Home /News /movies /

THE LIGER HUNT THEME TELUGU LYRICAL TEASER RELEASED COMPOSED BY VIKRAM MONTROSE SR

The Liger Hunt Theme : లైగర్ ఫస్ట్ లిరికల్ విడుదల.. పిచ్చెక్కిపోవాల్సిందే.. అదిరిన రేస్పాన్స్..

The Liger Hunt Theme Photo : Twitter

The Liger Hunt Theme Photo : Twitter

The Liger Hunt Theme : రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఈరోజు తన 33వ పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో సామాన్యులతో పాటు సెలెబ్రిటీస్ ఆయన బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇక అది అలా ఉంటే ఆయన బర్త్ డే సందర్భంగా లైగర్ టీమ్ ఓ వీడియోను వదిలింది.

ఇంకా చదవండి ...
  రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ఈరోజు తన 33వ పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. దీంతో సామాన్యులతో పాటు సెలెబ్రిటీస్ ఆయన బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఇక అది అలా ఉంటే ఆయన బర్త్ డే సందర్భంగా లైగర్ టీమ్ ఓ వీడియోను వదిలింది. లైగర్ హంట్ అంటూ వచ్చిన ఈ వీడియో మామూలుగా లేదంటున్నారు నెటిజన్స్.. వీడియోలో విజయ్ మేకోవర్ గానీ, మ్యూజిక్ గానీ ఓ రేంజ్‌లో ఉన్నాయని అంటున్నారు. భాస్కరభట్ల రవికుమార్ రాసిన ఈ పాటకు విక్రమ్ మోట్రోసే సంగీతం ఇవ్వగా.. హేమ చంద్రపాడారు. సాంగ్‌కు సోషల్ మీడియాలో అదిరే రెస్పార్స్ వస్తోంది. లైగర్‌కు పూరి జగన్నాధ్ (Puri Jagannadh) దర్శకత్వం వహిస్తున్నారు. అనన్యపాండే హీరోయిన్‌గా (Ananya Panday) చేస్తున్నారు. ఈ సినిమా తాజాగా షూటింగ్‌ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. కిక్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ మూవీని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. లైగర్ (Liger) కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. ఈ సినిమాలో ఐటెమ్ నెంబర్ ఉందట. ఈ పాటలో డాన్స్ చేసేందుకు టీమ్ ఇప్పటికే చాలా మందిని పరిశీలించారట. ఈ సినిమాలో ఈ స్పెషల్ సాంగ్ కోసం కెజియఫ్ భామ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) ని సంప్రదించడమే కాదు.. ఆమె లైగర్‌‌లో సాంగ్ చేయబోతుందని గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో రూమర్ వినిపిస్తోంది. ఈ స్పెషల్ సాంగ్‌లో శ్రీనిధికి బదులుగా రష్మిక మందన్న (Rashmika Mandanna) చేయబోతుందని తెలుస్తోంది. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో..

  ఇక ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ రైట్స్‌ను దాదాపు 65 కోట్లకు హాట్ స్టార్ దక్కించుకుందని తెలుస్తోంది. అయితే ఇది అన్ని భాషలకు కలిపి అని అంటున్నారు. లైగర్  (Liger) తెలుగు శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా దక్కించుకుందని అంటున్నారు.  ఇక ఈ చిత్రం నుండి ఇటీవల ఫస్ట్ గ్లింప్స్ అంటూ ఓ వీడియోను వదిలింది చిత్రబృందం. ఈ వీడియో మంచి ఆదరణ పొందింది. అంతేకాదు ఇండియాలోనే ఏ సినిమాకు లేని అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకుంది. 20 మిలియన్ వ్యూస్‌తో ఐదు లక్షల లైక్స్‌తో ఈ వీడియో సంచలనం సృష్టించింది. లైగర్ ఆగస్టు 25, 2022లో విడుదల కానుంది. ఇక లైగర్ కథ విషయానికి వస్తే.. ముంబైలో ఓ మురికివాడలో ఛాయ్ అమ్ముడు జీవనం గడిపే ఓ ఫ్యామిలీ కుర్రాడు.. ఎలా ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా మారాడనేదే కథలా కనిపిస్తోంది. ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తున్నారు.


  మరోవైపు బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్  (Myke Tyson)‘లైగర్’లో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే మైక్ టైసన్‌కు సంబంధించిన షూట్ అమెరికాలో కంప్లీట్ అయింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అనన్య పాండే (Ananya Panday )హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతికతతో తెరకెక్కిస్తున్నారు.  ఈ లైగర్ అటు పూరీ, ఇటు విజయ్ కెరీర్‌లో కూడా అత్యంత ఎక్కువ బడ్జెట్ సినిమాగా వస్తోంది. లైగర్‌ను (Liger) ఛార్మి, ప్రముఖ హిందీ నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి నిర్మిస్తున్నారు.

  Anchor Suma : మరోసారి నోరు జారిన యాంకర్ సుమ.. పరువు తీసిన తమన్నా.. వీడియో వైరల్..

  ఈ సినిమా అలా ఉండగానే ఆయన పూరీతో మరో సినిమాను మొదలు పెట్టారు. విజయ్.. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో 'జనగణమన' (జేజీఎమ్) పేరిట మరో భారీ ప్యాన్ ఇండియా చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా ఈ సినిమా కథ మహేష్ బాబు కోసం రాశారట. కానీ ఏవో కారణాల వల్ల ఈ సినిమా అటు తిరిగి ఇటు తిరిగి విజయ్ దగ్గరకు వచ్చింది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఆగస్ట్ 3, 2023న ఈ సినిమా విడుదల కానుంది. ఇక విజయ్, సమంతలు కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. విడి 11 పేరుతో వస్తున్న ఈ చిత్రానికి ఖుషి అనే టైటిల్ ఖరారు అయ్యిందిని టాక్. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కశ్మిర్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇక ఈ సినిమాతో పాటు మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. విజయ్ దేవరకొండ, దర్శకుడు త్రివిక్రమ్‌తో ఓ సినిమా చేస్తున్నారని టాక్. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుందట. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. విజయ్, సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది.
  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Liger Movie, Tollywood news, Vijay Devarakonda

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు