నా చిరకాల కోరిక నెరవేరలేదు.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు

పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారని.. తన కోసం కూడా తమ పేరెంట్స్ చాలా కష్టపడ్డారని చెప్పింది సమంత.

news18-telugu
Updated: September 17, 2019, 8:10 PM IST
నా చిరకాల కోరిక నెరవేరలేదు.. సమంత ఆసక్తికర వ్యాఖ్యలు
సమంత
news18-telugu
Updated: September 17, 2019, 8:10 PM IST
తన చదువుకు సంబంధించి టాలీవుడ్ బ్యూటీ, అక్కినేని కోడలు సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో అవకాశాలు రావడంతో ఉన్నత చదవులు చదవాలన్న తన కల నెరవేరలేదని చెప్పింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీలో చదవాలన్నది తన చిరకాల కోరిక అని.. కానీ సినిమా వల్ల అది సాధ్యం కాలేదని వెల్లడించింది. హైదరాబాద్ సోమాజిగూడలో ఏర్పాటుచేసిన ఏజెంట్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సెంటర్‌ని మంగళవారం సమంత ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

విదేశాల్లో చదువుకోవాలన్న కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుందన్న సమంత.. అలాంటి వారి కలలను సాకారం చేసేందుకు హైదరాబాద్‌లో మంచి ఎడ్యుకేషన్ సెంటర్ ఏర్పాటుకావడం సంతోషంగా ఉందని తెలిపింది. పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారని.. తన కోసం కూడా తమ పేరెంట్స్ చాలా కష్టపడ్డారని చెప్పింది. యువత మంచిగా చదివి తమ భవితకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించింది సమంత. తాను నటిస్తున్న 96 మూవీ నిర్మాణ దశలో ఉందని..ఈ ఏడాది ఆఖరులో సినిమా విడుదలవుతుందని చెప్పింది.

First published: September 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...