• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • THE INTERESTING FACTS BEHIND VENKATESH STARRER CHANTI MOVIE AND DO YOU KNOW KEY ROLE OF CHIRANJEEVI PK

Venkatesh Chanti: ‘చంటి’ సినిమా వెనక ఆసక్తికరమైన నిజాలు.. హీరో వెంకటేష్ కాదంట..

Venkatesh Chanti: ‘చంటి’ సినిమా వెనక ఆసక్తికరమైన నిజాలు.. హీరో వెంకటేష్ కాదంట..

వెంకటేష్ చంటి (Venkatesh Chanti)

Venkatesh Chanti: వెంకటేష్ కెరీర్‌ను మార్చేసిన సినిమాల్లో చంటి కూడా ఉంటుంది. అప్పటికే బొబ్బిలి రాజా లాంటి సినిమాతో ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకున్న వెంకటేష్.. వెంటనే చంటితో రికార్డులు తిరగరాసాడు. ఈ చిత్రం సంచలన విజయం సాధించి..

  • Share this:
వెంకటేష్ కెరీర్‌ను మార్చేసిన సినిమాల్లో చంటి కూడా ఉంటుంది. అప్పటికే బొబ్బిలి రాజా లాంటి సినిమాతో ఇండస్ట్రీ హిట్ సొంతం చేసుకున్న వెంకటేష్.. వెంటనే చంటితో రికార్డులు తిరగరాసాడు. ఈ చిత్రం సంచలన విజయం సాధించి వెంకటేష్‌కు తిరుగులేని ఫ్యామిలీ ఇమేజ్ తీసుకొచ్చింది. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో మీనా, నాజర్‌, సుజాత, మంజుల, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 1992 జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం 29ఏళ్లు పూర్తి చేసుకుంది. తమిళంలో ఘన విజయం సాధించిన 'చినతంబి' సినిమాని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు మార్చి తీసారు నిర్మాత కె.ఎస్‌.రామారావు. అమాయకుడైన పల్లెటూరి యువకుడి పాత్రలో వెంకటేష్ నటనకు అంతా ఫిదా అయిపోయారు. ఇప్పటికీ చంటి అంటే వెంటనే వెంకీ ఫేస్ గుర్తుకొస్తుంది. అయితే ఈ చిత్రం వెనక అసలు నిజాలు చాలానే ఉన్నాయి. ముందు ఈ చిత్రం తెలుగులో రీమేక్ చేయాలి అనుకున్నపుడు దర్శకుడు, నిర్మాత బుర్రలో అస్సలు వెంకటేష్ లేడు.
venkatesh,venkatesh chanti movie,venkatesh chanti movie 29 years completed,venkatesh meena chanti movie 29 years,telugu cinema,chanti movie hero rajendra prasad,venkatesh twitter,వెంకటేష్,వెంకటేష్ విజయశాంతి,వెంకటేష్ మీనా చంటి సినిమాకు 29 ఏళ్లు
వెంకటేష్ చంటి (Venkatesh Chanti)


ఇందులో కథానాయకుడిగా రాజేంద్రప్రసాద్‌ అనుకున్నారు దర్శకుడు రవిరాజా పినిశెట్టి. అయితే వెంకీతో సినిమా చేయడం వెనక అసలు కారణం ఓ సందర్భంలో చెప్పాడు దర్శకుడు. యార్లగడ్డ సురేందర్‌ నిర్మాతగా వెంకటేష్ హీరోగా ఓ సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్న సమయంలోనే నిర్మాత రామానాయుడు తమిళంలో హిట్ అయిన 'చినతంబి' చూసి ఈ కథ వెంకీకి సరిపోదని అనుకున్నారు. కానీ ఆ తర్వాత నిర్మాత కె.ఎస్‌.రామారావు ఈ సినిమా చూసి 'చంటి' పాత్రకు రాజేంద్రప్రసాద్‌ సరిపోతాడని ఆయన అనుకున్నాడు. అదే విషయం రాజేంద్రప్రసాద్‌కూ కూడా చెప్పాడు. రవిరాజా పినిశెట్టి దర్శకుడిగా ఈ సినిమాను అనౌన్స్ చేసారు కూడా.
venkatesh,venkatesh chanti movie,venkatesh chanti movie 29 years completed,venkatesh meena chanti movie 29 years,telugu cinema,chanti movie hero rajendra prasad,venkatesh twitter,వెంకటేష్,వెంకటేష్ విజయశాంతి,వెంకటేష్ మీనా చంటి సినిమాకు 29 ఏళ్లు
వెంకటేష్ చంటి (Venkatesh Chanti)

రాజేంద్రప్రసాద్‌తో తనకున్న పరిచయాన్ని బట్టి ప్రాజెక్టు బాగానే వస్తుందని అంతా అనుకున్నామని చెప్పాడు ఈ దర్శకుడు. అయితే ఇదంతా కూడా తమిళ 'చినతంబి' విడుదల కాకముందు జరిగిన కథ అని.. కానీ అక్కడ విడుదలైన తర్వాత ఆ సినిమా సాధించిన ఘన విజయం చూసి సురేశ్‌ బాబు, వెంకటేష్ ఇద్దరూ మనసు మార్చుకున్నట్లు చెప్పాడు ఈ దర్శకుడు. దాంతో కె.ఎస్‌.రామారావు దగ్గరకు వచ్చి వెంకటేష్‌తో సినిమా చేయమని అడిగారని.. కానీ అందుకు తాను అంగీకరించలేదని చెప్పాడు రవిరాజా.
venkatesh,venkatesh chanti movie,venkatesh chanti movie 29 years completed,venkatesh meena chanti movie 29 years,telugu cinema,chanti movie hero rajendra prasad,venkatesh twitter,వెంకటేష్,వెంకటేష్ విజయశాంతి,వెంకటేష్ మీనా చంటి సినిమాకు 29 ఏళ్లు
చిరంజీవి వెంకటేష్

అవసరమైతే ప్రాజెక్టు నుంచి తప్పుకుంటాను కానీ రాజేంద్రప్రసాద్‌ కాకుండా వెంకీతో సినిమా చేయలేనని చెప్పేసాడు ఈ దర్శకుడు. ఎందుకంటే అప్పటికే ఈయనకు మాటిచ్చాడు కాబట్టి. అలాంటి సమయంలో చిరంజీవి సీన్‌లోకి వచ్చి దర్శకుడు రవిరాజాను ఒప్పించాడు. తమిళంలో నటించిన ఖుష్బూ ఒప్పుకోకపోవడంతో మీనాను తీసుకున్నామని చెప్పాడు ఈ దర్శకుడు. అలా రాజేంద్రప్రసాద్ చేయాల్సిన సినిమాలో వెంకటేష్ వచ్చి చేరిపోయాడు.
Published by:Praveen Kumar Vadla
First published:

అగ్ర కథనాలు