జబర్దస్త్ కామెడీ షో చూసేవాళ్లకు చమ్మక్ చంద్ర గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇప్పుడు ఆయన ఆ షో మానేసాడు అయినా కూడా ఇప్పటికీ ఎప్పటికీ చంద్ర అంటే కేరాఫ్ జబర్దస్త్ అంటారు అభిమానులు. ఇక ఈ షోలో ఎక్కువగా అబ్బాయిలే కనిపిస్తుంటారు. అమ్మాయిలు చేయలేక కాదు కానీ ఎక్కువగా ఒకర్ని ఒకరు ముట్టుకోవడం ఉంటుంది కాబట్టి అమ్మాయిలను తీసుకోవడం మంచిది కాదని చెప్పారు అప్పట్లో ఈ నటులంతా. అయితే అలాంటి సమయంలో కూడా ఫ్యామిలీ స్కిట్స్ ఎక్కువగా చేసే చంద్ర తన టీంలో ఓ అమ్మాయిని తీసుకొచ్చాడు.
గత ఐదేళ్లుగా అదే టీంలో ఆయనతో పాటే స్టేజీపై కామెడీ చేస్తుంది ఓ అమ్మాయి. ఆమె కామెడీకి కడుపులు చెక్కలయ్యేలా నవ్వుకుంటారు ఆడియన్స్ కూడా. జబర్దస్త్ కామెడీ షోలో ఓ అమ్మాయిని తీసుకొచ్చి ఆమెతో అంతగా కామెడీ చేయించిన ఘనత మాత్రం చమ్మక్ చంద్ర సొంతమే. ఆమె ఎవరనేది మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. చంద్ర టీంలో చేసే అమ్మాయి గురించి బయట కూడా అరుదుగా తెలుసు. ఆ అమ్మాయి పేరు సత్య శ్రీ.. కొన్నేళ్లుగా చంద్ర టీంలోనే రెగ్యులర్గా చేస్తుంది.
దాంతో పాటే సినిమాలు కూడా చేసింది కానీ సత్య గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. రాజా ది గ్రేట్, ఆర్డిఎక్స్ లవ్ లాంటి సినిమాల్లో కూడా నటించినా సత్యకు గుర్తింపు మాత్రం రాలేదు. అయితే జబర్దస్త్ పుణ్యమా అని అక్కడ మాత్రం బాగానే బిజీ అయిపోయింది. ఇప్పుడు చంద్రతో పాటే సత్య కూడా జీ తెలుగుకు వెళ్లిపోయింది. అక్కడ అదిరిందిలో ఆయనతో పాటే స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. ఏదేమైనా కూడా కేరాఫ్ చంద్రగా ఉంటూ దూసుకుపోతుంది ఈమె.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chammak Chandra, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood