చిరంజీవి గ్యాంగ్ లీడర్ రియల్ స్టోరీ.. మెగాస్టార్ అసలు హీరో కాదంట..

తెలుగు ఇండస్ట్రీకి చిరంజీవి రికార్డుల గ్యాంగ్ లీడర్. ఆయన సినిమా వచ్చిందంటే బాక్సాఫీస్ బద్ధలైపోవాల్సిందే. ఇప్పటికీ ఎప్పటికీ గ్యాంగ్ లీడర్ అంటే మెగాస్టార్ చిరంజీవి ఒక్కడే. ఆయన కెరీర్‌లో ఆ సినిమా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: November 26, 2019, 2:08 PM IST
చిరంజీవి గ్యాంగ్ లీడర్ రియల్ స్టోరీ.. మెగాస్టార్ అసలు హీరో కాదంట..
గ్యాంగ్ లీడర్
  • Share this:
తెలుగు ఇండస్ట్రీకి చిరంజీవి రికార్డుల గ్యాంగ్ లీడర్. ఆయన సినిమా వచ్చిందంటే బాక్సాఫీస్ బద్ధలైపోవాల్సిందే. ఇప్పటికీ ఎప్పటికీ గ్యాంగ్ లీడర్ అంటే మెగాస్టార్ చిరంజీవి ఒక్కడే. ఆయన కెరీర్‌లో ఆ సినిమా చేసిన అద్భుతాలు కూడా అలాగే ఉన్నాయి. అలాంటి గ్యాంగ్ లీడర్ సినిమా గురించి ఇప్పుడు ఆసక్తికరమైన విషయాలు బయటికి వచ్చాయి. నిజానికి ఈ చిత్రంలో హీరో చిరంజీవి కాదని చెబుతున్నారు పరుచూరి బ్రదర్స్. మరో హీరోను దృష్టిలో పెట్టుకుని గ్యాంగ్ లీడర్ కథ సిద్ధం చేసారు వాళ్లు. 90వ దశకం మొదట్లో కొండవీటి దొంగ సినిమాలో నాగబాబు కీలక పాత్రలో నటించాడు.

The real interesting story behind Megastar Chiranjeevi Gang Leader movie pk తెలుగు ఇండస్ట్రీకి చిరంజీవి రికార్డుల గ్యాంగ్ లీడర్. ఆయన సినిమా వచ్చిందంటే బాక్సాఫీస్ బద్ధలైపోవాల్సిందే. ఇప్పటికీ ఎప్పటికీ గ్యాంగ్ లీడర్ అంటే మెగాస్టార్ చిరంజీవి ఒక్కడే. ఆయన కెరీర్‌లో ఆ సినిమా.. gang leader,gang leader movie,chiranjeevi gang leader,naga babu gang leader,gang leader real story,chiranjeevi gang leader behind story,naga babu gang leader,paruchuri brothers naga babu gang leader,telugu cinema,Vijaya Bapineedu chiranjeevi,విజయ బాపినీడు,చిరంజీవి గ్యాంగ్ లీడర్,గ్యాంగ్ లీడర్ నాగబాబు,నాగబాబు పరుచూరి బ్రదర్స్ గ్యాంగ్ లీడర్,తెలుగు సినిమా
గ్యాంగ్ లీడర్ పోస్టర్

అందులో మెగా బ్రదర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. అప్పటి వరకు చిన్నా చితకా పాత్రలు చేస్తూ వచ్చిన తన తమ్మున్ని హీరోగా నిలబెట్టాలని చిరంజీవి ప్రయత్నాలు మొదలుపెట్టిన సమయంలో.. పరుచూరి బ్రదర్స్ ఆ బాధ్యత తీసుకోడానికి ముందుకొచ్చారని.. అప్పుడే గ్యాంగ్ లీడర్ కథకు బీజం పడిందని చెబుతున్నారు విశ్లేషకులు. టైటిల్ కూడా షోలే సినిమాలో ఫేమస్ అయిన అరె ఓ సాంబ అని పెట్టారు. దర్శకుడిగా విజయ బాపినీడును ఎంచుకున్నారు కూడా.

The real interesting story behind Megastar Chiranjeevi Gang Leader movie pk తెలుగు ఇండస్ట్రీకి చిరంజీవి రికార్డుల గ్యాంగ్ లీడర్. ఆయన సినిమా వచ్చిందంటే బాక్సాఫీస్ బద్ధలైపోవాల్సిందే. ఇప్పటికీ ఎప్పటికీ గ్యాంగ్ లీడర్ అంటే మెగాస్టార్ చిరంజీవి ఒక్కడే. ఆయన కెరీర్‌లో ఆ సినిమా.. gang leader,gang leader movie,chiranjeevi gang leader,naga babu gang leader,gang leader real story,chiranjeevi gang leader behind story,naga babu gang leader,paruchuri brothers naga babu gang leader,telugu cinema,Vijaya Bapineedu chiranjeevi,విజయ బాపినీడు,చిరంజీవి గ్యాంగ్ లీడర్,గ్యాంగ్ లీడర్ నాగబాబు,నాగబాబు పరుచూరి బ్రదర్స్ గ్యాంగ్ లీడర్,తెలుగు సినిమా
చిరంజీవి.,నాగబాబు(ఫైల్ ఫోటో)

అయితే ఈ కథ మొత్తం అయిపోయిన తర్వాత చూసుకుంటే తనకు ఇది అస్సలు సూట్ కాదని.. మెగా ఇమేజ్ ఉన్న అన్నయ్యకే సరిపోతుందని స్వయంగా నాగబాబు చెప్పడంతో కథలో కొన్ని మార్పులు చేసి అరె ఓ సాంబ కథనే మెగాస్టార్ కోసం గ్యాంగ్ లీడర్‌గా మార్చేసారు పరుచూరి సోదరులు. విజయ బాపినీడు తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయశాంతి హీరోయిన్. అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులతో చెడుగుడు ఆడుకుంది గ్యాంగ్ లీడర్. మొత్తానికి ఏదేమైనా కూడా నాగబాబు కోసం సిద్ధం చేసిన కథలో చిరు నటించడం.. అది బ్లాక్ బస్టర్ కావడం.. ఆయన కెరీర్‌లోనే బెస్ట్ మాస్ సినిమాల్లో ఒకటిగా నిలవడం అంతా యాదృశ్చికమే కదా..!
First published: November 26, 2019, 2:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading