ఆస్కార్ దక్కించుకున్న తొలి భారతీయ డాక్యుమెంటరీ చిత్రం... చరిత్ర సృష్టించిందిగా

Oscar Awards 2019 : ఇది నిజమా, కలా అనిపించే సందర్భం. భారతీయ చిత్రాలకు ఆస్కార్ రావడం ఓ కల. దాన్ని నిజం చేసింది ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్.

Krishna Kumar N | news18-telugu
Updated: February 25, 2019, 7:25 PM IST
ఆస్కార్ దక్కించుకున్న తొలి భారతీయ డాక్యుమెంటరీ చిత్రం... చరిత్ర సృష్టించిందిగా
ఆస్కార్ అవార్డ్ దక్కించుకున్న డాక్యుమెంటరీ ఫిల్మ్
Krishna Kumar N | news18-telugu
Updated: February 25, 2019, 7:25 PM IST
అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో జరిగిన 91వ ఆస్కార్‌ అవార్డుల ప్రదాన కార్యక్రమంలో ఇండియన్ డాక్యుమెంటరీ ఫిల్మ్‌కి ఆస్కార్ అవార్డు దక్కింది. ప్రముఖ నిర్మాత గునీత్‌ మోంగా ప్రొడ్యూస్ చేసిన పీరియడ్‌ ఎండ్‌ ఆఫ్‌ సెంటెన్స్ అనే డాక్యుమెంటరీ సినిమాని ఆస్కార్‌ వరించింది. ఈ సినిమాలో ఇండియాలోని చాలా ప్రాంతాల్లో ఆడపిల్లలు ఎదుర్కొంటున్న పీరియడ్స్ (రుతుక్రమ) సమస్యలపై డాక్యుమెంటరీ రూపంలో చూపించారు. ఈ చిత్రానికి రేకా జెహ్‌తాబ్చి డైరెక్షన్ చేశారు. ఆస్కార్‌ అవార్డును అందుకున్న రేకా... స్టేజ్‌పై ఉద్వేగానికి లోనయ్యారు. ఓ మై గాడ్‌. మహిళలు ఎదుర్కొనే సాధారణ సమస్యపై నేను డాక్యుమెంటరీ తీస్తే దానికి ఆస్కార్ వచ్చింది. నాకు ఎంత ఆనందంగా ఉందో చెప్పలేను’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు.

oscar award, oscars, oscar awards, oscar awards 2019, oscar awards 2018, academy awards, 91st oscar award ceremony, annual academy awards, awards, oscar winners, oscar winning actors, annual awards, academy award for merit, oscar 2019 winners, oscars best actor, oscars best actors, oscar 2019, Period. End of Sentence, ఆస్కార్ అవార్డ్, ఆస్కార్ అవార్డు, భారతీయ చిత్రం, డాక్యుమెంటరీ చిత్రం
ప్రతీకాత్మక చిత్రం


ఇప్పటివరకు ఎన్నో ఇండియన్ సినిమాలు ఆస్కార్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యాయి. అవార్డు మాత్రం దక్కించుకోలేదు. ప్రతిసారీ నిరాశే ఎదురవుతోంది. అలాంటిది ఓ డాక్యుమెంటరీ చిత్రం ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును గెలిచి... ఆస్కార్ అవార్డు దక్కించుకున్న తొలి ఇండియన్ డాక్యుమెంటరీ ఫిల్మ్‌గా పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్ చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకూ భారతీయ చిత్రాలకు ఆస్కార్ ఇచ్చే విషయంలో వెనకడుకు వేస్తున్న న్యాయనిర్ణేతలు ఇకపై మన చిత్రాలవైపు కూడా పాజిటివ్‌గా చూస్తారనే ఆశలు కలుగుతున్నాయి.

 


ఇవి కూడా చదవండి :


గోల్డ్ స్కీముల్లో డబ్బులు పెట్టారా... కొత్త చట్టం వస్తోంది... అందులో ఏముందంటే...


స్మార్ట్‌ఫోన్‌లో స్క్రీన్‌షాట్ తీసుకోవాలా... 6 మార్గాలున్నాయి... ఇలా చెయ్యండి

Loading...

ఏటీఎం పిన్‌ మర్చిపోయారా... రీసెట్ చేసుకోవచ్చు... ఇలా చెయ్యండి...


తల లేకుండా 18 నెలలు బతికిన కోడి... ఎలా సాధ్యమైందంటే...

First published: February 25, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...