హోమ్ /వార్తలు /సినిమా /

The Ghost Movie Review: నాగార్జున ‘ది ఘోస్ట్’ మూవీ రివ్యూ.. యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్..

ది ఘోస్ట్ (The Ghost)
ది ఘోస్ట్ (The Ghost)
2.5/5
రిలీజ్ తేదీ:5/10/2022
దర్శకుడు : ప్రవీణ్ సత్తారు (Praveen Sattaru)
సంగీతం : మార్క్ కే రోబిన్ 
నటీనటులు : నాగార్జున అక్కినేని, సోనాల్ చౌహాన్,గుల్ పనాగ్,అనికా సురేంద్రన్, శ్రీకాంత్ అయ్యంగార్,రవివర్మ  తదితరులు..
సినిమా శైలి : యాక్షన్ డ్రామా (Action Drama )
సినిమా నిడివి : 2 Hr 14 M

The Ghost Movie Review: నాగార్జున ‘ది ఘోస్ట్’ మూవీ రివ్యూ.. యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్..

 నాగార్జున ది ఘోస్ట్ రివ్యూ

నాగార్జున ది ఘోస్ట్ రివ్యూ

The Ghost Movie Review | కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ది ఘోస్ట్’. స్పై నేపథ్యంలో తెరకెక్కింది. గరుడ వేగ సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ తెరకెక్కించిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి దసరా కానుకగా విడుదలైన ‘ది ఘోస్ట్’ చిత్రంతో నాగార్జున సక్సెస్ అందుకున్నారా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

    రివ్యూ : ది ఘోస్ట్  (The Ghost)

    నటీనటులు : నాగార్జున అక్కినేని, సోనాల్ చౌహాన్,గుల్ పనాగ్,అనికా సురేంద్రన్, శ్రీకాంత్ అయ్యంగార్,రవివర్మ  తదితరులు..

    ఎడిటర్: ధర్మేంద్ర కాకరాల

    సినిమాటోగ్రఫీ:  ముఖేష్.జి

    సంగీతం: మార్క్ కే రోబిన్

    నిర్మాత : శ్రీ వేంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్టేన్మెంట్

    దర్శకత్వం: మోహన్ రాజా

    విడుదల తేది : 05/10/2022

    The Ghost Movie Review | కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ది ఘోస్ట్’. స్పై నేపథ్యంలో తెరకెక్కింది. గరుడ వేగ సినిమాతో టాలెంటెడ్ డైరెక్టర్ తెరకెక్కించిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి దసరా కానుకగా విడుదలైన ‘ది ఘోస్ట్’ చిత్రంతో నాగార్జున సక్సెస్ అందుకున్నారా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

    కథ: 

    నాయర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంటుంది. నాగార్జున సిస్టర్ కంపెనీకి టేకోవర్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి. మేనకోడలిని వెంటాడే ఓ బ్యాచ్, వాళ్లనుంచి తన సిస్టర్ ని, మేనకోడల్ని కాపాడుకునే మేనమామగా నాగార్జున పడే తపన ది ఘోస్ట్ స్టోరీ. ఇది సింపుల్ గా ది ఘోస్ట్ స్టోరీ లైన్. కథ కంటే,ఈ సినిమాను కథనమే మరో లెవల్ కి తీసుకుపోయిందంటున్నారు. ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్ కి ఫ్యామిలీ డ్రామాని యాడ్ చేస్తే ఫైనల్ గా అదే ది ఘోస్ట్ అనుకోవచ్చంటున్నారు.

    కథనం, టెక్నీషియన్స్..

    ఈ సినిమాలో నాగార్జున నటన బావుంది. విక్రమ్ (నాగార్జున) ఇంటర్ పోల్ ఆఫీసర్‌గా నటించాడు. ఇక గరుడ వేగ తర్వాత ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ కూడా బావుంది. డైరెక్టర్ టేకింగ్ కు మంచి మార్కులు వేయాల్సిందే. సినిమాను మరింత స్టైలిష్ గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. కథ విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెడితే బాగుండేది. తెలుగులో స్టైలిష్ యాక్షన్ చిత్రాలకు ప్రవీణ్ సత్తారు ఇక కేరాఫ్ అడ్రస్ అని చెప్పాలి. క్లైమాక్స్‌‌లో సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు. ఇక నాగార్జున ఫ్లాష్ బ్యాక్‌‌ను ఖడ్గం స్టోరీని ఇంకాస్తా డెప్ట్‌గా చెబితే బాగుండేది. ఈ స్టోరీకి ప్రీక్వెల్ తెరకెక్కిస్తానని చెబుతున్నాడు. అందులో ఈ ఖడ్గం గురించి చెబుతా అని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇక ది ఘోస్ట్ సాంగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మ్యాజిక్ చూస్తే, ప్రవీణ్ సత్తారు నెరేషన్ బాక్సాఫీస్ లో వసూళ్ల వైబ్రేషన్ కి కారణమయ్యేలా ఉంది. భరత్ – సౌరభ్ లు అందించిన పాటలు బాగున్నాయి. మార్క్ కె రాబిన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది.

    నటీనటుల విషయానికొస్తే..

    నాగార్జున మంచి నటన చూపించారు. ఈ ఏజ్‌లో కూడా తనదైన ఈజ్‌తో నటించారు. మరోసారి యాక్షన్ ఎపిసోడ్స్‌లో ఇరగదీసారు. ఇక హీరోయన్ సోనాల్ చౌహాన్ కూడా బాగా నటించింది. ఆమె కూడా నాగార్జునతో పాటు యాక్షన్ సీన్లలో ఇరగదీసింది. ఇక నాగ్ సోదరికి నటించిన గుల్ పనాగ్ కూడా నటనతో ఆకట్టుకున్నారు. నాగ్ మేనకోడలిగా  అనికా సురేంద్రన్ నటించారు. మొత్తానికి దసరాకు అటు గాడ్ ఫాదర్, ఇటు ది ఘోస్ట్ సినిమాల దరువు పెరిగేలా ఉంది

    ప్లస్ పాయింట్స్

    నాగార్జున యాక్షన్ ఎపిసోడ్స్

    ఆర్ఆర్

    విజువలైజేషన్

    స్టైలిష్ మేకింగ్

    మైనస్ పాయింట్స్:

    రోటీన్ కథ

    క్లైమాక్స్

    సినిమాటిక్ లిబర్టీ

    చివరి మాట : స్టైలిష్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా..

    రేటింగ్ :2. 75/5

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    రేటింగ్

    కథ:
    2.5/5
    స్క్రీన్ ప్లే:
    3/5
    దర్శకత్వం:
    3/5
    సంగీతం:
    3/5

    Tags: Nagarjuna Akkineni, Praveen Sattaru, Sonal chauhan, The Ghost Movie, Tollywood

    ఉత్తమ కథలు