KGF హీరో యశ్ హత్యకు కుట్రపన్నిన నేరస్థుడి ఎన్‌కౌంటర్..

KGF Yash: కన్నడ ఇండస్ట్రీలోనే కాదు.. ఒకే ఒక్క సినిమాతో ఇండియన్ వైడ్‌గా పాపులర్ అయ్యాడు యశ్. అప్పటి వరకు కన్నడలో మాత్రమే ఆయన స్టార్ హీరో కానీ కెజియఫ్ సినిమా తర్వాత తెలుగు, హిందీలో కూడా క్రేజ్ తెచ్చుకున్నాడు యశ్.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: February 28, 2020, 5:50 PM IST
KGF హీరో యశ్ హత్యకు కుట్రపన్నిన నేరస్థుడి ఎన్‌కౌంటర్..
అప్పటి వరకు ట్రైలర్స్, టీజర్స్ విడుదలవుతాయి కాబట్టి ఇంకా ఎక్కువ బిజినెస్ జరుగుతుంది అని వాళ్ళ అంచనా. అందుకే ఇప్పుడే సినిమా అమ్మ‌కూడదని వాళ్లు మెంటల్‌గా ఫిక్స్ అయిపోయారు. పైగా చాప్టర్ 1 సృష్టించిన సంచలనాలు చూసి చాప్టర్ 2 కోసం మూడింతలు రెట్లు ఎక్కువగా ఇస్తామంటూ వస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు.
  • Share this:
కన్నడ ఇండస్ట్రీలోనే కాదు.. ఒకే ఒక్క సినిమాతో ఇండియన్ వైడ్‌గా పాపులర్ అయ్యాడు యశ్. అప్పటి వరకు కన్నడలో మాత్రమే ఆయన స్టార్ హీరో కానీ కెజియఫ్ సినిమా తర్వాత తెలుగు, హిందీలో కూడా క్రేజ్ తెచ్చుకున్నాడు యశ్. అలాంటి స్టార్ హీరోను చంపడానికి కర్ణాటకలో కుట్ర జరిగింది. 2019లో ఈ కేసుపై చాలా చర్చలు కూడా జరిగాయి. అక్కడ సంచలనంగా మారింది ఈ కేసు. ఇప్పుడు ఇందులో ఇరుక్కున్న నేరస్థుడు స్లమ్ భరత్ హతమయ్యాడు. కర్ణాటకలో భరత్ కరుడుగట్టిన నేరస్థుడు. హత్య, హత్యాయత్నం సహా ఈయనపై దాదాపు 50కి పైగా క్రిమినల్​ కేసులు ఉన్నాయంటే మనోడు ఎంత డేంజర్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఈ నేరస్థుడే కెజియఫ్ స్టార్ యశ్ హత్యకు ప్లాన్ చేసాడు.

కేజీఎఫ్ మూవీలో యశ్ (Yash)
కేజీఎఫ్ మూవీలో యశ్ (Yash)


అందులో ప్రధాన నిందితుడు కూడా ఈయనే. ఇంతటి నేరచరిత్ర కలిగిన స్లమ్ భరత్‌ను ఇప్పుడు కర్ణాటక పోలీసులు మట్టుపెట్టారు. చాలా నేరారోపణలతో పరారీలో ఉన్న స్లమ్ భరత్‌ను రెండ్రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లో పోలీసులు అరెస్ట్ చేసారు.. ఆ తర్వాత బెంగళూరుకు తీసుకొచ్చారు. పోలీసులు చెబుతున్న కథనం ప్రకారం చూస్తుంటే క్రైమ్ సీన్‌‌లో రీ కన్సట్రక్షన్ చేస్తున్న సమయంలో పోలీసులపై దాడికి యత్నించాడని అతన్ని ఎన్‌కౌంటర్ చేసారు పోలీసులు. ఆ సమయంలో తమపై గన్ ఫైర్ చేసాడని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఒక బుల్లెట్ ఎస్సైకి తగిలింది. మరో బుల్లెట్ వెహికల్‌కు తాకిందని వాళ్లు చూపించారు. బల్లెట్ ప్రూప్ జాకెట్ ఉండటంతో ఎస్సైకి ఎలాంటి హానీ జరగలేదని చెప్పారు పోలీసులు.

కేజీఎఫ్ మూవీలో యశ్ (Yash)
కేజీఎఫ్ మూవీలో యశ్ (Yash)


నిందితుడు అక్కడ్నుంచి కారులో ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నించడంతో.. మరో దారి లేక పోలీసులు కూడా వెంబడించి హేసరఘట్ట ప్రాంతం దగ్గర ఇద్దరి మధ్య కాల్పులు జరగడంతో భరత్ పొత్తికడుపులోకి, కాలులోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. అక్కడ తీవ్రంగా గాయపడిన భరత్‌ను దగ్గర్లోని సప్తగిరి ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి విక్టోరియా ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మధ్యలోనే చనిపోయాడు. 2019 మార్చి 7న స్లమ్​ భరత్ అతని అనుచరులు కలిసి కెజియఫ్ హీరో యశ్​ను హత్య చేసేందుకు కుట్ర పన్నారు. ప్లాన్ పసిగట్టిన పోలీసులు అరెస్ట్ చేసారు.. తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇప్పుడు ఇలా హతం అయ్యాడు.
Published by: Praveen Kumar Vadla
First published: February 28, 2020, 5:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading