వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన సినిమా 'ది కశ్మీర్ ఫైల్స్'(The Kashmir Files).ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ మరియు పల్లవి జోషి ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.250 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ కానుంది. ఈ సినిమాను ప్రముఖ ఓటిటి సంస్థ జీ 5 కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. మే 13 నుండి ది కశ్మీర్ ఫైల్స్ (The Kashmir files) జీ5లో స్ట్రీమింగ్ కానుంది.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే... 1990 దశకంలో కశ్మీర్‌లో జరిగిన దారుణ మారణ హింసాకాండకు దృశ్య రూపంగా ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమాను దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించారు. 90వ దశకంలో కశ్మీర్ పండితులపై అక్కడి జిహాదిలు చేసిన ఊచకోతకు ప్రతిరూపంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో మిథున్ చక్రబర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్శన్ కుమార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.
1990లో హిందు పండిత్స్ పై అప్పటి వరకు అక్కడే వారితో కలిసి మెలిసి తిరిగిన కొంత మంది వేరే మతానికి చెందిని వారు అక్కడ స్థానిక హిందూవుపై దారుణ మారుణ కాండకు పాల్పడ్డరు. వారి ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. వారికి అక్కడ నిలువ నీడ లేకుండా చేసి స్వదేశంలోనే శరణార్ధులుగా అయ్యేలా చేసారు. మొత్తంగా కశ్మీర్ లోయలో చోటు చేసుకున్న ఈ భయానక సంఘటనలతో కశ్మీర్ పండిట్స్ కట్టుబట్టలతో మన దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు.
అప్పట్లో జరిగిన ఈ దారుణ మరుణ కాండకు కేంద్రంలో ఉన్న ఓ మంత్రి పరోక్షంగా సాయం చేసినట్టు సమాచారం. ఈ సినిమా మన దేశంలో 561 స్క్రీన్స్‌లో విడుదలైంది. ఓవర్సీస్‌లో 113 స్క్రీన్స్‌లో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రికి సినిమా ఆపేయాలంటూ బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని పలు ఇంటర్వ్యూలో ఆయన ప్రస్తావించారు.
ది కశ్మీర్ ఫైల్స్ విడుదలయ్యాక భారీ విజయాన్ని దక్కించుకుంది. పలువురు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని మెచ్చుకున్నారు. ప్రధాని మోడీ సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. పలువురు బాలీవుడ్ అగ్ర హీరోలు సైతం ఈ సినిమా చూడాలన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Ott release, The Kashmir Files