నటుడు శింబు పెళ్లిపై ఆయన తండ్రి రాజేందర్ క్లారిటీ.. ఏం చెప్పారంటే..

శింబు పెళ్లిపై వార్తలు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ అనేకసార్లు శింబు పెళ్లిపై వార్తలు వచ్చాయి. వాస్తవానికి శింబు కేరీర్ ప్రారంభంలో నయనతారతో కొంతకాలం పాటు ప్రేమ వ్యవహారం నడిపాడు.

news18-telugu
Updated: June 7, 2020, 8:34 PM IST
నటుడు శింబు పెళ్లిపై ఆయన తండ్రి రాజేందర్ క్లారిటీ.. ఏం చెప్పారంటే..
నటుడు శింబు పెళ్లిపై ఆయన తండ్రి రాజేందర్ క్లారిటీ.. ఏం చెప్పారంటే..
  • Share this:
నటుడు శింబు, నయనతార పెళ్లి చేసుకోబోతున్నారన్న ప్రచారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో శింబు తల్లిదండ్రులు దర్శకుడు, సీనియర్ నటుడు రాజేందర్, ఉషా రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. శింబు పెళ్లిపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని, వాటిని నమ్మోద్దంటూ అభిమానులను కోరారు. ఇప్పటివరకు శింబు పెళ్లిపై ఏలాంటి నిర్ణయం తీసుకోలేదని, శింబుకు సరిపోయే సరైన జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. జాతకాలు కలిసే అమ్మాయి దొరికితే.. మేమే అందరికీ తెలియజేస్తామని, సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మకుండా వేచి చూడాలంటూ ఓ పత్రికా ప్రకటనను సైతం విడుదల చేశారు. కాగా శింబు పెళ్లిపై వార్తలు రావడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ అనేకసార్లు శింబు పెళ్లిపై వార్తలు వచ్చాయి. వాస్తవానికి శింబు కేరీర్ ప్రారంభంలో నయనతారతో కొంతకాలం పాటు ప్రేమ వ్యవహారం నడిపాడు. ఓ క్రమంలో ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని, తేదీలు సైతం ఫిక్స్ అయిపోయాయనే ప్రచారం జరిగింది. తీరా పెళ్లి చేసుకుంటారనుకునే సమయంలో ఏవో మనస్పర్ధలతో ఇద్దరూ విడిపోయారు.

అనంతరం మరో హీరోయిన్ హన్సికను సైతం ప్రేమించాడు. ఈ ప్రేమ తంతు కొద్ది రోజులకే బ్రేకప్ అయ్యింది. తర్వాత ఎవరితోనూ ప్రేమలో పడలేదు. కానీ ఇటీవల శింబు వివాహంపై కోలివుడ్‌లోనూ గుసగుసలు విన్పిస్తున్నాయి. లాక్‌డౌన్ అనంతరం తన మాజీ ప్రేయసి నయనతారతో పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. కానీ ఇలాంటి వార్తలన్నింటికీ శింబు తల్లిదండ్రులు చెక్ పెట్టడం గమనార్హం. ఈ వార్త మరోసారి శింబు అభిమానులను నిరాశే మిగిల్చిందని చెప్పాలి.
Published by: Narsimha Badhini
First published: June 7, 2020, 8:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading