హోమ్ /వార్తలు /సినిమా /

The Kashmir Files: ‘ది కశ్మీర్ ఫైల్స్’ రిలీజ్ అయ్యేది ఈ ఓటీటీలోనే!

The Kashmir Files: ‘ది కశ్మీర్ ఫైల్స్’ రిలీజ్ అయ్యేది ఈ ఓటీటీలోనే!

ఓటీటీలో ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ  (Twitter/Photo)

ఓటీటీలో ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ (Twitter/Photo)

ఈ సినిమా OTTలో ఎప్పుడు రిలీజ్ అవుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ది కశ్మీర్ ఫైల్స్ సినిమా OTT విడుదల మే నెలలో జీ 5 లో విడుదల కానుంది.

ఇటీవల ‘ది కశ్మీర్ ఫైల్స్’(The Kashmir files) సినిమా మార్చ్ 11న దేశ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలాంటి ప్రమోషన్లు లేకుండా సైలెంట్‌గా రిలీజ్ అయి సంచలనంగా మారింది. జీ స్టూడియోస్(Zee studious) మరియు తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మిథున్ చక్రవర్తి(Mithun Chakravarty), అనుపమ్ ఖేర్(Anupam kher), పల్లవి జోషి.. లాంటి ఎంతో మంది బాలీవుడ్ యాక్టర్స్ ఇందులో నటించారు. నరేంద్ర మోడీ కూడా ఈ సినిమాని చూసి చిత్ర యూనిట్ ని అభినందించారు. ప్రధాని నరేంద్ర మోదీతో (PM Narendra Modi)పాటు పలువురు బాలీవుడ్,టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ది కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ప్రశంసలు కురిపించారు.

ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా 250 కోట్ల మార్కును దాటేసింది. ఇప్పుడు ఈ సినిమా OTTలో ఎప్పుడు రిలీజ్ అవుతుందోనని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ది కశ్మీర్ ఫైల్స్ సినిమా OTT విడుదల మే నెలలో జీ 5 లో విడుదల కానుంది. అతి త్వరలో, మేకర్స్ ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తారు. ఈ చిత్రానికి పలు రాష్ట్రాల్లో ట్యాక్స్ మినహాయింపు కూడా ఇచ్చారు. యూపీ, కర్ణాటక, గుజరాత్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో ఈ సినిమాకి ఎంటర్టైన్ మెంట్ ట్యాక్స్ మినహాయించారు. అస్సాం(Assam) గవర్నమెంట్ అయితే ఈ సినిమా కోసం తమ ఉద్యోగులకు సెలవు ప్రకటించింది. ఎక్కడ చూసినా సినిమాకు పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. విమర్శకులు ప్రశంసలు సైతం అందుకుంది. రూ. 18 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. విడుదలైన 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.67.35 కోట్ల కలెక్షన్లు సాధించింది.

‘ది కశ్మీర్ ఫైల్స్‌’ సినిమా కథ 1980-90లలో కశ్మీర్‌ పండిట్‌లపై సాగిన సాముహిక హత్యాకాండని తెలుపుతుంది. కశ్మీర్ లోని హిందువులపై పాకిస్తాన్‌, పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దారుణ మారణ కాండకు పాల్పడ్డారు. కశ్మీర్ పండిట్లను విచక్షణ రహితంగా చంపేశారు, ఆడవారిని మానభంగాలు చేసారు, చిన్న పిల్లలని కూడా చూడకుండా చంపేశారు. కశ్మీర్ ని స్మశానంగా మార్చారు. కశ్మీర్ లో ఉండాలంటే మతం మారాలని, లేదంటే చంపేస్తామని బెదిరించారు. అడ్డుకున్న వారిని చంపేసి వారి ఆస్తులను దోచుకున్నారు. కశ్మీర్ అంటే స్వతంత్రం ముందు ఒక అందమైన ప్రదేశం, హిందువులకు, వేద బ్రాహ్మణులు, కశ్మీర్ పండిట్లు అంటూ స్వర్గంలా విరాజిల్లుతూ ఉండేది. కానీ స్వతంత్రం అనంతరం కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థం వల్ల, ఉగ్రవాదుల వల్ల, పాకిస్థాన్ వల్ల కశ్మీర్ స్వరూపమే మారిపోయింది.

First published:

Tags: Ott, Ott platform, Ott release, The Kashmir Files

ఉత్తమ కథలు