THE GOD FATHER TURNS 50 HERE ARE SOME INTERESTING FACTS ABOUT HOLLYWOOD CLASSIC MOVIE GH SRD
God Father : హాలీవుడ్ కళాఖండం గాడ్‌ఫాదర్ కి 50 ఏళ్లు.. ఈ సినిమా ప్రత్యేకతలేంటో తెలుసా?
The God Father
God Father : రాంగోపాల్ వర్మ "సర్కార్", మణిరత్నం "నాయకన్" వంటి చాలా చిత్రాలకు ఇది స్పూర్తిగా నిలిచింది. ఇంకా ఎన్నో భారతీయ సినిమాలు దీని నుంచి ఇన్స్పైర్ అయ్యాయి.
1972 మార్చి 14న తెరకెక్కిన హాలీవుడ్ క్లాసిక్ది గాడ్ ఫాదర్ (The God Father) తాజాగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. గ్యాంగ్‌స్టర్ జానర్ లో వచ్చిన ది గాడ్‌ఫాదర్ 1972లో హైయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీగా రికార్డులు బద్దలు కొట్టింది. అంతేకాదు ఇది మూడు ఆస్కార్ (Oscar) అవార్డులను గెలుచుకుంది. అలానే హాలీవుడ్ ఆల్ టైం గ్రేటెస్ట్ మూవీల్లో గాడ్ ఫాదర్ ఒకటిగా నిలుస్తోంది. ఇది అమెరికన్ సినిమాకి కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసిందనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇలాంటి గ్రేటెస్ట్ మూవీ థియేటర్లలో చూడటం మిస్ అయ్యామని ఫీల్ అయ్యే వారికి ఒక గుడ్ న్యూస్ చెప్పింది పారామౌంట్ పిక్చర్స్ ప్రొడక్షన్ కంపెనీ. మూవీ విడుదలై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మళ్లీ గాడ్‌ఫాదర్ సినిమాని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. అలానే ఫిలిం మేకింగ్ వీడియో, రీమాస్టర్డ్ డీవీడీలు, ఒక కాఫీ టేబుల్ బుక్, దర్శకుడు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కొప్పాలా (Francis Ford Coppola)తో ఒక కొత్త ఇంటర్వ్యూని ప్రేక్షకులకు అందుబాటులోకి తేనుంది.
గాడ్‌ఫాదర్ సినిమా ఓపెనింగ్ సీనే వేరే లెవెల్ లో ఉంటుంది. క్రైమ్ అండ్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా అంటేనే రామ్ గోపాల్ వర్మ, సెల్వరాఘవన్ వంటి స్టార్ డైరెక్టర్లు చెవి కోసుకొంటారు. నిజానికి ప్రతి మూవీ లవర్ చూడాల్సిన సినిమాల్లో గాడ్‌ఫాదర్ టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఈ ఐకానిక్ ఇటాలియన్ మాఫియా ఫ్యామిలీ డ్రామాని ఫ్రాన్సిస్ ఫోర్డ్ (Francis Ford Coppola) అద్భుతంగా డైరెక్ట్ చేశారు. అందుకే ఐదు దశాబ్దాల తరువాత కూడా ఇప్పటివరకు రూపొందించిన గొప్ప, అత్యంత ప్రభావవంతమైన అమెరికన్ చిత్రాలలో ఇది ఒకటిగా నిలుస్తోంది.
మూడు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్న సినిమా..
గాడ్ఫాదర్అమెరికన్ సినిమాల్లో కొత్త శకానికి నాంది పలికింది. భౌతిక, మానసిక హింస డిఫరెంట్ గా చూపించడం నుంచి మాఫియా గురించి కళ్లకి కట్టినట్లు చూపించడం వరకూ ఫ్రాన్సిస్ ఫోర్డ్ ఒక కొత్త స్టాండర్డ్ ని క్రియేట్ చేశారు. ఈ సినిమా అవినీతిని అవినీతి కోణం నుంచి చూసింది. అవినీతి అనేది అమెరికన్ లైఫ్ లో ఒక అనివార్యమైన భాగం అని ఈ సినిమా చక్కగా చెప్పుకొచ్చింది. అవినీతి, నేరాల కలయిక, మార్కెట్ పెట్టుబడిదారీ విధానం, ప్రభుత్వం, కుటుంబాన్ని సమాజానికి ఎగువన ఉంచడం వంటి వాటిని చూపించడానికి గాడ్‌ఫాదర్ కొత్త స్టోరీ టెల్లింగ్ విధానాన్ని ఎంచుకుంది.
ఇది అమెరికా ప్రభుత్వం గురించి ధైర్యంగా చాలా విషయాలను ప్రేక్షకులకు చూపించింది. ఇక డాన్ వీటో కార్లియోన్‌గా నటించిన మార్లోన్ బ్రాండో యాక్టింగ్ అద్భుతం అని చెప్పచ్చు. మార్లోన్ చెప్పిన డైలాగులు ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో మెదులుతూనే ఉంటాయి. 'ది గాడ్‌ఫాదర్' సినిమాతో ఫ్రాన్సిస్ ఫోర్డ్ పేరు నలుమూలలా దద్దరిల్లింది.
రాంగోపాల్ వర్మ "సర్కార్", మణిరత్నం "నాయకన్" వంటి చాలా చిత్రాలకు ఇది స్పూర్తిగా నిలిచింది. ఇంకా ఎన్నో భారతీయ సినిమాలు దీని నుంచి ఇన్స్పైర్ అయ్యాయి. మార్టిన్ స్కోర్సెస్, జాన్ వూ, స్పైక్ లీ లాంటి గొప్ప హాలీవుడ్ డైరెక్టర్లు కూడా గాడ్ ఫాదర్ సినిమాలో కొప్పాలా చూపించిన సీన్ల నుంచి ఇన్స్పిరేషన్ పొందారు. ఈ కల్చరల్, హిస్టారికల్ ఎపిక్ క్రైమ్ డ్రామా "ది గాడ్ ఫాదర్" అనే నవల ఆధారంగా తెరకెక్కింది. దీనికి సీక్వెల్ గా గాడ్ ఫాదర్ పార్ట్ 2, గాడ్ ఫాదర్ పార్ట్ 3 వచ్చాయి.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.