Samantha: సమంత అక్కినేని కీర్తి కిరీటంలో మరో బిరుదు..

అవును సమంత అక్కినేని.. పెళ్లి తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారింది. అంతేకాదు మ్యారేజ్ తర్వాత ఈ కెరీర్ పీక్స్‌కి వెళ్లింది. తాజాగా ఈ భామకు మరో అవార్డు వరించింది.

news18-telugu
Updated: January 23, 2020, 10:55 AM IST
Samantha: సమంత అక్కినేని కీర్తి కిరీటంలో మరో బిరుదు..
సమంత అక్కినేని (Instagram/samantharuthprabhuoffl)
  • Share this:
అవును సమంత అక్కినేని.. పెళ్లి తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారింది. అంతేకాదు మ్యారేజ్ తర్వాత ఈ కెరీర్ పీక్స్‌కి వెళ్లింది. ఇంట్లో అక్కినేని హీరోలందరు హిట్టు కోసం ఎదురు చూస్తుంటే.. ఈమె మాత్రం అలవోకగా సక్సెస్‌ల మీద సక్సెస్‌లు అందుకుంటోంది. తాజాగా ఈ భామ నటించిన ‘జాను’ సినిమా వచ్చే నెల 7న విడుదల కానుంది. తమిళంలో త్రిష, విజయ్ సేతుపతి జంటగా నటించిన 96 సినిమాను తెలుగులో రీమేక్ చేసారు. తమిళంలో ఈ సినిమాను తెరకెక్కించిన ప్రేమ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. తాజాగా సమంత.. సిల్వర్ స్క్రీన్ పై కాకుండా వెబ్ సిరీస్‌పై దృష్టి సారించింది. ఈ క్రమంలో ఫ్యామిలీ మేన్ సీజన్ 2 లో సమంత నెగిటివ్ పాత్రలో నటించింది. తాజాగా ఈ సిరీస్‌కు సంబందించిన షూటింగ్ పూర్తైయింది. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ఇప్పటి వరకు నేను పోషించిన పాత్రలన్నింటిలో ఇది పూర్తిగా డిఫరెంట్ అని చెప్పుకొచ్చింది. ఈ అవకాశం తనకు ఇచ్చిన రాజ్ అండ్ డీకేలకు ధన్యవాదాలు అని సమంత తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది.



 





View this post on Instagram




 

Every day on the sets of season 2 of The Family Man has been unforgettable.. To be given the opportunity and the trust to play a role so completely different from anything I have ever done before ... Thankyou @rajanddk 🤗 you know I love ya .. It feels like just yesterday when I locked myself in a dark room and promised to discover ‘her’ world as genuinely as I could .. And today on the last day of the shoot I can proudly say.. I definitely didn’t eff it up .. 🙃#thefamilyman


A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on






దీనికి దర్శకులు రాజ్ అండ్ డీకే స్పందిస్తూ.. మేము యాక్షన్ చెప్పిన ప్రతిసారీ.. మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకున్న విధానం చాలా గ్రేట్. మీరోక అద్భుతమైన నటి అంటూ కొనియాడారు. మీరు రెగ్యులర్‌గా చేసే క్యారెక్టర్ కాకపోయినా.. మేము చెప్పిన పాత్రలో మీరు అత్యుద్బుతంగా నటించారన్నారు. దాంతో పాటు రెబల్ స్టార్ సామ్ అని రాసిన కేక్‌ను సెట్‌లో కట్ చేయించారు దర్శకులు రాజ్ అండ్ డీకే.


First published: January 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు