story of Uyyalawada Narasimha Reddy and Chiranjeevi showing the world with Sye Raa pk Sye Raa Narasimha Reddy: సైరా.. ఇప్పుడు ఈ చిత్రం గురించి దేశమంతా మాట్లాడుకుంటుంది. అలా చేసాడు మెగాస్టార్ చిరంజీవి. 42 ఏళ్ళ తన సినిమా కెరీర్‌లో ఓ సినిమా కోసం కానీ.. ఓ కథ కోసం గానీ చిరంజీవి ఇంతగా ఎప్పుడూ వేచి చూడలేదు.. sye raa trailer,sye raa pre release event,sye raa trailer release,sye raa movie,Sye Raa Narasimha Reddy,Sye Raa Narasimha Reddy twitter,Sye Raa Narasimha Reddy making video,chiranjeevi sye raa,sye raa twitter,sye raa instagram,ram charan instagram,sye raa movie twitter,chiranjeevi Uyyalawada narasimha reddy,chiranjeevi sye raa,uyyalawada Narasimha Reddy real life story,uyyalawada real life story,telugu cinema,ఉయ్యాలవాడ నరసింహారెడ్డి,ఉయ్యాలవాడ జీవిత కథ,సైరా టీజర్,సైరా మేకింగ్ వీడియో,తెలుగు సినిమా,చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
సైరా నరసింహారెడ్డి (Source: Twitter)

ఒకేసారి 200 కోట్లకు పైగా ఖర్చు చేసి సైరా సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాపై అంచనాలు చూస్తుంటే సంచలనాలు సృష్టించడం ఖాయం అనిపిస్తుంది. ఇప్పటికే తన కెరీర్లో ఎన్నో పాత్రలు చేసిన ఆయ‌న‌.. ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి పాత్రపై మాత్రం ప్రేమ పెంచుకున్నాడు. ఏదో తెలియని ఎమోషన్ ఆయనలో పెనవేసుకుపోయింది. ఓ ర‌కంగా చిరుకు అది డ్రీమ్ రోల్ కూడా. అసలు ఎవరీ ఉయ్యాలవాడ అని ఆరా తీస్తే.. ఓ 180 ఏళ్లు వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది. భారతదేశంలో తొలి స్వాతంత్ర్య తిరుగుబాటు 1857లో మొద‌లైంది. కానీ అంత‌కు ప‌దేళ్ల ముందే బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాల‌వాడ నరసింహారెడ్డి.

The Real lif story of Uyyalawada Narasimha Reddy and Chiranjeevi showing the world with Sye Raa pk Sye Raa Narasimha Reddy: సైరా.. ఇప్పుడు ఈ చిత్రం గురించి దేశమంతా మాట్లాడుకుంటుంది. అలా చేసాడు మెగాస్టార్ చిరంజీవి. 42 ఏళ్ళ తన సినిమా కెరీర్‌లో ఓ సినిమా కోసం కానీ.. ఓ కథ కోసం గానీ చిరంజీవి ఇంతగా ఎప్పుడూ వేచి చూడలేదు.. sye raa trailer,sye raa pre release event,sye raa trailer release,sye raa movie,Sye Raa Narasimha Reddy,Sye Raa Narasimha Reddy twitter,Sye Raa Narasimha Reddy making video,chiranjeevi sye raa,sye raa twitter,sye raa instagram,ram charan instagram,sye raa movie twitter,chiranjeevi Uyyalawada narasimha reddy,chiranjeevi sye raa,uyyalawada Narasimha Reddy real life story,uyyalawada real life story,telugu cinema,ఉయ్యాలవాడ నరసింహారెడ్డి,ఉయ్యాలవాడ జీవిత కథ,సైరా టీజర్,సైరా మేకింగ్ వీడియో,తెలుగు సినిమా,చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
సైరా పోస్టర్ (Source: Twitter)

