Home /News /movies /

THE LOKAYUKTA HAS DIRECTED CS SOMESH KUMAR TO APPEAR BEFORE IT AFTER A PERSON COMPLAINED ABOUT THE INCREASE IN MOVIE TICKET PRICES IN TELANGANA PRV

Movie ticket rates: అడ్డగోలుగా సినిమా టిక్కెట్ల ధరలు పెంచుతారా?.. సీఎస్​ సోమేశ్​ కుమార్​కు నోటీసులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సినిమా టిక్కెట్ల ధరలు పెంచడం మీదా, తగ్గించడం మీదా భిన్న వాదనలున్నాయి. అయితే చాలామందికి ఈ టిక్కెట్ల ధరలు భరించడం కష్టంగానే మారింది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ఏకంగా టిక్కెట్ల ధరలు పెంచడంపై ప్రభుత్వంపైనే ఫిర్యాదు చేశాడు.

    తెలుగు రాష్ట్రాల్లో ఈ ఏడాది సినిమా టిక్కెట్ల  (Cinema tickets)ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. కనీసం ఓ కుటుంబం కలిసి సినిమా చూసే స్థాయిలో కూడా లేవు. టిక్కెట్ల ధరలకే రూ వేలు చెల్లించాల్సి వస్తోంది. ఇక పిల్లలకు పెద్దలకు విరామం సమయంలో పాప్​కార్న్, కూల్​డ్రింక్స్​​ తదితర వాటిని కొనాలంటే అవి కూడా వందల రూపాయలకు తగ్గట్లేదు. దీంతో ఓ కుటుంబం సినిమా చూసి ఇంటికి చేరాలంటే కనీసం చేతిలో మూడు నాలుగు వేలు పెట్టుకుని ఉండాల్సిందే. అదే నెలలో మూడు నాలుగు సినిమాలు వస్తే ఇక ఒక సినిమాకి పరిమితం అయ్యే పరిస్థితులు వచ్చాయి. దీనిపై సోషల్​ మీడియాలోనూ భారీగానే ట్రోలింగ్​ జరిగింది.

    జీవో జారీని సవాల్ చేస్తూ..

    అసలు సినిమా టిక్కెట్ ధర ఎందుకు వుండాలి.? పేదవాడికి వినోదాన్ని తక్కువ ధరకు అందించాలని అధికారంలో వున్నోళ్ళు భావిస్తే తప్పేంటి.? భారతీయ సినిమా ఖ్యాతిని పెంచేలా తెలుగు సినిమా స్థాయి పెరుగుతున్న దరిమిలా, ‘క్వాలిటీ’కి అనుగుణంగా సినిమా టిక్కెట్ల ధరల్ని (Movie ticket rates) పెంచడంలో అభ్యంతరం తెలపాల్సిన అవసరమేంటి.? ఇలాంటి ప్రశ్నలు ప్రతీ సామాన్యుడికీ వచ్చేశాయి. ఇదే ప్రశ్నను ఓ వ్యక్తి ఫిర్యాదుగా చేశాడు. తెలంగాణలో (Telangana) సినిమా టిక్కెట్ల ధరలు (Movie ticket rates) అడ్డగోలుగా పెంచుకునేందుకు జీవో జారీని సవాల్ చేస్తూ తుప్పతి శ్రీనివాస్ అనే వ్యక్తి లోకాయుక్తలో పిటిషన్ వేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమారు శనివారం నోటీసులు జారీ చేసింది. జులై 22న లోకాయుక్త కోర్కు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.

    మార్చి నెలాఖరులో తెలంగాణలో ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా విడుదల సందర్భంగా, సినీ నటులు విజ్ఞప్తి మేరకు టిక్కెట్ల ధర పెంచుకోవచ్చునని ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇది సామాన్య సినీ అభిమానులకు ఆర్థిక భారంగా మారుతోందని పేర్కొంటూ, ప్రభుత్వం జారీ చేసిన జీవోకు (GO) వ్యతిరేకంగా సామాజిక సేవా కార్యకర్త, తీన్మార్ మల్లన్న టీం జనగాం జిల్లా కో కన్వీనర్ తుప్పతి శ్రీనివాస్ హైదరాబాద్లోని లోకాయుక్త  (Lokayuktha) కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

    పిటిషన్ పరిశీలించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్కు  (CS Somesh kumar)నోటీసులు జారీ చేసింది. జులై నెల 22వ తేదీన ఉదయం 11 గంటలకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. కొంత మంది ప్రైవేట్ వ్యక్తుల విజ్ఞప్తి మేరకు అడ్డగోలుగా సినిమా టిక్కెట్ల ధర (Movie ticket rates) పెంపు జీవో జారీ చేసి సామాన్యుల వద్ద 100ల కోట్ల రూపాయలు కొల్లగొట్టారని, ఈ జీవో జారీ వెనక కొంత మంది ప్రభుత్వ పెద్దలు మరియు రాజకీయ నాయకుల హస్తం ఉందని, ఈ విషయంపై న్యాయం చేయాలని లోకాయుక్త కోర్ట్ వారిని కోరడం జరిగిందని తుప్పతి శ్రీనివాస్ వెల్లడించారు..

    సినిమా టిక్కెట్ల ధరలు పెంచడం మీదా, తగ్గించడం మీదా భిన్న వాదనలున్నాయి. ఓ వర్గం టిక్కెట్ల ధరల తగ్గింపుని సమర్థిస్తోంటే, ఇంకో వర్గం టిక్కెట్ల ధరల పెంపుని సమర్థిస్తోంది. ఏది వాస్తవం.? ఏది ఎవరికి మంచిది.? ఈ అంశంపై లోతైన చర్చ జరుగుతోంది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Cs somesh kumar, Rrr movie, Telangana, Ticket

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు