THE HOUSE FOUND IN ALLU ARJUN TRIVIKRAM ALA VAIKUNTHAMPURRAMLOO IS THE DAUGHTER OF ONE OF THE TELUGU CHANEL OWNER TA
అల వైకుంఠపురంలో కనిపించే ఇల్లు ఆ ఛానల్ ఓనర్ కూతురిది..
‘అలా వైకుంఠపురంలో’ ఫస్ట్ లుక్
అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కలయికలో ఈ సంక్రాంతికి విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రఫ్పాడించేస్తోంది. ఐతే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ‘అల వైకుంఠపురములో’ కనిపించే ఇంటి గుట్టు బయటపడింది.
అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కలయికలో ఈ సంక్రాంతికి విడుదలైన ‘అల వైకుంఠపురములో’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రఫ్పాడించేస్తోంది. ఐతే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం చిత్ర యూనిట్ రివీల్ చేసింది. ‘అల వైకుంఠపురములో’ కనిపించే ఇంటి గుట్టు బయటపడింది. ‘అత్తారింటికి దారేది’ చిత్రం కోసం రామోజీఫిల్మ్ సిటిలో ఓ పెద్ద బంగ్లా సెట్ వేయించిన త్రివిక్రమ్ ... అల వైకుంఠపురానికి మాత్రం రియల్ ఇంట్లోనే షూట్ చేయడం విశేషం. ఈ ఇల్లు ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ అధినేత కుమార్తెకు సంబంధించినదట. ఈ ఇల్లు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉంది. సుమారు రూ. 300 కోట్ల విలువచేసే ఆ ఇల్లు అత్యంత విలాసవంతంగా నిర్మించారు. ఎంతలా అంటే ఆ ఇంటి గార్డెన్ లో పూసే పూలకు కూడా పేటెంట్ ఉంది. ఇటలీ నుంచి తెప్పించిన విలువైన మొక్కలు ఆ ఇంట్లో ఉన్నాయి. ఓ సారి ఆ ఇంటిని అనుకోకుండా చూసిన త్రివిక్రమ్ ... తన కథకు సరిగ్గా సరిపోయే ఇల్లు దొరికిందని సంతోషించారు. వెంటనే యజమానులతో మాట్లాడగానే... అడిగింది మాటల మాంత్రికుడు కదా అని అంగీకరించారు. ఇప్పుడు ఆ ఇల్లు వైకుంఠపురముగా మారి సినిమాలో కీ రోల్ పోషించింది. సుమారు 20 రోజుల పాటు ఆ ఇంట్లో సినిమా షూట్ చేశారు. అయితే ఆ ఇంటిని చూసిన అల్లు అర్జున్ కూడా విలాసవంతమైన ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు.
‘అల వైకుంఠపురములో’ (Twitter/Photo)
ఇంటికి సంబంధించిన పలు విషయాలను యజమానులను అడిగి తెలుసుకున్నాడు. అదే స్థాయిలో బంజారాహిల్స్ లో ఇంటిని నిర్మించుకోబోతున్నట్టు అల్లు అర్జున్ ఈ సినిమా థాంక్స్ మీట్లో భాగంగా చెప్పాడు. అంతేకాదు ఆ ఇంటి నిర్మాణానికి నిర్మాతైన తన తండ్రి అల్లు అరవింద్ ను డబ్బులు అడుగుతానని చెప్పాడు. ఐ యితే బన్నీ కట్టుకోబోయే ఆ ఇల్లు ఎలా ఉంటుందో.. ఆ ఇంటికి తనకు సూపర్ హిట్ అందించిన ‘అల వైకుంఠపురములో’ అని తన సినిమా పేరునే పెట్టుకుంటాడనేది చూడాలి. మొత్తానికి త్రివిక్రమ్ బన్నీకి సూపర్ హిట్ ఇవ్వడమే కాకుండా ఓ ఇంటి వాణ్ని చేస్తుండటం మరో విశేషం. ఇంతకీ ఈ ఇల్లు ఎవరిదో చెప్పలేదు కదా.. ఈ ఇల్లు ప్రముఖ న్యూస్ ఛానెల్ N TV అధినేత నరేంద్ర చౌదరి ఏకైక కూతరు రచన ది కావడం విశేషం.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.