1846 జూన్ నెలలో మొదలైన నరసింహారెడ్డి తిరుగుబాటు 1847 ఫిబ్రవరిలో ఆయన వీర‌మరణంతో ముగిసింది. ఈ 8 నెల‌ల కాలంలో బ్రిటీష్ వారిని ముప్పుతిప్పలు పెట్టి.. మూడు కాదు ముప్పై చెరువుల నీళ్లు తాగించాడు న‌ర‌సింహారెడ్డి. తనకు రావాల్సిన భరణాన్ని ఇవ్వకుండా.. తన అనుచరుడిని అతి దారుణంగా బ్రిటీష్ వాళ్లు చంపేయడంతో వాళ్లపై తిరుగుబాటు చేస్తాడు ఉయ్యాలవాడ. కోయిలకుంట్లతో పాటు మరికొన్ని ధనాగారాలపై తన అనుచరులతో దాడి చేసి.. వాటిని దోచేస్తాడు నరసింహారెడ్డి. ఆ తర్వాత ఆయన కోసం బ్రిటీష్ వాళ్ళు వెతుకుతారు. తనను పట్టుకోవాలని చూసిన బ్రిటీష్ వాళ్లను కూడా చంపేస్తాడు రెడ్డి.

The Real lif story of Uyyalawada Narasimha Reddy and Chiranjeevi showing the world with Sye Raa pk Sye Raa Narasimha Reddy: సైరా.. ఇప్పుడు ఈ చిత్రం గురించి దేశమంతా మాట్లాడుకుంటుంది. అలా చేసాడు మెగాస్టార్ చిరంజీవి. 42 ఏళ్ళ తన సినిమా కెరీర్‌లో ఓ సినిమా కోసం కానీ.. ఓ కథ కోసం గానీ చిరంజీవి ఇంతగా ఎప్పుడూ వేచి చూడలేదు.. sye raa trailer,sye raa pre release event,sye raa trailer release,sye raa movie,Sye Raa Narasimha Reddy,Sye Raa Narasimha Reddy twitter,Sye Raa Narasimha Reddy making video,chiranjeevi sye raa,sye raa twitter,sye raa instagram,ram charan instagram,sye raa movie twitter,chiranjeevi Uyyalawada narasimha reddy,chiranjeevi sye raa,uyyalawada Narasimha Reddy real life story,uyyalawada real life story,telugu cinema,ఉయ్యాలవాడ నరసింహారెడ్డి,ఉయ్యాలవాడ జీవిత కథ,సైరా టీజర్,సైరా మేకింగ్ వీడియో,తెలుగు సినిమా,చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి
సైరా పోస్టర్ (Source: Twitter)

అంతేకాకుండా ఎప్పటికప్పుడు వాళ్ల ఖజానాలపై పడి తుపాకులతో పాటు నగదును కూడా దోచుకెళ్లేవాడు ఉయ్యాలవాడ. ఓ రకంగా రాబిన్ హుడ్ కథ ఇది. ముఖ్యంగా ఉయ్యాలవాడ సమయంలో గోరిల్లా యుద్ధాలు బాగా పాపులర్. ఇవే ఇప్పుడు సైరాలో కూడా చూపించబోతున్నాడు సురేందర్ రెడ్డి. ఆ రోజుల్లోనే ఉయ్యాలవాడను ప‌ట్టుకుంటే 1000 రూపాయ‌ల న‌జ‌రానా ప్ర‌క‌టించింది బ్రిటీష్ ప్ర‌భుత్వం. దాన్నిబట్టి ఆయన ఎంతగా వాళ్లను భయపెట్టాడో అర్థం చేసుకోవచ్చు. రాయ‌ల‌సీమ ప్రాంతానికి చెందిన ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి 1847, ఫిబ్ర‌వ‌రిలో బ‌హిరంగంగా ఉరి తీయ‌బ‌డ్డాడు.
ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి అసలు కథేంటి.. చిరంజీవికి ఎందుకంత ఆసక్తి..?
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫైల్ ఫోటో

ఈయ‌న జీవితంపై సినిమా చేయాల‌ని ఎప్ప‌ట్నుంచో అనుకుంటోన్న చిరంజీవి ఇప్పుడు పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది.. అక్టోబర్ 2న సినిమా విడుదల కానుంది. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ సంచలనాలు సృష్టిస్తుంది. సురేంద‌ర్ రెడ్డి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం రెండేళ్లకు పైగానే సమయం వెచ్చించారు చిరంజీవి.. సురేందర్ రెడ్డి. హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. టెక్నికల్ టీం కూడా మరో స్థాయిలో ఉంది. బాహుబలికి ఏ మాత్రం తగ్గకుండా సైరా కూడా వచ్చేస్తుంది. మొత్తానికి ఉయ్యాలవాడ జీవితం గురించి తెలుసుకోడానికి ఇప్పుడు ప్రేక్షకులు కూడా ఆసక్తిగానే వేచి చూస్తున్నారు.
First published: September 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading