The Kashmir Files : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని సినిమా ఇండస్ట్రీలు నిజ జీవిత ఘటనల ఆధారంగా పలు సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఆయా సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ కోవలో 1990 దశకంలో కశ్మీర్‌లో జరిగిన దారుణ మారణ హింసాకాండకు దృశ్య రూపంగా ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమాను దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించారు. 90వ దశకంలో కశ్మీర్ పండితులపై అక్కడి జిహాదిలు చేసిన ఊచకోతకు ప్రతిరూపంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో మిథున్ చక్రబర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. 1990లో హిందు పండిత్స్ పై అప్పటి వరకు అక్కడే వారితో కలిసి మెలిసి తిరిగిన కొంత మంది వేరే మతానికి చెందిని వారు అక్కడ స్థానిక హిందూవుపై దారుణ మారుణ కాండకు పాల్పడ్డరు. వారి ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. వారికి అక్కడ నిలువ నీడ లేకుండా చేసి స్వదేశంలోనే శరణార్ధులుగా అయ్యేలా చేసారు.
మొత్తంగా కశ్మీర్ లోయలో చోటు చేసుకున్న ఈ భయానక సంఘటనలతో కశ్మీర్ పండిత్స్ కట్టుబట్టలతో మన దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. అప్పట్లో జరిగిన ఈ దారుణ మరుణ కాండకు కేంద్రంలో ఉన్న ఓ మంత్రి పరోక్షంగా సాయం చేసినట్టు సమాచారం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో ముష్కర దాడుల కారణంగా కశ్మీర్ పండితులను వారి స్వస్థలాల నుంచి తరిమి కొడితే.. పుట్ట కొకరు.. చెట్టుకొకరు అవుతారు.ఈ సినిమా ఈ శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటోంది. ఈ సినిమా మన దేశంలో 561 స్క్రీన్స్‌లో విడుదలైంది. ఓవర్సీస్‌లో 113 స్క్రీన్స్‌లో ఈ సినిమా విడుదలైంది.
#OneWordReview…#TheKashmirFiles: BRILLIANT. Rating: ⭐️⭐⭐️⭐️½#TheKashmirFiles is the most powerful film on #Kashmir and the genocide and exodus of #KashmiriPandits... Hard-hitting, blunt, brutally honest… JUST DON’T MISS IT. #TheKashmirFilesReview pic.twitter.com/FPnw7OidMK
— taran adarsh (@taran_adarsh) March 11, 2022
ముఖ్యంగా అనుపమ్ ఖేర్, మిథున్ చక్రబర్తి ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో నటించి మెప్పించారు. మన దేశంలోని కశ్మీర్ ప్రాంతంలో జరిగిన అత్యంత భయానకమైన దారుణ మారుణ కాండను వెండితెరపై ఆవిష్కరించడం అంటే అంత సులువు కాదు. ఈ సినిమాను తెరకెక్కించిన వివేక్ అగ్నిహోత్రికి ఈ సినిమాను ఆపేయమని బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని పలు ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
Radhe Shyam Movie Review : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ మూవీ రివ్యూ.. సిల్వర్ స్క్రీన్ పై విజువల్ వండర్..
అంతేకాదు ఈ సినిమాను అడ్డుకోవడానికి కోర్టులో వాజ్యాలు కూడా వేశారు. ఇలా ఎన్నో ఆటు పోట్లను ఎదర్కొని దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ప్రతి సన్నివేశం ప్రేక్షకులను కదిలించేలా ఉందని చెబుతున్నారు.ఈ సినిమాలో నిజమైన కశ్మీర్ నుంచి వలస వచ్చిన నిజమైన పండిత్.. అనుపమ్ ఖేర్ ముఖ్యపాత్రలో నటించడం చెప్పుకోదగ్గ అంశం.
Akhanda - NBK : 100 రోజుల బాలకృష్ణ ‘అఖండ’.. డిజిటల్ యుగంలో నట సింహా మరో రేర్ రికార్డ్..
ఈ సినిమాలో నటించిన ఇతర నటీనటులు కూడా తమ పరిధి మేరకు బాగానే నటించారు. ఇందులో సన్నివేశాలు కూడా ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా ఉన్నాయి. మొత్తంగా 90 దశకంలో మన దేశంలోనే శరణార్ధులుగా మారిన కశ్మీర్ పండిత్స్ దీనగాథపై తెరకెక్కిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.