THE NUMBER OF VOTES COMING TO SHANMUKH IS DECREASING WEEK BY WEEK WHAT IS THE REASON DETAILS HERE VB
Bigg Boss Telugu 5: షణ్ముఖ్ గ్రాఫ్ పడిపోవడానికి కారణం అదేనా.. అదే సన్నీకి కలిసొస్తుందా.. !
షణ్ముఖ్, సన్నీ
Bigg Boss Telugu 5: షణ్ముఖ్ జస్వంత్ యూట్యూబ్ స్టార్ గా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. "వైవా" అనే షార్ట్ కామెడీ వీడియోతో 2013లో యూట్యూబ్ లోకి అడుగుపెట్టిన ఇతను గత ఏడేళ్ళుగా వరుస షార్ట్ ఫిలిమ్స్ తో నటనలో మంచి పేరు తెచ్చుకున్నాడు.
షణ్ముఖ్ జస్వంత్యూట్యూబ్ స్టార్ గా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. "వైవా" అనే షార్ట్ కామెడీ వీడియోతో 2013లో యూట్యూబ్ లోకి అడుగుపెట్టిన ఇతను గత ఏడేళ్ళుగా వరుస షార్ట్ ఫిలిమ్స్ తో నటనలో మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత విడుదలైన "ది సాఫ్ట్ వేర్ డెవలపర్", "సూర్య" వంటి వెబ్ సిరీస్ లతో యూట్యూబ్ లో మంచి క్రేజ్ సంపాదించి మిలియన్ వ్యూస్ తో దూసుకుపోయాడు. ఒకవైపు వెబ్ సిరీస్ తోనే కాకుండా ప్రైవేటు సాంగ్స్ తో యూట్యూబ్ స్టార్ గా ఎదిగాడు. ఆఫేమ్ తోనే అతడు ప్రస్తుతం తెలుగులో ప్రసారం అవుతున్న అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 5 లో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదటి నుంచి అతడు హౌస్ లో తన కంటూ ఒక గ్రూప్ ను ఏర్పాటు చేసుకొని మైండ్ గేమ్ ఆడుతున్నాడు.
సిరి, జెస్సీతో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. అప్పటివరకు హౌస్ లో ఉన్నవాళ్లతో అప్పుడప్పుడు మాట్లాడే జస్వంత్ ఒక వారం మొదటి సారిగా కెప్టెన్ గా కూడా ఎంపిక అయ్యాడు. కెప్టెన్ గా అతడు వ్యవహరించిన తీరు ప్రశంసించదగినదిగానే ఉంది. అప్పటి నుంచే అతడు హౌస్ లో ఉన్న మిగతా కంటెస్టెంట్లతో కలవడం మొదలు పెట్టాడు. వాళ్లతో మాట్లాడుతూ ఇంట్రాక్ట్ అవుతూ వస్తున్నాడు. కానీ ఎంతో ఫేవరేట్ గా హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన షణ్ముఖ్ గ్రాఫ్ మాత్రం పడిపోతోంది. ప్రస్తుతం 11 వ వారం రన్ అవుతోంది. దీనిలో రవి తప్ప.. మిగతా 8 మంది నామినేషన్లో ఉన్నారు.
ఇక మొదట నాలుగైదు వారాల వరకు నామినేషన్లోకి వచ్చిన ప్రతీ సారి షణ్ముఖ్ మొదటి స్థానంలో ఉండేవాడు.. కానీ కొన్ని ప్రైవేట్ వెబ్ సైట్లు, యూట్యూబ్ చానల్స్ నిర్వహించిన సర్వేలో అతడు రెండో స్థానానికే పడిపోతున్నాడు. నాలుగైదు వారాల నుంచి సన్నీ మొదటి స్థానంలో దూసుకుపోతున్నాడు. అతడి ఓటింగ్ శాతం వారం వారానికి పెరిగిపోతోంది. దాదాపు 30 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ శాతంతో మొదటి స్థానంలో ఉంటున్నాడు. దీనికి గల కారణాలు వివిధ రకాలుగా విశ్లేషిస్తున్నారు. షణ్ముఖ్ ఆట ఆడటంలో ఎక్కువగా యాక్టివ్ ఉండడని.. సిరి, షణ్ముఖ్ మధ్య రిలేషన్ వేరే విధంగా పోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతీ సారి సిరి అలగడం.. లేదా షణ్ముఖ్ అలగడం.. చూసే ప్రేక్షకులకు అసహనం తెప్పించే విధంగా ఉన్నాయంటున్నారు నెటిజన్లు.
మరో వైపు షణ్ముఖ్ ఫ్యాన్స్ మాత్రం కెప్టెన్ అయిన దగ్గర నుంచి షణ్ముఖ్ ఆట తీరు మారిందని.. ఎంతో మెచ్యూరిటీగా ఆడుతున్నాడుని అంటున్నారు. ఇక సన్నీ విషయానికి వస్తే.. అతడు ఎలాంటి లవ్ ట్రాక్ లు నడిపించకుండ.. ఇచ్చిన టాస్క్ ను 100 శాతం పూర్తి చేస్తూ.. అప్పుడప్పుడు ఎంటర్ టైన్ చేస్తూ ముందుకు వెళ్తున్నాడు. దీంతో అతడి ఆటకు చాలామంది ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఎలాంట అంచనాలు లేకుండా వెళ్లిన సన్నీ.. అతడి ఆట తీరు, హౌస్ లో మెలిగే విధానంతోనే ఈ విధంగా ఓట్లు వస్తున్నాయనేది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇక విన్నర్, రన్నర్ గా సన్నీ లేదా షణ్ముఖ్ మధ్య ఉంటుందని తెలుస్తోంది.
ఇక మూడో స్థానంలో శ్రీరామ చంద్ర, నాలుగో స్థానంలో యాంకర్ రవి ఉంటారని సర్వేల ప్రకారం తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో మొత్తం 19 మంది కంటెస్టెంట్లతో మొదలైంది. ప్రస్తుతం హౌస్ నుంచి 10 మంది ఎలిమినేట్ అయ్యారు. హౌస్ లో 9 మంది మాత్రమే ఉన్నారు. ఎలిమినేట్ అయిన వారిలో సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టార్, హమిదా, శ్వేత, ప్రియా,లోబో, విశ్వా, జెస్సీ (అనార్యోగం కారణంగా) ఉన్నారు.10 వారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ పదకొండో వారం కూడా పూర్తి అయ్యే దశకు చేరుకుంది. ఇక 11 వ వారం మానస్ కెప్టెన్ కాగా.. యానీ లేదా ప్రియాంక సింగ్ బయటకు వెళ్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.