Home /News /movies /

THE LION KING MOVIE REVIEW ANOTHER VISUAL WONDER FROM WALT DISNEY PICTURES PK

రివ్యూ: ‘ది ల‌య‌న్ కింగ్’.. మాయ చేసే మరో ప్రపంచం..

‘ది లయన్ కింగ్’ మూవీ

‘ది లయన్ కింగ్’ మూవీ

జంగిల్ బుక్ త‌ర్వాత డిస్నీ సంస్థ నుంచి వ‌చ్చిన మ‌రో అద్భుత‌మైన విజువ‌ల్ వండ‌ర్ ది ల‌య‌న్ కింగ్. ఈ చిత్రం ఇప్పుడు విడుద‌లైంది. మ‌రి ఇదెలా ఉంది.. అభిమానుల అంచ‌నాలు అందుకుందా లేదా..?

సంగీతం : హన్స్ జిమ్మెర్
సినిమాటోగ్రఫర్ : జోసెఫ్ కాలెబ్
ఎడిటర్స్ :మార్క్ లివోల్సి, ఆడమ్ గెర్స్టెల్
స్క్రీన్ ప్లే : జెఫ్ నాథన్సన్
నిర్మాణం: డిస్నీ
దర్శకత్వం : జోన్ ఫావ్రియు

జంగిల్ బుక్ త‌ర్వాత డిస్నీ సంస్థ నుంచి వ‌చ్చిన మ‌రో అద్భుత‌మైన విజువ‌ల్ వండ‌ర్ ది ల‌య‌న్ కింగ్. ఈ చిత్రం ఇప్పుడు విడుద‌లైంది. మ‌రి ఇదెలా ఉంది.. అభిమానుల అంచ‌నాలు అందుకుందా లేదా..?

కథ :
అడవిని రాజులా ఏలే సింహం ముఫాస‌. దానికి ఓ త‌మ్ముడు ఉంటాడు.. దాని పేరు స్కార్. అన్న సింహాస‌నంపై ఎప్పుడూ క‌న్నేసి ఉంటాడు. కానీ రాజు సింహం మాత్రం త‌న త‌ర్వాత రాజుగా కొడుకు సింహం సింబాను ప్ర‌క‌టిస్తాడు. ఆ త‌ర్వాత అనుకోకుండా ముఫాస చ‌నిపోతుంది. అన్న సింహం చ‌నిపోయిన త‌ర్వాత రాజ్యాన్ని త‌న చేతుల్లోకి తీసుకుని.. శత్రువులు అయిన హైనాల‌తో క‌లిసి అడ‌విని ముట్ట‌డిస్తాడు స్కార్. సింబా భ‌యంతో రాజ్యం నుంచి పారిపోతాడు. అలా వెళ్లిన సింబాను పంది పుంబా, ముంగీస టిమో కాపాడ‌తారు. అస‌లు ముఫాస ఎలా చ‌నిపోతుంది.. స్కార్ ఎందుకు రాజ్యాన్ని తీసుకుంటాడు.. ఆ త‌ర్వాత ఎలా రాజ్యాన్ని సింబా వ‌చ్చి ద‌క్కించుకున్నాడు అనేది అస‌లు క‌థ‌..

క‌థ‌నం:
ఇలాంటి సినిమాలకు క‌థ ఎలా ఉంద‌ని అడ‌క్కూడ‌దు. పైగా ది ల‌య‌న్ కింగ్ తెలియ‌ని క‌థ కాదు. ఎప్ప‌ట్నుంచి చూస్తున్న క‌థే. రాజ్యం కోసం అన్నాద‌మ్ములు పోరాడుకునే క‌థ ఇది. అన్న సింహం నుంచి మోసం చేసి త‌మ్ముడు రాజ్యాన్ని తీసుకోవ‌డమే కాకుండా ఆయ‌న కుటుంబాన్ని కూడా నాశ‌నం చేస్తాడు. ఆ త‌ర్వాత వార‌సుడు వ‌చ్చి రాజ్యాన్ని ఎలా ద‌క్కించుకున్నాడు అనేది క‌థ‌. బాహుబ‌లిలో కూడా ఇదే క‌థ ఉంటుంది. కాక‌పోతే ఇక్క‌డ ఉన్న‌ది జంతువుల బాహుబలి అన్నమాట‌. విజువ‌ల్ ట్రీట్ గా ఉంది ల‌య‌న్ కింగ్. ప్ర‌తీ ఫ్రేమ్ కూడా అదంగా.. అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీక్వెన్స్ లు చాలా బాగున్నాయి. జంతువులే అయినా కూడా క‌న్నీరు పెట్టించేంత ఎమోష‌న్ క‌థ‌లో ఉంది. ముఖ్యంగా రాజు సింహం చ‌నిపోయిన‌పుడు పిల్ల సింహం ప‌డే బాధ ఆక‌ట్టుకుంటుంది. అయితే క‌థ తెలిసిందే కాబ‌ట్టి కొన్ని సీన్స్ చాలా నెమ్మ‌దిగా సాగుతున్న ఫీల్ వ‌స్తుంది. అయితే విజువ‌ల్స్ దాన్ని మాయ చేస్తాయి.. మ‌రిపిస్తాయి. ఆక‌ట్టుకునేలా స్క్రీన్ ప్లే లేక‌పోయినా కూడా విఎఫ్ఎక్స్ క‌ళ్ల‌ను క‌ట్టి ప‌డేస్తుంది. దానికితోడు తెలుగులో చూసే వాళ్ల‌కు నాని, జ‌గ‌ప‌తిబాబు, ర‌విశంక‌ర్, బ్ర‌హ్మానందం, అలీ, షేకింగ్ శేషు లాంటి వాళ్ళ వాయిస్ సినిమాకు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా అనిపిస్తుంది.

టెక్నిక‌ల్ టీం:
ఈ సినిమాకు న‌టీన‌టులు ఉండ‌రు.. ఉన్న‌దంతా సాంకేతిక విభాగ‌మే. వాళ్ల గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా త‌క్కువే. డిస్నీ వ‌ర్క్స్ ఎలా ఉంటాయో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ల‌య‌న్ కింగ్ కూడా అంతే. ఒక్కొక్క‌రూ త‌మ ప‌నిత‌నాన్ని చూపించారు. ముఖ్యంగా విజువ‌ల్ ఎఫెక్ట్స్ అయితే న‌భూతో అన్న‌ట్లు ఉన్నాయి. ప్ర‌తీ ప్రేమ్ కంటికి ఇంపుగా అనిపించాయి.

చివ‌ర‌గా ఒక్క‌మాట‌:
ది ల‌య‌న్ కింగ్.. ఎమోష‌న‌ల్ అండ్ విజువ‌ల్ వండ‌ర్..
రేటింగ్: 3.5/5
First published:

Tags: Hollywood, The Lion King

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు