హోమ్ /వార్తలు /సినిమా /

Rashmi Gautham: కుక్క పిల్లకి మద్యం.. రష్మీ పోస్ట్ వైరల్.. వెంటనే అరెస్ట్ చెయ్యాలి

Rashmi Gautham: కుక్క పిల్లకి మద్యం.. రష్మీ పోస్ట్ వైరల్.. వెంటనే అరెస్ట్ చెయ్యాలి

యాంకర్ రష్మీ గౌతమ్

యాంకర్ రష్మీ గౌతమ్

Rashmi Gautam: రష్మీ గౌతమ్ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. కుక్క పిల్లకు మద్యం పోసిన వ్యక్తులను అరెస్ట్ చేయాలని నెటిజన్లు కూడా డిమాండ్ చేస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రష్మీ గౌతమ్ (Rashmi Gautam).. ఇటు బుల్లితెరపై టీవీ షోలు, అటు వెండి తెరపై సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈమె కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాదు.. సామాజిక సేవలోనూ ముందుంటారు. ముఖ్యంగా రష్మీ జంతు ప్రేమికురాలు. ఆమెకు మూగజీవాలంటే ఎంతో ఇష్టం. వాటికి ఎలాంటి కష్టమొచ్చినా.. అస్సలు తట్టుకోలేరు.  పక్షులు,జంతువుల గురించి సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా పోస్ట్‌లు పెడుతుంటారు. మూగజీవాలను ఎవరైనా మేలు చేస్తే వారిని ప్రశంసిస్తారు. వాటిని హింసిస్తే.. సోషల్ మీడియా వేదికగా కడిగి పారేస్తుంటారు. తాజాగా రష్మీ గౌతమ్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

sudigali sudheer: ఫ్యాన్స్‌కి ఊహించని షాకిచ్చిన సుడిగాలి సుధీర్.. పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు

కొందరు యువకులు మద్యం పార్టీ చేసుకున్నారు. అదే సమయంలో ఓ కుక్కపిల్ల అటుగా రావడంతో.. దానికి కూడా ఓ గ్లాస్‌లో మందు పోశారు. ఏమీ తెలియని ఆ మూగజీవం.. మందు తాగింది. ఆ తర్వాత మత్తు ఎక్కడంతో తూలుతూ కనిపించింది. నడవలేక ఇబ్బంది పడి.. కిందపడిపోయింది. ఈ మొత్తాన్ని వారు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. అది వైరల్ కావడంతో.. రష్మీ దృష్టికి కూడా వెళ్లింది. కుక్క పిల్లకు మద్యం పోసిన ఆ వీడియోను చూసి ఆమె చలించిపోయారు. అసలు కుక్కపిల్లలకు మందు ఎవరు పోశారో వారిని కనిపెట్టాలని.. వారితో పాటు దానిని కామెడీ చేస్తున్న వారిని కూడా అరెస్ట్ చేయాలని ట్విటర్‌లో పోస్ట్ చేశారు రష్మీ గౌతమ్.

పెళ్లి కొడుకుగా మారిన టాలీవుడ్ హీరో నాగశౌర్య .. వైరల్ అవుతున్న వేడుకల ఫోటోలు

రష్మీ గౌతమ్ ట్వీట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. కుక్క పిల్లకు మద్యం పోసిన వ్యక్తులను అరెస్ట్ చేయాలని నెటిజన్లు కూడా డిమాండ్ చేస్తున్నారు. మూగజీవాల సంరక్షణ కోసం సోషల్ మీడియా వేదికగా రష్మీ చేస్తున్న కృషిని అభినందిస్తున్నారు.

కాగా, జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీ టీవీ షోలతో పలు సినిమాలు చేస్తున్నారు రష్మీ గౌతమ్. ఆమె నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రం ఇటీవలే విడుదలయింది. ఈ సినిమాలో నందు, రష్మీ జంటగా నటించారు. విజ‌యీభ‌వ ఆర్ట్స్ ప‌తాకంపై దర్శకుడు రాజ్ విరాఠ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కామెడీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీని ప్ర‌వీణ్ ప‌గ‌డాల నిర్మించారు. చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న భోళా శంకర్ సినిమాలోనూ రష్మీ నటిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఆ చిత్రం విడుదల కానుంది.

First published:

Tags: Rashmi Gautam, Tollywood

ఉత్తమ కథలు