Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: August 14, 2020, 6:51 PM IST
నిహారిక నిశ్చితార్థం (Niharika Engagement)
నాగబాబు కూతురు నిహారిక నిశ్చితార్థం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులతో పాటు కొందరు సన్నిహితులు కూడా హాజరయ్యారు. అందరి సమక్షంలో కరోనా నిబంధనలను పాటిస్తూ వైభవంగా జరిపారు కుటుంబ సభ్యులు. చైతన్య జొన్నలగడ్డతో నిహా నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే పెళ్లి తేదీ కూడా ప్రకటించనున్నారు. ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులు అంతా వచ్చారు. అంతా వచ్చినా పవన్ కళ్యాణ్ మాత్రం రాలేదు.

నిహారిక నిశ్చితార్థం (niharika engagement)
దాంతో సోషల్ మీడియాలో దీనిపై చాలా చర్చలు జరిగాయి.. ఇంకా జరుగుతున్నాయి కూడా. మెగా బ్రదర్స్ మధ్య మళ్లీ వివాదాలు చెలరేగాయంటూ వార్తలు కూడా వచ్చాయి. మరోవైపు నితిన్ పెళ్లి కొడుకు వేడుకకు వచ్చిన పవన్.. నిహారిక నిశ్చితార్థానికి రాకపోవడం వెనక అసలు కారణం ఏంటి అంటూ ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరికి తోచిన కథలు వాళ్లు అల్లేసుకున్నారు. అయితే అసలు విషయం మాత్రం మరోలా ఉంది.. దాని వెనక కారణం కూడా మరోటి ఉంది.

నిహారిక నిశ్చితార్థం (niharika engagement)
పవన్ ప్రస్తుతం చాతుర్మాస్య దీక్షలో ఉన్నాడు. ఈ దీక్షలో భాగంగా ప్రతి రోజూ సాయంత్రం 6 తర్వాత ప్రత్యేక పూజలు చేస్తున్నాడని తెలుస్తుంది. నిశ్చితార్థం జరిగింది కూడా రాత్రి పూట కాబట్టి పవన్ రాలేకపోయాడని అతడి సన్నిహిత వర్గాలు చెప్తున్న మాట. మరోవైపు నితిన్ పెళ్లి కొడుకు వేడుక పొద్దున్నే జరిగింది. అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో పాటు వచ్చాడు. ఇక్కడ కూడా నాగబాబు ఇంటికి పవన్ ఉదయాన్నే వచ్చి నిహారికకు తన ఆశీర్వాదాలు అందించి వెళ్లాడని ప్రచారం జరుగుతుంది.

నిహారిక నిశ్చితార్థం (niharika engagement)
తాను సాయంత్రం రావడం లేదనే విషయాన్ని కూడా ముందుగానే అన్నయ్యకు చెప్పినట్లు తెలుస్తుంది. ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గత 17 ఏళ్లుగా తాను ఈ చాతుర్మాస్య దీక్ష చేస్తున్నట్టు పవన్ తెలిపాడు. ఇన్నాళ్ళూ వ్యక్తిగత కారణాల వల్ల చేసిన తాను.. ఈ సారి ప్రపంచం బావుండాలని చేస్తున్నట్టు తెలిపాడు. ఏదేమైనా కూడా పవన్ రాకపోవడం వెనక ఇంత పెద్ద కథ ఉందన్నమాట.
Published by:
Praveen Kumar Vadla
First published:
August 14, 2020, 6:51 PM IST